దేవుడి పుట్టుక

రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ ఒకేలా చల్లదనాన్ని ఇచ్చినట్లు. ఆ శక్తికి మంచి, చెడ్డా విచక్షణ తెలియదు. పసి పాపకి, వృద్దుడికి తేడా తెలియదు. ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటాను.
ఇప్పుడు ఆ దేవుడి పుట్టుక ఎప్పుడు అంటే ఏమనాలి? దేవుడికి పుట్టుక లేదు. ఆది అంతాలు లేవు. ఈ దేవుడు ఎప్పుడూ వున్నాడు, కాలం ఎప్పుడూ వున్నట్లు. దేవుడిని నీవు గుర్తించినా గుర్తించకున్నా దేవుడున్నాడు. నీవు గుర్తించిన రోజు దేవుడు పుట్టినట్లు కాదు. న్యూటన్ కనుక్కోక ముందూ గురుత్వాకర్షణ వుంది తర్వాతా వుంది. అది కనుక్కోబడిందే కానీ తయారుకాబడలేదు, సృష్టింపబడలేదు. దానికి పుట్టుక లేదు. అలాగే అంతమూ లేదు. రేపు మానవ జాతి అంతా అంతమైనా అది వుంటుంది. దాన్నే సత్యము అని కూడ అనొచ్చు. ఏది మార్పు చెందదో, ఎప్పటికీ నిలిచి వుంటుందో అది సత్యము. దానికి ఆది అంతాలు లేవు. వేదాలు గురించి ఇలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది రాయబడిన వాటి గురించి కాదు ప్రవచించబడిన ధర్మాల గురించి. ధర్మము ఎప్పుడూ ధర్మమే మనిషి పుట్టకముందునుంచీ, మనిషి నశించి పోయాక కూడా!

ఇక రూపము! నా దేవుడికి రూపం లేదు. అయినా ప్రతి దానిలోనూ చోడొచ్చు. శక్తి కనపడదు, దాన్ని అనుభవించాల్సిందే! గాలిని స్పర్షాజ్ఞానముతో తెలుసుకున్నట్లు. ప్రతి శక్తీ దేవుడే, ప్రతి జీవీ దేవుడే. ఈ సకల చరాచరాలలోనూ దేన్నీ అతన్నుంచీ మినహాయించలేము. జలచరాలన్నీ ఎలా సముద్రంలోనే వుండి సముద్రం రూపాన్ని చూడలేవో అలానే మనమూ దేవుడిలోనే వుండి అతని రూపాన్ని చూడలేము. ఎల్లలు లేని రూపాన్ని, ఊహకు కూడా అందని దూరాన్ని ఎలా అదిగమించి రూపాన్ని చూడగలం! అయిటే ఈ కనిపించేదీ, కనిపించనిదీ, నేను, నువ్వూ అందరం దేవుడిలో భాగమే! ఎక్కడయితే ప్రాధమిక భౌతిక సూత్రాలు న్యాయమౌతున్నాయో అవన్నీ కూడా దేవునిలో భాగమే! రెండు రెళ్ళు నాలుగయ్యే ప్రతిచోటూ దేవుడే!

ఇక అంచెలంచెలుగా ఎదగడానికేముంది. సర్వ వ్యాపితమైనవాడు, పుట్టుక, నశింపు లేనివాడు ఇక పెరిగేదెలా? పెరగడానికి ఇంకేం మిగిలివుంది? పుట్టడం, పెరగడం, నశింపచడం నిర్దేశించే దేవుడికే పుట్టుక వుంటే, పెరుగుదల వుంటే మరి ఆ దేవుడి పుట్టుకకు ముందు ఏమున్నట్లు? వుందడం, వుండకపోవడమనేవి రెండూ దేవుడి భిన్న పార్శ్వాలే అయితే ఇక దేవుడు సృష్టికి ముందూ వున్నట్లే కదా!

— ప్రసాద్

8 వ్యాఖ్యలు to “దేవుడి పుట్టుక”

  1. jabalimuni Says:

    DEar Prasad,
    I fully endorse your views.Your concepton of God is in resonance with my logical thinking.One need not go to see God in temples but can find in every living and nonliving entities in the whole universe.

  2. T.Raja gopal Says:

    Dear Prasad garu,
    Your concetption of God is correct to a learned, Logical and scientific thinking person. But in my view the conceipt of God , Temple , fear of God etc are created for the ordinary ( Paamarulu) people to conduct their lives in the society in an orderly and disciplined manner based on moral principles( Dharma). The fear of some unknown God will make some people not to do any immoral acts. I think to that extent the word
    ” God “is helping to certain people.
    Raja gopal.

  3. charasala Says:

    రాజ గోపాల్ గారూ!
    నాకూ ఇలాంటి భయం లేక పోలేదు. అందుకే ఇంతకు మునుపు ఒక బ్లాగులో “దేవుడు లేడు, స్వర్గం నరకం లేవు అనడం, చేసిన తప్పుకు తీర్పూ లేదు, శిక్షా లేదు అనడం లాంటివి” అన్నాను. మామూలు మనుషులకు ఈ భయం అవసరమే అనిపిస్తుంది. కానీ ఇలా అవసరం కొద్దీ మనమే సృష్టించుకొన్న రాతిదేవుళ్ళు మనల్నే మింగే పరిస్థితిని చూస్తే సత్యము చెప్పినా పెద్దగా తప్పులేదేమొ అనిపిస్తుంది.

    — ప్రసాద్
    https://charasala.wordpress.com

  4. radhika Says:

    devudu ledani ,swargam,narakam ledani nijam ga nammite manam challa tappulu alochinchakunda chesestamemo?devudunnadane bhayam valle manam koddiga anna alochistunnamani naa abhipraayam.ika vigrahaaraadhana antaara….a manishi evari daggara talavanchadaaniki istapadadu.appudu ahamkaram perugutundi.oka shakthi ni nammi oka ruupaniki talavanchi namaskariste taggedi ahamkaarame gani..inkemi kaaduga.rathi vigrahalu emi chestunnayandi manalini..chestunnadi maname . [ilanti vishayalu matlade vayasu kani,anubhavam gani naaku ledandi.kani edo na abhipraayam cheppanu.tappulu vunte kshaminchagalaru]

  5. Nagaraja Says:

    బాగా చెప్పారు.

    ఇక పోతే కామెంట్లలో వ్రాసినట్టు, భయం కారణంగా మన ప్రవర్తన మారుతుంది అనేది నేను ఒప్పుకొను – ఒక సారి మన సమాజాన్ని గమనించండి… అలాగే ఒక చిన్న పిల్లవాడిని భయపెట్టి చూడండి ఎం చేస్తారో! మీకే తెలుస్తుంది. అలాగే రాళ్ళకు, గతించిన వాళ్ళకు తలవంచడం వల్ల అహంకారం తగ్గితే బాగానే ఉండేది.

    నేనూ చిన్నప్పుడు అలాగే ఆలోచించేవాడిని 🙂

  6. t.sujatha Says:

    చక్కటి నిర్వచనం.

  7. రఘునాధ రెడ్డి బుర్రి Says:

    ప్రసాద్ గారు,

    చక్కటి విశ్లేషణను రాసినారు, “ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటా” రాసినారు అదే నిజం.

    మరమరాలు

  8. versapers emotion Says:

    Appreciation to my father who shared with me regarding
    this weblog, this web site is truly amazing.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: