ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కదా. మరి మన రెవెన్యూ శాఖ ఆ ధనాన్ని మన దేశంలోనే ముద్రించవచ్చు కదా?” శ్రీనివాస గారు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా!
ఆయనకు జవాబు తెలియక కాదు బహుశా ఈ విషయం పై బ్లాగుల్ను ప్రోత్సహించడానికి ఈ ప్రశ్న వేసి వుంటారు.
డబ్బు అనేది మన శ్రమకు, లేదా తయారయిన వస్తువుకు, లేదా సేవకు ప్రతిరూపం. ఈ డబ్బు లేనప్పుడు వస్తు మార్పిడి విధానముండేది. నీవు నాకు గిద్దెడు గోధుమలిస్తే, నేను నీకు గిన్నెడు బియ్యమిస్తా. నీవు నా పొలంలో ఒకరోజు పని చేస్తే నేను రెండుపూటలా భోజనం పెట్టి, ఒక పావు బియ్యమిస్తా! ఇలా వుండేది డబ్బు సృష్టించకముందు లావాదేవీలు జరపడం. అయితే ప్రతి శ్రమకూ దాని విలువను బియ్యం తోనో, పాలతోనో, బంగారంతోనో సరికట్టడం ప్రాతి ప్రాంతానికీ వేరు వేరుగా వుండేది పైగా నిలకడగా వుంచడమూ సాద్యం అయ్యేది కాదు. పైగా శ్రమకు ప్రతిఫలంగా బియ్యమో, నువ్వులో ఇస్తానంటే వాటిని మూటగట్టుకొని వెళ్ళడం ఒక సమస్య! అంతే గాక బహుమానాలు ఇవ్వాలనుకొనే రాజులకు ఇంకా సమస్య!
అప్పుడు డబ్బు పుట్టింది. “ఇదిగో నేను రాజముద్ర వేసి రాసిచ్చిన ఈ పత్రము లేదా నాణెము ఎక్కడికయినా తీసుకెళ్ళి నీక్కావలిసిన బియ్యమో, చింతపండో తీసుకో” అని రాజు ఆజ్ఞాపిస్తే అది రాజాజ్ఞ గనుక అందరూ పాటించేవాళ్ళు. అలా రాజముద్ర వున్న ఆ నాణెమే తదుపరి డబ్బుగా చెలామణీ కావడం ప్రారంబించి వుంటుంది.
అయితే పూర్వము రాజులు ఏవిధంగా సంపదను లెక్కగట్టి ఈ నాణేలను ముద్రించేవారో గానీ ప్రస్తుత ప్రభుత్వాలకు మాత్రము కొన్ని లెక్కలున్నాయి. దాన్ని బట్టి దేశంలో వున్న సేవా సంపద, ఉత్పత్తి విలువనూ బట్టి దానికి సమానంగా డబ్బు చలామణిలో వుండేలా చూస్తారు. డబ్బు ముద్రణ ఉత్పత్తి కంటే ఎక్కువయితే అందరిచేతిలో కొత్త కొత్త కరన్సీ నోట్లు ప్రత్యక్షమై ద్రవ్యోల్బణం అధికమై వస్తువుల రేట్లు పెరిగి డబ్బుకి విలువ తగ్గి పోతుంది. డబ్బులనే తిని అరిగించుకోలేం గదా కావలిసింది వస్తువులు, సేవ, తిండి గింజలు. కనుక డబ్బు అనేది మన సంపదకు ప్రతిరూపమే గానీ అదే సంపద కాదు. డబ్బు అనేది భూమి పట్టా లాంటిది. భూమి లేకుండా పట్టా కాగితాలు తయారుచేసి పంచితే భూమిని పంచినట్లా? ఇది అంతే సంపదను సృష్టించకుండా డబ్బును సృష్టిస్తే దాని విలువ చిత్తు కాగితంతో సమానం. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తయారుచేసిన డబ్బుతో జింబాబ్వేలో జరుగుతున్న అరాచకం చూడండి.
ఇక ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతెచ్చుకోవడం అంటే పక్కదేశాల సరుకుల్ని, సేవల్ని ప్రస్తుతం ఉచితంగా పొంది భవిష్యత్తులో మన సేవల్ని , వస్తువుల్ని ఉచితంగా ఇస్తామనడం!
— ప్రసాద్
12:18 సా. వద్ద సెప్టెంబర్ 1, 2006
చాలా చక్కగా, విడమర్చి చెప్పారు. మీరు రాసింది చదువుతుంటే.. మీరు చెప్పేది వింటున్నట్టు ఉంటుంది.
1:47 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2006
ధన్యవాదములండీ ప్రసాద్ గారు 🙂 మీరు అనుకున్నట్టే ఎవరన్నా ఈ విషయం మీద తమ బ్లాగులో రాస్తారని నేను అలా నా బ్లాగులో చిన్న చోటు కేటాయించాను. బాగా వివరించారు.
12:29 సా. వద్ద సెప్టెంబర్ 7, 2006
andariki telisina vishayame ayina…..meeru cheppina polikalu,udaaharanalu ivanni mee vivaranaku aakarshana ga nilichayi.chivari varaku cadivela ceesaayi.dhanyavaadaalu.
7:50 ఉద. వద్ద జూలై 23, 2009
hi nice