ఒకసారి ఏమయిందంటే!

నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు. cobol కు రోజులు చెల్లి Java నేర్చుకుంటున్న రోజులు. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నప్పూడు అప్పుడే పుట్టిన ఒక దేసి కంపెని నన్నాదుకుంది. ఫుడ్డు బెడ్డు ఇచ్చి జావా నేర్చుకోమంది. ఇంకేం సాధన మొదలెట్టాను. నాకు ఇతరులు చెప్పేది విని నేర్చుకోవడం కంటే చదివి నేర్చుకోవడం ఆసక్తి. వినాలంటే మాత్రం నిద్ర వస్తుంది. Thinking in Java సహాయంతో జావా బాగానే వొంటబట్టింది త్వరగానె! నేనె ఇతరులకు చెప్పడం మొదలు పెట్టాను.
అప్పుడు నాకు ఆశ్రయమిచ్చిన కంపెనీకి జావా ట్రయినింగ్ తరగతులు నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ కంపెనీ యజమాన్యంలో ఒకాయన వుండేవాడు. ఆయనకు విషయపరిజ్ఞానం లేదనను గానీ, జావా గురించి మాత్రం ఏమీ తెలియదు. ఆయనకు తెలిసిన వన్నీ C++ గురించి. ఆయన పేరు ప్రస్తుతానికి వెంకట్ అనుకుందాం. ఈ వెంకట్ తనకున్న C++ పరిజ్ఞానం తోనే java క్లాసులు నెట్టుకొచ్చేవాడు. ఏదో ఒక బుక్‌లోని సమస్య ఇచ్చి ప్రోగ్రాం రాయమనేవాడు. రాసింది సరిగ్గా వుండొ లేదో నన్ను చూడమనే వాడు! వాళ్ళకు వచ్చిన ఏదైనా ప్రాక్టికల్ సమస్యలకు నన్ను సహాయం చేయమనే వాడు. ఇదంతా తనకు java రాక పడే అవస్త అనే విషయం నాకు రెండు sessions అయ్యాక గానీ అవగతమవలేదు. వచ్చి నట్లుగానే OOPS Concepts చెప్పేవాడు. ఎలాగూ C++ వచ్చు గనక సమస్య లేక పోయింది. అయితే ఒకసారి java లో multiple inheritance ఎందుకు లేదు అనేదానికి సమాధానం చెప్పలేకపోయాడు. “ఏదో కొత్త లాంగ్వేజ్ కనిపెట్టలని తాపత్రయపడి multiple inheritance తీసేసి మళ్ళీ దాన్నే multiple interfaces ను implement చేయవచ్చంటూ మెలికలు తిప్పారు” అని ఈసడించుకున్నాడు. అప్పటికే Thinking in Java ను జీర్ణం చేసుకొని వున్నాను గనుక ఆయన వాదన అసంబద్దమనిపించింది.
ఇదే విషయమై ఒకసారి restroom లో నా సహచరుడు అడిగితే నా అబిప్రాయం చెప్పి “ఈయనకు జావా రాదు గీవా రాదు..ఏదో నెట్టుకొస్తున్నట్టున్నాడు” అన్నాను. దానికి తోడు అవతలి వాడు అతని మీదున్న తన అక్కసు వెళ్ళగక్కాడు.
ఇదంతా అదే restroomలో దొడ్డికి కూర్చొని ఆ ఆఫీసు మేనేజరు వింటున్నాడని మాకు తెలియదు.
ఇక ఆ సాయంత్రం వెంకట్ జావా క్లాసులు ఎలా చెప్తున్నాడు feedbak ఇవ్వండి అంటూ ఆ కంపెనీ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేశాడు. (ఈ బాత్‌రూంలో విన్న వాడు ఆయనకు అంతా చెప్పేశాడు) మేము బాగానే చెప్తున్నాడు అంటాం మొహమాటం కొద్దీ! అలా గాదు మళ్ళి చెప్పండి అంటాడు ఆ మేనేజరు! మాకెంతకీ అర్థం కాలేదు. చివరికి మధ్యాహ్నం బాత్‌రూంలో మీరనుకున్నదే చెప్పండి అన్నాడు.
అప్పుడు చూడాలి మా మొహం! అప్పుడిక చెప్పక తప్పలేదు ఆయన బోధనలోని కుప్పిగంతులు. అందరికీ తప్పినాయి ఆయన క్లాసులు గానీ మాకు మాత్రం చాలా రోజులు తప్పుచేసిన ఫీలింగ్!

— ప్రసాద్

7 వ్యాఖ్యలు to “ఒకసారి ఏమయిందంటే!”

  1. cbrao Says:

    బాగుందని చెప్పటం సులభం కాని బాగాలేదని చెప్పవలసి రావటం క్లిష్టమే.ఎన్నో బ్లాగు సమేక్షలు చేసే నాకు ఈ సమస్య చిరపరిచితమే. సున్నితంగా అవతలవారు నొచ్చుకోకుండా చెప్పటం ఒక కళ.

  2. T.Raja gopal Says:

    Prasad garu,
    As ,Sri C b Rao says it is very essential to say others with out hurting their feelings. One way is to tell them that “If I am in yr place, I would not have done like that”.Or “I would have done like this”
    Raja gopal.

  3. Nagaraja Says:

    అతనికి చెడు జరగాలి అని మీరు కోరుకోలేదు కనుక పశ్చాత్తాపం అవసరం లేదు అని నా అభిప్రాయం. తెలియకపోయిన నటించిన కర్మకు అతను తగిన ఫలం అనుభవించాడు – అంతే! అని భావించి ఆ సంఘటనను మరచిపొండి 🙂

  4. salwa.ramaraju Says:

    good

  5. Chiranjeevi Says:

    cheppedi artham kani person thone direct ga ( personal ga annamata) velli kalisi…..openion cheppithe thanu thana kunna knowledge ni improve chesukuntadu…ala gaka…..kopam penchukunte….he is not a good person……

  6. ప్రసాద్ Says:

    లేదు లేదు ఆయన అలా కోపమేమీ పెట్టుకోలేదు. మాకే ఓ విధమైన గిల్టీ ఫీలింగ్‌ వుండింది.

    –ప్రసాద్‌

  7. usha Says:

    అంతరంగం రాసిన అంతరంగం గారికి నమస్కారం
    నా పేరు ఉష
    నిజం మీ గేయరచన చదివిన తరువాత కాని
    మనిషిలోని నిజం బయటపడినప్పుడు ఎలాంటి పరిస్తుల్లో ఇరుక్కుపోతామో అర్ధం కాదు కదా అని తెలిసుకోగాలిగాము చాలా బాగుంది
    ధన్యవాదాలు
    ఉష

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: