నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా.
నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను చూడవచ్చు. కాసేపు అయ్యప్ప స్వామి మీద భయాన్ని, భక్తినీ వదిలేసి ఆలోచించండి అది మూర్ఖంగా అనిపించట్లేదా? అంబనాధ్ అన్నట్లు (ఆయన భారతీయత గురించి అన్నారులెండి) మనం చిన్నప్పట్నుంచి ఆ మాటకొస్తే తరతరాల్నుండి అలా condition చేయబడ్డాం. ఆ నెల దీక్ష ఏదో పది మందికి వుపయోగపడేలా వుండవచ్చు కదా?
ఇక సతసాయి, అమృతానందమయి లాంటి వాళ్ళు చేస్తున్న సమాజసేవ నాకు తెలుసు. అందుకే వాళ్ళు చేస్తుంది మాయా, మంత్రమా నాకనవసరం. వాళ్ళు దేవుళ్ళా అంటే అవును దేవుళ్ళే అనాలి. అయితే దివ్యాంశాలుండే దేవుడు కాదు, దివ్యాంశలే వున్నట్లయితే అంత ఖర్చు పెట్టి ఆ ఆసుపత్రి ఎందుకే ఆయన తదిమిందే తడవుగా రోగాలు మాయమవచ్చు కదా! పకృతి సూత్రాలకు విరుద్దంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యం కాదు, గొంతులోంచి లింగం తీసే దాంతో సహా! కానీ ఇంతకుముందు “పూజలు యజ్ఞాలు అవసరమా” అనే ప్రశ్నకు నేను రాసిన బ్లాగులో చెప్పిన తొండ కథలా, ఎదో విధంగా మనిషిలో నమ్మకం కలిగించాలి, నమ్మకం వున్నంతవరకే ఆయన చెప్పినది సత్యమని నమ్ముతారు. అయితే తొండ కథలోలా నమ్మకం ఎలా కలిగించాడు అనేదానికంటే రోగం కుదిర్చాడా లేదా అన్నదే ముఖ్యం.
ఆ విధంగా చూస్తే ఆయన సాధించినవి అద్బుత విషయాలే! ఎడారి జిల్లాలో ఒక కుగ్రామాన్ని పట్టణం చేయగలిగాడు, ఎందరో పేదలకు వైద్యసౌకర్యం కలిగించగలిగాడు, ఎన్నో పల్లెలకు నీటి సౌకర్యం కలిగించగలిగాడు. ఇంకా ఆయన భక్తులు భక్తులు ప్రపంచమంతా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు.
నేను చెప్పొచ్చేదేమిటంటే మంచికార్యాలు చేయడం ద్వారానే మనం దేవుడి అభిమానాన్ని సంపాదించుకోగలం (మీరు దేవుని నమ్ముతున్నట్లయితే) అతని చుట్టు భజన చేసి, దండకాలు పఠించి, కాకా పట్టడం వల్ల కాదు.
ఒక మంచి యజమాని దగ్గర అతనికి నచ్చినట్లుగా పనిచేయడం వల్ల అతని ప్రీతి పొందగలము కానీ అతని వెనకాల వుండి వందిమాగధునిలా పొగడడం వల్ల కాదు. ఈ భూమి, విశ్వం, వున్నదీ లేనిదీ, చెట్టూ పుట్టా అన్నీ అన్నీకూడా ఆయన పెరడు, ఆయన ఆటస్థలం, నాటక స్థలం. ఈ జీవులన్నీ కూడా ఆయన పుత్రులో పౌత్రులో లేదా ఆయన అంశలో. వీటికి సేవ చేయడం ద్వారా, ఈ ఆటస్థలాన్ని శుబ్రంగా వుంచటం ద్వారా, జీవులన్నీ పరస్పర సహకారముతో జీవించడం ద్వారా కదా ఆయన అభిమానాన్ని పొందగలం! అది వదిలేసి అతని చుట్టుచేరి లేదా ఆయన ఫోటోనో, ప్రతిమనో పెట్టి పూజించి డప్పులు కొట్టి, అలంకారాలు చేసి, నినాదాలు చేసి (రాజకీయనాయకులకు జిందాబద్‌లు కొట్టినట్లు.) …. ఇదా నిజంగా సత్యవంతుడైన, నిజాయితీ గల దేవున్ని తృప్తిపరిచే మార్గం?
రాజుకు వందిమాగధులు చేసే పనా మనం చేయాల్సింది?
మూర్ఖత్వం కాదా యిది?
— ప్రసాద్
11:52 సా. వద్ద ఆగస్ట్ 31, 2006
మిమ్మల్ని ఒక వైపు అభినందించాలి ఇంకో వైపు కృతజ్ఞతలు చెప్పాలి.
నా లాంటి కొందరు బయటకు వ్యక్తం చెయ్యని అభిప్రాయాల్ని మీరు సవివరం గా, సోదాహరణం గా, ఓపిగ్గా బ్లాగ్ చేస్తున్నందుకు. మీ పోస్ట్ లు చదువుతున్నప్పుడు నాకు చాలా నైతిక మద్దతు లభించినట్టు అనిపిస్తుంది.
నాదో సలహా ..కాదు అభ్యర్ధన.
మీరు ఇలా అద్యాత్మికత, భక్తి, మానవత్వం అంశాలపై రాసిన వ్యాసాలను వీలైతే వార్తా పత్రికలకి పంపటం లేదా ఒక పుస్తకం గా ప్రచురించటం గురించి అలోచింఛండి.
మన దేశం లో చాలా మందికి వీటి అవసరం ఉంది.
ఎందుకంటే నెట్ లో అందరూ చదవరు కదా..
తప్పకుండా అలొచింఛండి.
లేదా కొన్నాళ్ళు చూసి నేనే పబ్లిష్ చెయ్యటం లాంటిదేమైనా చేసేస్తా.
10:43 ఉద. వద్ద సెప్టెంబర్ 1, 2006
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
నోటితో కాకుండా చేతుల్తో చెబితేనే ప్రజలు విశ్వసిస్తారనేది నా నమ్మకం. త్వరలో చేతుల్లోకి దిగాలనేది నా ప్రగాఢ వాంఛ. గాంధీ నా జీవితమే సందేశం అన్నారు గదా మనం జీవించడం ద్వారా చెప్పాలి ఏం చెప్పదలుచుకున్నామో అంతవరకూ నేను చెప్తున్నవి నీటి మీద రాతలే!
— ప్రసాద్
https://charasala.wordpress.com
12:47 సా. వద్ద సెప్టెంబర్ 7, 2006
neenu ee vishayam lo meetho puurtiga eekiibhavistanandi.raamudu kuda manchi panulu chesega deevudayyadu.alage manchi evaru chesinaa vaadu bhagavantude.mee rachanalanni chala alochimpacestuntayi nannu.swati cheppinattu ga ivi andariki andela chudagalarani aasista
12:15 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2006
భక్తి అంటే పాపం చేకుండా ఉండటం అంతే. పుణ్యం చేస్తున్నట్లు కాదు. వేరొకరికి మేలు కలిగిస్తే అది పుణ్యం. ఏంటో మన జనాలు గుడికెళ్తారు కానీ పూజారి ఏమేమి చదువుతున్నాడో అర్థం తెలీదు. దేవుడికి (?) రూపాయో లేక ఐదు రూపాయలో వేసి పుణ్యం సంపాదించేద్దామనే ?
భజనలు చేసినా, భక్తితో మొక్కినా….. మనలోని పంచ వికారాలను జయించకుంటే… వాటిలో అర్థమే లేదు
2:20 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2006
ప్రసాద్ గారు, ఈ పోస్టు వ్రాసినందుకు కృతజ్ఞతలు. నేను మీతో ఏకిభావిస్తున్నాను. మీ బ్లాగు నాకు స్పూర్తి.
8:30 ఉద. వద్ద మార్చి 16, 2007
అణీముత్యాల్లాగా ఉన్నాయండి మీరి వ్రాసే విషయాలు.
అలోచనల్లో లోతు.మాటల్లో నిజాయితీ,మీరు చెపేది ఔననిపించే రచనాశైలి.మొత్తానికి మీబ్లాగు బాగుంది.