ఏదో సందర్బంలో యండమూరి అంటాడు ‘ప్రతి సంబందమూ చివరికి ఆర్థిక సంబందమే’నని. ఆది ఏదో కొన్ని సందర్భాల్లొ తప్పు కావచ్చేమొ గానీ చాలా సందర్బాల్లో నిజమే! పిల్లల నుండి రేపేదో ఆశిస్తూ ఈరోజు వారిమీద ఖర్చు చేయడాన్ని పెట్టుబడిలా భావించడం ఫంక్తు వ్యాపారి లక్షణం! కొడుకైతే రేపేదో వుద్దరిస్తాడని, వంశాన్ని నిలుపుతాడనీ, పున్నామ నరకం నుండీ తప్పిస్తాడనీ కొడుకు కావాలనుకోవడం, కూతురి మీదకంటే కొడుకుమీద అధిక ప్రేమ చూపించడం అనాగరికం, అవలక్షణం. నిజం చెప్పాలంటే కొడుకు దగ్గరికంటే కూతురి దగ్గరే అధిక ప్రేమ లభిస్తుంది. అదేదో సామెత కూడా వుంది ..’కొడుకు బందువులైతే వాకిట్లోదాకా..కోడలి బందువులైతే వంటింట్లో దాకా’ అని. కోడలు నడిపే కొడుకు సంసారంలో కంటే కూతురు నడిపే సంసారంలో స్వాతంత్రం ఎక్కువ వుంటుంది. తల్లిదండ్రుల మనసు వీధులు పట్టుకు తిరిగే కొడుకు కంటే ఇంటిపట్టున వుండే కూతురికే ఎక్కువ తెలుస్తుంది. బాధలైనా కొడుకు దగ్గర చెప్పుకోవాలంటే నామోషీ పడే తల్లి కూతురి దగ్గర స్వేక్షగా చెపుతుంది. అన్నెందుకు అన్న దగ్గరకంటే అక్క దగ్గరే చనువూ, స్వాతంత్రమూనూ! ఏ విధంగా చూసినా స్త్రీ (అక్కగా, చెల్లిగా, తల్లిగా, కూతురిగా, బార్యగా) ఇచ్చే శాంతి, సుఖము ఇంకెవరిస్తారు?
మన సుఖసంతోషాల కోణం నుండీ కాకుండా పిల్లల సుఖసంతోషాల కోణం నుండీ చూస్తే కొడుకు మీద కంటే కూతురు మీదే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వుంటుంది. feminists ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడది అబలే. ఒక్క ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, బండరు నాయకే లను చూపించి ఆడది అబల కాదు అంటే ఎలా కుదురుతుంది? మగాళ్ళలో బలహీనులున్నట్లే ఆడవాళ్ళలో బలవంతులూ వుంటారు. అందం, సుకుమారం, సౌశీల్యం ఆడవాళ్ళ లక్షణాలు. వీటిని బట్టి చూస్తే కొడుక్కివ్వాల్సిన దానికంటే కూతురికి ఎక్కువ రక్షణ అవసరం. కొడుక్కి నేర్పించాల్సిన విద్య కంటే తన కాళ్ళపై తను నిలబడేలా శిక్షణ కూతురికే అవసరం. కూతురికి ఏ విద్యా నేర్పక మరింత బలహీనురాల్ని చేసి, ఇంకో మగాడికి అంటగట్టి, అతడి చెప్పుకింద రాయిలా అణిగిమణిగి వుండమనడం స్వంత బిడ్డకు తండ్రే చేస్తున్న అపచారం!
తల్లిదండ్రులుగా మనం పెట్టే ఖర్చు మన పిల్లల్ని తమ సొంత కాళ్ళమీద నిలబెట్టేందుకు వుపయోగపడాలిగానీ ముసలిదశలో మనకాళ్ళు నిలవటానికి కాదు.
ఇక వంశం ప్రకారంగా చూసినా కూతురే మన వాంశం నిలిపే గ్యారంటీ వారసురాలు. “తండ్రి నమ్మకం, తల్లి నిజం” అనెక్కడో చదివాను. కాబట్టి మన లక్షణాలను ఖచ్చితంగా తర్వాతి తరానికి మోసుకుపోయేది తల్లిగా కూతురే గానీ కొడుకు కాదు.
ఇక కట్నం విషయానికి వస్తే, కట్నం అనేది ఒక Status symbol అయిపోయింది. కట్నం తక్కువంటే నన్ను తక్కువవాడు గా జమకడతారేమొ అని పెళ్ళికొడుకు అనుకుంటాడు. అంతెందుకు మా అక్కకిచ్చినంత కట్నము నాకెందుకివ్వవని అడిగే కూతుర్లూ తయారయ్యారు. ఎంత ఇచ్చాం అనేది పెళ్ళికూతురు వైపు వాళ్ళకీ ఎంత తీసుకున్నాం అనేది పెళ్ళికొడుకు వైపు వాళ్ళకీ వాళ్ళవాళ్ళ మర్యాద/పరువు విషయమై పోయింది. ఇలా ఎవరిస్తోమతుకు తగ్గట్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే సమస్యలేదు గానీ వచ్చిన చిక్కల్లా కొడుకుని అమూల్యమైన వస్తువుగా భావించి దాని విలువకు సరిపడా కట్నం తేలేదని కోడళ్ళని రాచిరంపాన పెట్టడం అసలు సమస్య! ఇంకా తమ కొడుకు qualifications వున్న ఎదురింటి కుర్రాడు తమకంటే ఎక్కువ కట్నం తీసుకున్నాడని తెలిస్తే తము మోసపోయినట్లుగా భావించి తమ కోడలి వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆడిపోసుకోవడం మరో అత్యాశ లక్షణం!
ఎన్నో నేరాలకు అత్యాశ, దురాశ, డబ్బు ప్రధాన కారణాలయినట్లే కట్నానికీ అవే కారణాలు. ఇవి బరితెగించి కొడుకులే కావాలి కూతుర్లు వద్దు అని బ్రూణహత్యలకు పాల్పడటం, అమ్మాయిలని అమ్మేసుకోవటం రాక్షస లక్షణం. రాక్షసులూ ఇలా చేసినట్లు ఏ పురాణంలోనూ కనపడదు. అంబనాధ్ అన్నట్లు ఇదేమాదిరి ఆడపిల్లల నిష్పత్తి తగిపోతే విపరిణామాలు తప్పవు. బహుశా అప్పుడు మళ్ళీ వ్యాపారప్రపంచపు డిమాండ్, సప్లై సూత్రం వర్తించి మళ్ళీ కన్యాశుల్కము విజృంబించి reverse trend మొదలవుతుందేమొ!
–ప్రసాద్
12:13 ఉద. వద్ద సెప్టెంబర్ 13, 2006
అసలు పిల్లల్ని కనటం, పెంచటం పిల్లలకేదో ఉపకారం చేస్తున్నాం, వాళ్ళ వల్ల మనకీ ఉపయోగం ఉండాలి అనుకునే వాళ్ళవల్లే ఇటువంటి పరిణామాలు.
మన ఇస్టపూర్వకం గానే పిల్లలూ కావాలో వద్దో నిర్ణయించుకుని, వాళ్ళని పెంచటం మన బాధ్యత అని భావిస్తే చాలు.
మీరు చెప్పినట్టు వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా చెయ్యటం తల్లిదండ్రుల బాధ్యత.
దాన్ని భారం గానో పెట్టుబడి గానో భావించి విపరీత చర్యలకి పాల్పడటం మంచిది కాదు.
1:08 ఉద. వద్ద సెప్టెంబర్ 13, 2006
తల్లిదండ్రుల్ని ఆరాధించడం, వాళ్ళని ఆజీవితమూ జాగ్రత్తగా చూసుకోవడం, పిల్లల్ని కనడం, పెంచడం, చదివించడం, వాళ్ళను స్వయం పోషకం చెయ్యడం ఇవన్నీ గృహస్థాశ్రమ ధ్రమాలు. బాధ్యత, విధి, కర్తవ్యం.. వీటన్నిటికీ మించినది, భారతీయత మనకు నేర్పిన “ధర్మం”. (ఈ ధర్మం అనేది బహుశా మరో సంస్కృతిలో లేదేమో!) ఆఫీసు పనిలాగా దాన్నీ ఓ విధిలాగానో, ఓ వ్యాపారంలాగానో చూట్టం మామూలైపోయింది. మంచి జాబు రాసారు!
6:53 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2006
Chaala chakkaga rasaaru. Kodukuni kanedi, penchedi vruddapyamlo tamani jagrattaga chusukuntarane uddesam gala talli dandrulunu chustunte aascharyam vestundi. Porabatuna vaariki udyogam vachhi vere prantamlo stirapadite badyata leni koduku ani varini nindinchadam, kodalu vachhi kodukini dooramga teesukupoindi ani sadinche tallidandrulani chuste vichitramga untundi. Pillala meeda prema koddi vaari avasaraalu teeriste variki manalni preminchadam telustundi manam vruddapyamlo unnappudu manam asinchakundane manalni adaristaaru abhimanamga chustaru. Ante kani vaarinunchi phalitam asinchi vallani penchite valla manastatvam alaage untundi. Lekka chusukoni pillalani penchite vallu kuda manalni abhimaninchadaniki phalitam asistaru daani phalitame Old aged homes.
3:17 సా. వద్ద సెప్టెంబర్ 16, 2006
కన్యాశుల్కం ఉన్నరోజులలో స్త్రీ సుఖపడిందేమీ లేదు.స్త్రీల కష్టాలకు కరణాలే వేరు.అనేకంగా
ఆడవాళ్ళకు కష్టాలు వివాహంతో మొదలౌతయని
అందరికీ తెలుసు కారణం స్థానబలం కొల్పోవాడం,
ఆర్ధికంగా పురుషుడి మీద ఆధారపడటం,మరువివాహం అంతగా ప్రోత్సహించక పోవడం.అత్తింటీ ఆరడినైనా భర్త పెట్టే హింసలనినా స్త్రీ ఎందుకు భరిస్తుంది. ఆర్ధికంగా బలహీనురాలు కావడం సంప్రదాయకంగా బలం లేకపోవడం,
కరణమేదైన అత్తింటిని వదిలిన స్త్రీకి పుట్టీంటి ఆదరణ కూడా అనేక సమయాలలో ఉండదు.
అలావస్తే చాలామంది పర్రువు తక్కువగ భావిస్థారు అందుకనె అత్తింటి కోరికలను మౌనంగా భరిస్థారు అందువలనే స్త్రీ క్రమంగా
సమాజానికే భారమైంది.ప్ర్యవసానంగా భ్రూణ హత్యలకు దారితీశాయి.ఈపరిస్థిథి మారాలంటే తల్లి,తంద్రులు ఆడపిల్లల్లను ఆర్ధికంగా నిలపెట్టీన తరువాతే వివాహం చేయాలి,నిర్భయంగా కష్టాలలో ఆదరించాలి.
8:56 సా. వద్ద సెప్టెంబర్ 19, 2006
This is a comment to the above blog post, but seems there is some problem in commenting tothat post (change the title to English/ or reduce the title, it might get resolved)
చాలా బాగా వ్రాసినారు
ఉదాహరణ:
ఒకతను రిజర్వేషనుతో ఐ ఐ టీ లో చేరినాడు, మరీ అంత తెలివైన వాదు కాదు (మరీ అంత తెలివి చూపించేవాదు కాదు)
పరిక్షలలో అష్టకష్టాలు పడి, కాపీలు కొట్టి బతిమిలాడి అలా అలా పాసయినాడు
తరువాతా ఓ ప్రముఖ సాఫ్ట్వేరు కంపెనీలో ఉద్యోగం వచ్చినది
చాలా కష్టపడినాడు
మొదటి సంవత్సరమే ప్రమోషను, రెండవ సంవత్సరము కూడా ప్రమోషనే!
—-
ఉదాహరణ రెండు:
ఒకతను రిజర్వేషనుతో చదివినాడు
రిజర్వేషనుతో టీచరుగా చేరినాడు
పిల్లలకు ఆయన క్లాసంటే బోర్, ఆయనకూ క్లాస్ తీసుకోవడమంటే చికాకు
ఏదో వస్తాడు సంతకం పెడతాదు, వెళతాడు
—-
ఉదాహరణ మూడు:
మరొకతను రిజర్వేషను లేకుండానే ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాడు
“అరే ఆ పని అలా చేస్తే బాగుంటుంది కదా! ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కదా!!”
“ఎవరికి? ఫలితం! ఏదో జరిగిపోతుంది కదా, మరళా రిస్క్ తీసుకోవడం ఎందుకు?”
—-
ప్రభుత్వ ఉద్యోగాలనుండి సీరియస్ గా మిస్సు అవుతుంది “మోటివేషన్” “భయం”
అనవసరపు ఉద్యోగ భద్రత
—-
రౌతు మంచోడయితే కుంటి గుర్రం కూడా పరుగెడ్తుంది
—-
మీరు మరొక బ్లాగు వ్యాసానికి విమర్శగా ఇది వ్రాసినారు కదా, దాని లింకు ఇవ్వడం సంప్రదాయం, లేకపోతే కొత్తగా వచ్చేవారికి మీరు ఏమి వ్రాసినారో సరిగ్గా అర్థం కాదు , I mean exact link to blog essay , not to the complete blog.
10:27 ఉద. వద్ద సెప్టెంబర్ 20, 2006
కిరణ్,
నేను సుబ్రమణ్యం గారి బ్లాగుకి లంకె ఇచ్చాను. మీరు “సుబ్రమణ్యం గారూ” అన్న మొదటి పదం మీద తడిటేనే మీకు ఆ బ్లాగు తెరుచుకుంటుంది. మీరు గమనించి నట్లులేరు.
ఇకపోతే మీ ఉదాహరణల్లో రిజర్వేషను మీద వచ్చిన వాడికే సృజనాత్మకత లేదన్నట్లు చెప్తారే! కాపీలు రాసి వచ్చిన వాడికి రిజర్వేషను మీద ఉద్Yఒగం వచ్చిందంటారే!
నా ఉదాహరణలు చూడండి.
1) వాడు ఒట్టి జులాయి. అసలు చదవడు, గౄపులు కట్టి స్నేహితులతో విందు వినోదాల్లో చేరి విణొదిస్తాడు.
కానీ వాళ్ళ నాన్న పెద్ద పలుకుబడి వున్న నాయకుడు.
తన పలుకుబడితో పాస్ చేయించాడు, ఉద్యోగమూ ఇప్పించాడు.
ఆఫీసులో పనిచేయకపోయినా అతన్ని అనే అనే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు.
ఇప్పుడూ జులాయిగానే తిరుగాతాడు ఆఫీసులో జీతం మాత్రం తీసుకుంటూ.
2)వాడు పుట్టడంటోటే నోట్లో బంగారు చెంచాతో పుట్టాడు.
అమ్మకీ నాన్నకి వాడంటే ఎంతో గోము.
బోలెడంత డబ్బు పోసి చిన్నప్పట్నుంచే ఇంగ్లీషు మీడీం చదువులు చెప్పించారు.
కారు, డ్రైవరు కాలుకు మట్టవ్వాల్సిన పనే లేదు.
వాడు కూడా బాగానే చదువుకున్నాడు.
వాళ్ళ చిన్నాన్న అమెరికాలో వుండటంతో ఎవ్వరినో పట్టుకొని వీసా చేయించాడు.
వీడు అమెరికా వెళ్ళి మంచి వుద్యోగం తెచ్చుకొని హాయిగా జీవితంలో స్థిర పడి పోయాడు.
3)వీడు తక్కువ కులంలో పుట్టాడు.
అమ్మా నాన్న రోజూ ఒళ్ళు హూనం చేసుకుంటే గానీ పూటా గడవదు.
మధ్యాహ్నభోజనం పెడుతున్నారని స్కూలుకు పంపించారు.
ఇస్కూలు నుండీ ఇంటికి రాగానే చిన్న పిల్లాన్ని ఎత్తుకొని ఆడించాలి.
చదువుకోవడానికి కరెంటు దీపం లేదు.
ఇంట్లో చదువు చెప్పడానికి అమ్మకీ నాన్నకీ చదువు రాదు. ట్యుషన్లు పోయే స్థోమత లేదు.
సర్కారీ బడి చదువులూ అంతంత మాత్రమే.
ఎలాగోలా అత్తెసరు మార్కులతో పాసవుతూ వచ్చాడు.
రిజర్వేషను దయ వల్ల ఉద్యోగం తెచ్చుకున్నాడు.
పనివాళ్ళలో పుట్టి వచ్చిన వాడు కనుక పని పట్ల శ్రద్ద చూపిస్తున్నాడు.
మంచి పనివాడుగా పేరు తెచ్చుకున్నాడు.
4)ఇంకొకడు మూడో వానిలాగానే సర్కారి బడి చదువులు.
ఆదివారం వస్తే అమ్మానాన్నతో పాటు వాడూ కూలి పని చేయాల్సిందే.
ఎలాగైతేనేం బాగా కష్టపడి తనకున్న గొప్ప తెలివితేటాలతో మంచి మార్కులతో పాసయ్యాడు.
కానీ ఇంజనీరింగు సీటు వచ్చినా చేద్దామంటే దానికి కావాల్సిన డబ్బులు లేవు.
ఇంట్లో తను కూడా కూలి పని చేస్తే తప్ప పూట గడిచేలా లేదు.
చేతికి అందిన కొడుకును చదువులంటూ దూరం చేసుకోవడం తండ్రికి ఇష్టం లేదు.
ఇంకేం మంచి సృజన వున్నా చదువుకి దూరం అయ్యాడు.
— ప్రసాద్
8:45 ఉద. వద్ద సెప్టెంబర్ 17, 2022
The post you just wrote was excellent, and I look forward to reading more updates about your site. Your help is greatly appreciated.
Latest Bollywood News