నా గురించి
నన్ను కొందరు ప్రసాద్ అని మరి కొందరు రేణుక అని (సందేహం వద్దు నేను మగవాన్నే!) ఇంకొందరు రేణుకా ప్రసాద్ అని అంటారు. ఇంటి పేరు చరసాల. మా ఇంటిపేరు గల ఇంకొందరు చెరసాల అని కూడా వ్రాస్తారు. బహుశా చెరసాల నే సరైనది అయుండవచ్చు. నాకు తెలిసి చరసాల కు అర్థం లేదు.
మా ఉర్లో కొందరు దీన్ని కొద్ది యస మిళితం చేసి "చెరచాల" అని కూడా అంటారు. 'చరసాల ' అంటే "జైలు" అని అర్థం తెలియని వారు దీన్ని 'చెరచడం' అనే అర్థంలో అర్థం చేసుకుంటారు. అలాగే మమ్మల్ని వెక్కిరిస్తారు కూడాను.
అయితే అలాంటి వారికి మానాన్న కూడా అంతే చమత్కారంగా బదులిస్తారు. కృష్నుడు మా వంశములో చెరసాలలో పుట్టీనప్పటినుండీ మా ఇంటిపేరు చెరసాల అయిందంటాడు! 🙂
ఇక చాలా మందికి గొప్ప పెద్ద సందేహం ఏంటంటే ఆడ పేరు 'రేణుక ' నాకెందుకు పెట్టారని. దీనికి ఒక చిన్న కథ ఉంది. నాకు మొదట పెట్టిన పేరు ప్రసాద్ మాత్రమే. కాని బడిలో చేర్పించేటపుదు అక్కడి ఉపాద్యాయురాలికి ఒట్టి ప్రసాద్ బాగుండదనిపించి మా నాన్న అనుమతితో నా పేరు 'రేణుకా ప్రసాద్ ' గా మార్చింది. అందువల్ల బడిలో నా పేరు రేణుక గా ఊర్లో నా పేరు ప్రసాద్ గా ఉండి పోయింది.
ఇక "రేణుకా ప్రసాద్" ఆడవారి పేరు అనేవారితో నేను ఏకీభవించను. "లక్ష్మీ ప్రసాద్", "లక్ష్మి నారాయణ" ఆడవారి పేర్లు కానప్పుడు నాపేరు కూడా ఆడ పేరు కాదు అనేది నా వాదన. మీరు అంగీకరిస్తారా?
ఇక ఈ అమెరికకి వచ్చాక SSN కి apply చేసేప్పుడు కావాలనే మొదటి పేరు "ప్రసాద్" గా చివరి పేరు "చరసాల" గా "రెణుక" మద్య పేరు గ వ్రాశాను. వాల్లు కూడ దాన్ని పరిశీలించలేదు. ఆ విధంగా SSN, credit cards, mortagage మొదలైనవి "ప్రసాద్ చరసాల" పేరు మీద ఉంటే, driving licence, passport, GC మాత్రము "రేణుకా ప్రసాద్ చరసాల" పేరు మీద ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గజిబిజి వల్ల ఇబ్బందులు ఎదురు కాలేదు. ముందు ముందు వస్తాయేమొ తెలియదు.
10:43 ఉద. వద్ద మే 16, 2007
Hi,
I liked reading your blog.
Thanks for introducing the book “Ucalya”.
Keep writing
thanks
venkat
http://www.24fps.co.in
8:26 ఉద. వద్ద సెప్టెంబర్ 15, 2007
Hi,
Can you pl’s suggest me telugu burrakadalu websites or blogs etc..
Keep it your blog going..its very interesting…
Thanks
Ramana