అప్పుడప్పుడూ మరీ పచ్చిగా మాట్లాడి బెదరగొట్టేస్తున్నా ఫరవాలేదనిపిస్తున్నాడు. కాంగిరేసు మాంత్రి అయివుండీ బాబును పొగడటం, ఎదుటిపక్షము వాళ్ళు తప్పును తప్పుగా ఒప్పుకోవటం ఈ కాలం రాజకియనాయకుని లక్షణం కాదే!
http://www.eenadu.net/story.asp?qry1=1&reccount=25
Archive for జూలై, 2006
నాకీ MS ఎందుకో నచ్చేస్తున్నాడు!
జూలై 28, 2006హద్దూ, అదుపూ లేని ఇజ్రాయెలు
జూలై 28, 2006మొత్తం మీద ఇప్పుడు అమెరికాకు ఎదురు చెప్పే పరిస్తితి ఎటువైపు నుంచీ, దూరంగా కూడా కనిపించట్లేదు. బూషయ్య నీతిలో రెండే వర్గాలు, అమెరికాతో వున్నవారు (aka మిత్రులు) అమెరికాతో లేనివారు (aka శత్రువులు). ఇక అలీన దేశాలు, అలీన సిద్దాంతము అటకెక్కినట్లే కదా! అంతో ఇంతో అశక్తి రాజ్యాల తరపున మాట్లాదుతున్న ఇండియా కూడా అణు ఒప్పందము, ఐక్యరాజ్యసమితిలో శాశ్వతసభ్యత్వము లాంటి కోర్కెలకై అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడలేకున్నది. తనతో వుండటమో, తనకు వ్యతిరేకంగా వుండటమో అనే రెండే గ్రూపులు కనుక ఇండియా కూడ తనతో వుండటానికి నిశ్చయించుకొన్నట్లుంది. పెళ్ళయ్యాక పెళ్ళాం మాటకు కూడా విలువనియ్యాల కదా, అది మంచిదైనా, చెడ్డదైనా, ఇండియా పరిస్తితి అలాగే వుంది. అమెరికా పద్దతి బాగాలేదని తెలిసినా వియ్యమందాలంటే దాని తప్పుల్ని చూసిఛూడనట్లుండాల్సిందే కదా.
చూడండి ఇజ్రాయెలుకు ఎలా వంత పాడుతోందో. మాట వరసకైనా అమాయకప్రజల మీద దాడులు ఆపమని చెప్పట్లేదు. పైగా యూరోపియన్ యూనియన్‌తో కూడా తన మాటనే అనిపించేసింది. నల్లులు తనతో వున్నందుకు మంచానికీ దెబ్బలు తప్పనట్లే, ఈ తీవ్రవాద మూకలు తమతో వున్నందువల్ల అమాయక ప్రజలకీ తిప్పలు తప్పట్లేదు. కానీ ఈ అన్యాయాన్ని చూస్తూ కూడా ప్రపంచదేశాలు ఎలా మూగనోము పట్టాయో చూడండి. ఈ అరబ్బుదేశాలది ఇంకో పాట. తీవ్రవాద మూకలని నొప్పించడానికి అసలు మాట రాదు. అసలు వాళ్ళ బలమంతా వీళ్ళేగా! ఈ దేశాల సహాయం లేనిదే హిజబుల్లా లాంటి వాళ్ళకి రాకెట్లూ, బాంబులూ ఎలా దొరుకుతాయి.
అనువుగాని చోట అధికుల మనరాదన్న నీతి ఈ మిలిటెంట్ మూకలకూ తెలియదు. వెళ్ళి వెళ్ళి సింహం తోక పుచ్చుకు లాగుతారు, అది ఇదే అదనని మొత్తాన్నే మింగేస్తుంది. అదేమన్న ఇండియా లాంటి వేదాలు వళ్ళించే పవిత్ర గోవు లాంటిదా, ఎంతమంది పౌరులు, సైనికులు చనిపోయినా హెచ్చరికలతో సరిపెట్టడానికి?
అసలు ఈ రాళ్ళ కుప్పలతో, AK47లతో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆపగలమని ఎలా అనుకుంటారో! తమలపాకుతో నీవొకటంటే తెడ్డుకట్టెతో నేరెండంటా అనేరకం కదా ఇజ్రాయెల్.
హెచ్చరించే వాడు లేడు, బలంలో సరితూగే దేశమేదీ చుట్టుపక్కల లేదు, ఇక దానికి హద్దేముందీ! ఇలా గాయపడుతున్న చిన్నపిల్లలు రేపు మిలెటెంట్ నాయకులయి ప్రతీకారం తీర్చుకోవటానికి ఎదురుచూడరని గ్యారంటీ ఏమిటి?
ఈ పిల్లీ ఎలుకా ఆట ఇలా సాగుతూ పసిపిల్లలనీ, అమాయకులనీ కాల్చేస్తుంటే రోజూ యుద్దవార్తలు చదివి నిట్టూర్చడం తప్ప ఏం చేయగలం.
హింసకు హింసే సమాధానమనే ఈ ఇరుపక్షాలకూ చివరికి హింస ఏమీ మిగలదు.
చిన్న తప్పుకు పెద్ద శిక్ష!
జూలై 27, 2006http://news.bbc.co.uk/2/hi/programmes/5217424.stm
అసలు నన్నడిగితే వ్యభిచారం నేరమే కాదు. బలాత్కారమే నేరం. ఇద్దరిమద్య సంపూర్ణాంగీకారముతో లైంగిక సంబందం ఏర్పడితే దాన్ని ఎలా నేరమనాలి? ఎవరు ఎవరికీ ఏ హానీ చేయకున్నా అది నేరమెలా అవుతుంది? కాకపోతే దీన్ని అంగీకరించడానికి మన preconditioned mindset ఒప్పుకోదు. అందునా ఒడలెల్ల మతోన్మాదము తలకెక్కిన మతపిచ్చి గాళ్ళకి అసలు ఎక్కదు. ఆడవాళ్ళు, అన్యమతస్తులు మనుషులకింద లెక్కరారు వీరికి, వాళ్ళకు తెలిసిందే వేదం, న్యాయం. వ్యభిచారం స్త్రీ, పురుషుల ఇద్దరి భాగస్వామ్యం తోనే జరిగినా స్త్రీకి ఒక న్యాయం, పురుషునికి ఒక న్యాయం. ముందే అబల ఆపైన పురుషాహంకారము, మతపిచ్చి ప్రాధమిక న్యాయసూత్రాలనే తుంగలో తొక్కి స్త్రీని నలిపివేస్తాయి. చీకట్లో రంకు నేర్చినవాడే పదిమందిలో అది పతిత అని తీర్పిస్తాడు.
పాకిస్తాన్‌లో జరిగినా, బీహార్‌లో జరిగినా, ఇరాన్‌లో జరిగినా పదిక్షణాలు సుఖాన్ననుభవించి గాలికిపోయే దుర్మార్గుడి చేతిలో ఆ తర్వాత తొమ్మిది నేలలు ఆ భారం మోయాల్సిన ఆడదే బలిపీఠమెక్కుతోంది. నన్ను బలాత్కరించాడహో అని మొరపెట్టుకున్నా నిరూపించడానికి మరికొందరు మగాళ్ళే సాక్ష్యం కావాలట! ఒక ఆడది బెదిరింపులకు లోంగిరాకుంటే అది పతిత అని ఒక మగవాడు ముద్ర ఏస్తే సరి ఇక ఆ ఆడది బలిపీథమెక్కాల్సిందే! అసలు ఈ నీతిపోలీసులు మగవాళ్ళే అయినప్పుడు, వాళ్ళకు నచ్చిన అబలను కేసుల పేరు చెప్పి లొంగదీసుకోరని గ్యారంటీ ఏమిటి?
ఎంత నాగరీకులమైనా ఇలాంటి అనాగరికులని ఇంకా బరించాల్సిరావటం మన ఖర్మ.
— ప్రసాద్
పరమాత్మ
జూలై 25, 2006http://rohiniprasadkscience.blogspot.com/ ఈ బ్లాగు చూశాక ఇక నా స్పందనను దాచుకోలేక పోయాను.
నా మట్టుకు నాక్కూడా ఖచ్చితంగా దేవుడంటే ఇలాంటి భావాలే వున్నాయి. సృష్టిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవన్నీ అలానే జరగాలనేది భౌతిక సూత్రమనేది నా అభిప్రాయము. భూమికి ఆకర్షనశక్తి ఎందుకు వుండాలి, ఈ గ్రహాలన్నీ తమ తమ నిర్దేషిత కక్ష్యల్లోనే ఎందుకు ప్రయానించాలి లాంటి ప్రశ్నలకు నా సమాధానం, “సత్యమే ఎందుకు పలకాలి” అన్నదానికి జవాబు ఎలా లేదో, అలానే వీటి ప్రవర్తనకు జవాబు లేదు. ఒకవేళ వున్నా అది మళ్ళీ జవాబులేని ప్రాధమిక సూత్రాలను బట్టే వుంటుంది. ఈ సృష్టి అంతా కొన్ని వాదించలేని, తర్కించలేని ప్రాధమిక భౌతిక సూత్రాలపై ఆధారపడి వుంది. కత్తితో పొడిస్తే అది పుణ్యాత్మున్నైనా, పాపాత్మున్నైనా ఒకేలా భాధిస్తుంది. కత్తికి, బాధకు సంబందం లేదు. అలాగే కత్తి గుచ్చుకుంటే భాధ కలగాలి అన్నది ప్రాధమిక సూత్రం. ఇందుకు కటిక బీదవాడికైనా, సత్యసాయి బాబా కైనా మినహాయింపు లేదు. అలాగే పదార్థాము చైతన్యమయము కావడము, చైతన్యరహితం కావడం అన్నీ కూడా ఇంకా కనిపెట్టని ప్రాధమిక సూత్రాల మూలంగా జరుగుతున్నవే. అయితే ఇక్కడే ఎక్కడో భౌతిక వాదము, ఆద్యాత్మిక వాదము కలుస్తాయనుకుంటాను. జంతువుల తలలతో దేవుళ్ళను పూజించడం ఇవన్నీ అత్యున్నత స్తాయిలోని అద్యాత్మికవాదాన్ని తెలుసుకోలేని అల్పబుద్దులను సంతోషపెట్టాడానికి చేసిన nopnsense అనిపిస్తుంది. అయితే అన్నిటిలోనూ వుండి అన్నీ తనలో వుండే సర్వాంతర్యామి దేవుడు అంటే నేను పెద్ద వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇప్పటివరకూ అనుకున్న తర్కించలేని, వివరించలేని ఏ ప్రాధమిక భౌతికసూత్రాలపై ఆధారపడి ఈ సృష్టి, విశ్వం, చైతన్యమవుతూ వుందో, పదార్థం చైతన్యసహితమూ, చైతన్యరహితమూ అవుతూందో, ఆ భౌతికసూత్రాలనే పరమాత్మ అనుకోవచ్చేమో. అయితే అంతమాత్రాన ఆ పరమాత్మకి బుద్దిని జోడించి పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, బలులివ్వడం ఎంత అవివేకమంటే పైకి విసిరిన కింద పడకూడదని, గాలిలో పెట్టిన దీపం ఆరిపోకూడదని ప్రార్థించడం లాంటిది. ప్రతి క్రియకూ పలితం భౌతికసూత్రాలపై ఆదారపడి వుందే కానీ అది పూజల వల్ల వ్రతాల వల్ల మారదు.
అయితే ఈ సత్యాన్ని నగ్నంగా చూపడంవల్ల ఈ స్థాయిలో ఆలోచించని వారు, భగవంతుడూ, స్వర్గం, నరకం లేవు అంటే పాపభీతి లేకపోవడం వల్ల సమాజానికి అనర్థం చేస్తారేమొ. ఇలా ఆలోచించడం కూడా తప్పేనేమొ, ఈ దేవుళ్ళమీద విశ్వాసం వుంచడం వాల్ల మాత్రం ఇప్పుడేం జరుగుతున్నది? మతాలపేరుతో చంపుకోవడాలేగా!
— ప్రసాద్
https://charasala.wordpress.com
ఇది ఎన్నోది?
జూలై 24, 2006చేతులు కాలాక ఆకులు పట్టుకునే మన నైజం ఎంతకూ మారదనేందుకు ఈ ఉదాహరణ చాలు. ఆ మధ్య ఒకసారి చెన్నైలో బోర్‌బావిలో పడిన బాలుడు, ఒకటి రెండురోజుల విఫలప్రయత్నం తర్వాత ఆ బాలుడి శవం వెలికితీత. ఆ తర్వాత కర్నాటకలో ఒకసారి, మన రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఇలాగే జరిగింది. నాకు గుర్తున్నంత వరకు ఒకేఒక్కసారి ఒక సాహసబాలుడు కాళ్ళకు తాడు కట్టించుకుని ఆ బావిలోకి తలక్రిందులుగా వెళ్ళి ఇరుక్కుపోయిన బాలున్ని రక్షించగలిగాడు. మిగిలిన అన్ని కేసుల్లోనూ ఎన్నో ప్రయత్నాల తర్వాత బాలుడు చని పోవటం, తల్లిదండ్రులు విపిరీతంగా ఏడవటం, మనందరం కూడా తరగని కన్నీళ్ళలోంచి కొన్ని బొట్లు రాల్చి జాలిగుండెవారమనిపించుకోవడం.
ఇప్పుడు మళ్ళీ ఇంకో బాలుడు http://www.cnn.com/2006/WORLD/asiapcf/07/23/india.boy.saved.ap/index.html. కథ సుఖాంతమే, కానీ ఇన్ని ప్రమాదాలు, కేవలం మన నిర్లక్షము వల్ల జరుగుతుంటే, మళ్ళీ ఇంకో బాలుడు పడే వరకూ వేచిచూడడమేనా మనం చేయగలిగింది? ఆ బావిని అలా తెరిచివుండడానికి కారకులెవరు వారికి శిక్ష ఏంటి? ఇలాంటివి జరక్కుండా ప్రతి ఊరిలోనూ కనీసం పిల్లలున్న తల్లిదండ్రులైనా వాటిని కప్పడానికి చర్య తీసుకుంటున్నారా? మన పిల్లాడు పడితే గానీ తెలియదు భాధ! పడిన తర్వాత దేవున్ని, సైన్యాన్ని, అల్లా ను ప్రార్థించడం తప్ప ముందుగా నివారణ ఏమీ చేయలేనంత పెద్ద కార్యమా ఇది, కేవలం నిర్లక్ష్యము, కర్మను నమ్మడము తప్ప?
ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో కిటికీ తెరలకు వేలాడే దారాలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఒక బాలుడు మెడకు చుట్టుకొని చనిపోయాడట, ఇప్పుడు వాటి గురించీ ఎన్నో జాగ్రత్తలు చెప్పే లబెల్ వాటికి వుంటుంది. పిల్లలకు అపాయకరమన్న ప్రతి దాని మీద ప్రమాద హెచ్చరిక వుంటుంది.(ప్లాస్టిక్ సంచీలతో సహా!) మనకు అలాంటి జాగ్రత్త వుందా? వేలాడే విధ్యుత్ తీగలు, ముందు హెచ్చరికలు లేని తీవ్రమైన దారి మలుపులు, పిల్లలకు వీలయ్యే విధంగా మందుసీసాల బిరడాలు! ఒకటేమిటి ప్రతి దాని విషయంలోనూ అజాగ్రత్త, నిర్లక్షం.
అమెరికాలో ఏమందు సీసా కూడా పిల్లలకు వచ్చేవిధంగా వుండదు. మొన్నామధ్య మా మూడేళ్ళ అమ్మాయి, ముక్కుల్లో వేసే మందును బలవంతంగా మా ఏడాది వయసున్న అబ్బాయికి ముక్కులో వేస్తోంది. (ఇది ప్రమాదకరం కాదు కనక దీని మూత సులభంగానే వస్తుంది). చూసి వారిస్తే, “వాడికి జలుబు చేసి, ముక్కులు గాలి ఆడకుండా వుంటే వేస్తున్నా” అంటు సమర్థిస్తోంది. అదే ఏ ప్రమాదకరమైన మందో అయివుంటే ఎంత అనర్థం జరగడానికి వీలుందో ఆలోచించండి. మనకు ఏ మందైనా చాలా సులభంగా మూత వచ్చేస్తుంది, దాన్ని జాగ్రత్తగా పెట్టడం తల్లిదండ్రుల విజ్ఞతపైనే ఆధారపడి వుంటుంది.
ఈ జాగ్రత్తలన్నీ మనం మళ్ళీ కొత్తగా నేర్చుకొని కనిపెట్టక్కర్లేదు, అభివృద్ది చెందిన దేశాలను చూసి నేర్చుకుంటే చాలు. చూసి నేర్చుకోవడం తక్కువతనమనిపించుకుంటే చూసికూడా నేర్చుకోకపోవటాన్ని ఏమనుకోవాలి? మందబుద్దులా, వాజమ్మలా?
— ప్రసాద్
అలవాటు 1 Proactivity (Habit 1 from 7 habits of highly effective people)
జూలై 21, 2006ఈ పుస్తకం చదవనంత వరకూ proactivity అంటే నాకూ దురభిప్రాయము వుండేది. దుందుడుకుగా, దూకుడుగా చేయటమని. కానీ proactivity కివి విరుద్దం.
బాధ్యత తీసుకోవటం, initiative (ఎంత ఆలోచించినా బుక్ లో ఇంగ్లిష్ పదాలతో conditioned కాబడడం వల్ల తెలుగు పదాలు తట్టడం లేదు) తీసుకోవటం proactive (స్పందించడం) లక్షణాలు. ఈ క్రింద పట్టిక స్పందనకు (proactive), ప్రతిస్పందనకు (reactive) మద్య భేదాన్ని స్పష్టంగా చూపుతాయి.
ప్రతిస్పందన(Reactive) | స్పందన(Proactive) |
---|---|
నేను చేయగలిగిందేమీ లేదు. | ప్రత్నామ్యాయాలు వున్నాయేమొ అలోచిద్దాం. |
నేనంతే. | ఇంకో విదంగా చేస్తాను. (I can choose a different approach) |
అదే నన్ను పిచ్చివాన్ని చేసేది. | నా భావాలని నేను అదుపులో పెట్టుకోగలను. |
అట్లైతేనే చేస్తాను. | నేను ప్రతిభావంతంగా దీన్ని ప్రదర్శించగలను. |
నేనది తప్పక చేయాలి. | నేనేది చేయాలో నేనెంచుకోగలను. |
వాళ్ళది చేయనివ్వరు. | నేనే ఎన్నుకుంటా. |
నా వల్ల కాదు. | నేను చేయగలను. |
చేయక తప్పదు. | I prefer. |
Stimulus (ప్రేరేపణ) –> Response (జవాబు)
రచయిత మాటల్లో We are conditioned to respond in a particular way to a particular stimulus. మనం ఒక విధంగా మలచబడ్డానికి (conditioned) మూడు రకాలైన కారణాలు ఉన్నాయి.
జన్యు పరంపర: కొన్ని మన వంశమునుండి సంక్రమిస్తాయి.
పెంపకము: మనల్ని పెంచిన తీరు మనల్ని మలుస్తుంది.
అనుభవము: అనుభవం వల్ల, చదివి తెలుసుకున్న దాని వల్ల కూడా మలచబడతాము.
సాదారణంగా మన ఒక stimulus కి మనం ఇచ్చే జవాబు మనం ఏవిదంగా మలచబడ్డాము అనేదాన్నిబట్టి వుంటుంది. ఒకడు నీ చెంప మీద కొడితే తిరిగి వాడి చెంప పగుల గొట్టాలా, లేక ఇంకో చెంప చూపించాలా అనేది మనం ఎలా మలచబడ్డాము అనేదాన్ని వుంటుంది.
proactive వ్యక్తి జవాబు ఎలా వుండాలి అనేది, చెంప పగుల గొట్టాలా లేక ఇంకో చెంప చూపించాలా అనేది తనే ఎన్నుకుంటాడు, దాన్ని తను మలచబడ్డ తీరు నుంచి విడిగా చూసి తన నిర్ణయాన్ని తీసుకుంటాడు.
reactive వ్యక్తి జవాబు ఎన్నుకోలేడు. తను ఈ stimulus కి ఈ response అని pre-program చేయబడ్డాడు.
సమస్యావలయము (Circle of Concern)
మనకు ఎన్నో సమస్యలుంటాయి. ఉద్యోగం రాలేదనో, పై అధికారి గుర్తించట్లేదనో, బార్య ప్రవర్తన బాగా లేదనో, దేశంలో తీవ్రవాదం గురించో, పెరిగి పోతున్న అవినీతి గురించో, మద్య ఆసియా సంక్షోబము గురించో. వీటిని మనం రెందు రకాలుగా విభజించవచ్చు.
1. మన ప్రమేయం ఏ విదంగానూ లేనివి.
2. మనం కొద్దిగా ప్రబావితం చేయగలిగినవి.
ఇందులో మొదటివి వదిలేస్తే మిగిలిన వాటి చుట్టూ ఒక గీత గీస్తే అవి మన Circle of influence అవుతుంది. మనం మన ప్రబావం లేని సమస్యల జోలికి పోకుండా మన ప్రబావం చూపించగలిగిన వాటి మీద కేద్రీకరించదం ద్వారా మన influence ను పెంచుకోగలుగుతాము. దీన్ని వివరించడానికి రచయిత గాందీని ఉదాహరణగా చూపాడు.
గాందీ దక్షిణాఫ్రికా నుండి బారతదేశానికి వచ్చినపుడు, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారిని నిందిస్తూ కూర్చున్నారు. తమ ప్రభావశీలత్వాన్ని పెంచుకోకుండా, బయటివారి శీలత్వాన్ని నిందిస్తూకూర్చున్నారు. కానీ గాందీ రాజకీయపదవుల జోలికి పోకుండా తన character నుండి పని ప్రారంబించాడు. పల్లెల్లో హీన స్థితిలో వున్న రైతులనుండి తన ప్రభావాన్ని (influence) ను పెంచుకుంటూ మొత్తం కోట్ల జనాభాని తన తను మాట్లాదిందే వేదం అనేట్లు చేశాడు.
అంతిమంగా నేను అర్థం చేసుకున్నదేమంటే, reactive person, environment మారితేనే గాని తను మారలేను అనుకుంటాడు. తన పరిస్థితికి తన చుట్టూ వున్న పరిస్థితులే కారణం అంటాడు. బయటనుండి లోపలికి మార్పు రావాలంటాడు.
proactive person లోపలనుండి బయటకు మార్పు రావాలంటాడు. తను మారతాడు, తన శీలాన్ని మెరుగుపర్చుకుంటాడు. ఆ విధంగా బయటి ప్రపంచంలో మార్పు తీసుకు వస్తాడు.
ఇంకా ఈ పుస్తకంలో చాలా concepts మనసుకు అందుతున్నాయే గానీ పెన్నుకు అందటం లేదు. లేదా నాకు వాటిని సరిగ్గా వ్యక్తీకరించటం చేత కావట్లేదు.
రేపు అంటే సోమవారం రెండవ అలవాటు (Habit 2) గురించి ముచ్చటిద్దాం.
నేను ఈ పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లయితే ఈ పుస్తకాన్ని ఇప్పటికే చదివిన వారు నన్ను సరిదిద్దగలరు.
— ప్రసాద్
జోడు పదవుల బిల్లు తిప్పి పంపుతారట!
జూలై 20, 2006సిగ్గులేని జన్మలు. కలాం చెబితే మాత్రం వింటారా! ఒక్క పదవీ లేక అల్లాడే నిరుద్యోగులు వేల వేలు. జోడుపదవులుండటానికి మాత్రం అఖిలపక్షాల ఏకాభిప్రాయం! అదే స్త్రీలకు రిజర్వేషన్లకైతే వీరికి సమయముండదు, ఏకాభిప్రాయముండదు!
— ప్రసాద్
ఆరో వేతన సంఘమట!
జూలై 20, 2006ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. మొన్న మొన్ననే నడ్డి విరిచిన అయిదో వేతన సంఘం జ్ఞాపకాలు మరుగున పడక ముందే ఆరో వేతన సంఘము వచ్చేస్తోంది. ఠంచనుగా ప్రతి నెలా జీతాలు అందుకునే ఉద్యోగుల జీతభత్యాలు పట్టించుకునే వారే గానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, దినసరి కూలీలకు పట్టించుకునే వారేరి? ఈ వేతన సంఘాలు జీతాలు పెంచిన ప్రతిసారీ ద్రవ్యోల్బణం పెరిగి ముందే కష్టాలలో ఉన్న వారి వెతలు మరింతగా పెరిగిపోతున్నాయి. వాళ్ళకు నెలసరి రాబడి గ్యారంటీ చేసేదెవరు?
విపరీతమైన IT జీతాలే బీదల్ని మరింత దూరంగా ఉంచుతున్నాయంటే ఈ వేతన సంఘాలు తమ వంతు భాద్యత తీసుకుంటున్నాయి.
MP లు తమ జీతాలు, అలవెన్సులు తమ ఇష్టం వచ్చినట్లు పెచ్చుకుంటారు. MLAలు తమ జీతాలు, భత్యాలకు తోడుగా ఖరీదైన నగరాల్లో ఇళ్ళ స్థలాలు కూడా కేటాయింపజేసుకుంటారు.
బీదవాడి వేతన ఎవరికి పట్టింది. ఏరుగాలం కాయకష్టం చేసే రైతుకు ప్రకృతి కొంత అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు, వేతన సంఘాలు వీలయినంతమేర వాళ్ళ కష్టాల్ని పెంచుతున్నాయి.
— ప్రసాద్
అండర్‌వేర్ కొలతలు తెలియదంటే ఎలా!
జూలై 20, 2006వీడు పిచ్చోడో, మద పిచ్చివాడో తెలియటం లేదు! నా నడుం కొలతలు అడిగాడని ఆమె వాపోతే, కాదు, కాదు అండర్‌వేర్ కొలతలు అడిగాను అంటాడు ఆ ప్రబుద్దుడు. నిన్న వాడు విలేకరులతో మాట్లాడ్డం చూసి, ఉమ్మేద్దామని మళ్ళీ నా టీవీనే గదా పాడయ్యేదని వూరుకున్నా!
పరాయి ఆడదాన్ని చెల్లిలా భావించాను అంటూనే అండర్‌వేర్ కొలతలు అడగడం ఏంటి? అంతకుమించి ఉదాహరణలు దొరకలేదా వీడికి?
అనలేదనన్నా అబద్దమాడక అంటే ఏమిటంట అనే వీడు IAS ఎలా అయ్యాడో!
— ప్రసాద్
ఉత్పత్తి మరియు సామర్థ్యత (Production and Production capacity, P/PC balance)
జూలై 20, 2006దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి రచయిత బాతు, బంగారు గుడ్డు కథ చెపుతాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఉత్పత్తిని బంగారు గుడ్డు అనుకుంటే, బాతు ఉత్పత్తి సామర్థ్యము అవుతుంది. ఈ కథలో మంగలి అత్యాశకు పోయి అంత బంగారమూ ఒకేసారి కావాలని బాతు పొట్ట చీలుస్తాడు. అంటే ఉత్పత్తి మీద శ్రద్ద చూపించాడేగానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేశాడు. పలితం అసలుకే మోసం.
అలాగే బాతును మాత్రమే పట్టించుకొని బంగారు గుడ్డును నిర్లక్షము చేసినా పలితము సున్నా. కారును సరిగ్గా దాని సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలంటే దాని నిర్వహణనీ పట్టించుకోవాలి. బాతు కథలో మంగలిలా కారు నిర్వహణమీద శ్రద్ద చూపకుండా వాడుకుంటే కొన్ని నెలలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అది త్వరలోనే మూలపడి పనికి రాకుండా పోతుంది (చని పోయిన బాతులా). అలా అని కారు నిర్వహణమీద ఇంకో కారు కొనగలిగినంత ఖర్చు చేయడం కూడా పాడి కాదు. ఈ రెండింటి మద్య (P/PC balance) సమతుల్యం ఉండాలి.
మన ఉద్యోగ విషయంలో కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అప్పుడెప్పుడో సాధించిన డిగ్రీలతో, సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించి నెలవారీ జీతాలు తీసుకుంటూ వుంటే సరి పోదు. నిర్వహణ సామర్థ్యం పెరగాలన్నా లేదా కనీసం అదే స్థాయిలో ఉండాలన్నా మన skills కు పదును పెట్టుకుంటూ వుండాలి. అలాగని ఎన్నో skills వుండి కూడా వాటిని ఉత్పత్తికి ఉపయోగించక పోతే అవి నిష్పలం.
రేపు మొదటి అలవాటు (Habit 1) Proactivity గురించి.
— ప్రసాద్