మీరు సింగిలా? (Are you single?)

అనిల్ రాసిన“మీరు సింగిలా?” చదివాక అక్కడ నా వాఖ్య రాద్దామని మొదలు పెడితే ఇంత అయ్యింది. 

ఇంతకీ అమెరికాలో మీరు సింగిలా అనడానికి “Are you married” అనేది సరిపోదు గనక. married, మరియు unmarried అనేవి మాత్రమే options అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పెళ్ళి చేసుకోకుండా కలిసి కాపురం చేసుకొనేవారే ఎక్కువ. పెళ్ళి అయి విడాకులు తీసుకున్నవారు, పెళ్ళామో, మొగుడో చనిపోయిన వారు కూడా సింగిలే.
మీకు పెళ్ళయిందా?
అయి వుంటే, పెళ్ళాం మీతోనే వుందా?
విడాకులిచ్చారా? చచ్చి పోయిందా?
ఇలాంటి ప్రశ్నలు అడక్కుండా మీరు సింగిలా? అంటే సరిపోతుంది.
ఇంకోమాట. మనము ఇంతకుముందు జోకులేసుకొనేవాళ్ళం.
మీకు పెళ్ళయిందా?
లేదు.
పిల్లలెంతమంది? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

లేదా
మీకు పిల్లలెంతమంది?
ఇద్దరు.
మీకు పెళ్ళయిందా? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

కానీ ఇప్పుడు అమెరికాలో ఇలాంటి ప్రశ్నలు official forms అన్నింటిలోనూ వుంటాయి.

అంతే కాదు.
Are you male/female? అని అడిగాక
Is your spouse male/female? అని కూడా అడుగుతారు.
ఎందుకంటే boolean algebra లో 0, 1 కి వున్న నాలుగు combinations లోనూ పెళ్ళిళ్ళవుతాయి గనుక.
ఈ confusion కి తోడు శీల మార్పిడి (sex మార్పిడి) చేయించుకున్న వాళ్ళతో మన సమస్య అంతా ఇంతా గాదు. నిన్నటి వరకు boy friend అయినవాడు ఇప్పుడు girl friend అవుతాడు.
ఇద్దరు పిల్లలున్న Daddy ఇప్పుడు ఆడదయిపోతే ఆ పిల్లలు అతన్ని…ఛీ ఛీ ఆమెని ఏమని పిలవాలి?

ఆ మద్య ఒకాయిన నేను FDCలో పని చేస్తున్నప్పుడు “ఆమె” అయ్యాడు.
అప్పటి వరకు వెళ్తున్న మగవాళ్ళ దొడ్డికి(Toilet) వెళ్ళలేడు, పోనీ అట్లాగని మొన్నటి వరకు మగవాడు గనుక ఆడవాళ్ళ దొడ్డికి వెళ్ళలేడు. ఇక సెక్సును బట్టి తేడా చూపగూడదు గనుక అతనికోసం FDC Family restroom కట్టించింది. అందులోకి ఒక్కసారి ఒక్కరే వెళ్ళచ్చు.

స్వలింగ పెళ్ళిళ్ళు రాజ్యాంగబద్దమని వాదిస్తున్నారు స్వలింగ సంపర్కులు. వాళ్ళ స్వలింగ పెళ్ళిళ్ళలో జోక్యం చేసుకోవడం లింగబేదం చూపడమేనని, అది రాంజ్యాంగవిరుద్దమని వాదిస్తున్నారు.

రేపు కుక్కనో, పిల్లినో పెళ్ళి చేసుకొని ఇది కూడా రాజ్యాంగబద్దమే, ఇది రాంజ్యాంగమిచ్చిన వ్యక్తి స్వేక్ష అంటే కాదనగలమా?

5 వ్యాఖ్యలు to “మీరు సింగిలా? (Are you single?)”

 1. అనిల్ చీమలమఱ్ఱి Says:

  నా ఆర్టికల్ చూసి మీరు మరొక ఆర్టికల్ వ్రాసాను అనడము, మీ సహృదయతకు నిదర్శనము..

  నేను., మరీ లోతుకు వెళ్ళకుండా పైపైనే వ్రాసాను., మీరు విషయాన్ని, విశదీకరించి, విపులముగా, లోతుగా వ్రాసారు….

  కనీసము, మనిద్దరి బ్లాగుల్లోని ఆర్టికల్లను చదివి, ఎవరినా వారి ధోరణి మార్చుకొంటారేమో చూద్దాము.,

  మారాలని కోరుకొంటూ, మీ ఆర్టికల్ బాగుందని మరోసారి చెబుతూ, మీ సహృదయతకు ధన్యవాదములు తెలుపుతూ….

  మీ

  అనిల్ చీమలమఱ్ఱి

 2. వీవెన్ Says:

  🙂 బాగుంది. మార్పు సహజం! మొదట్లో అసహజంగా అనిపిస్తుంది.

 3. చదువరి Says:

  ఈ విపరీత బుద్ధుల చెంప ఛెళ్ళుమనిపించారు మీ చివరి వాక్యంతో!

 4. Nagaraja Says:

  నెల రోజుల క్రితం ఓర్లాండో ఎయిర్ పోర్టులో ఇలాంటి కేటగిరీ మనిషిని చూసాను. మోహం చూస్తే అచ్చం మగవాడిలా ఉన్నాడు, బట్టలు వగైరా అంతా ఆడ. అసలు ఏ కేటగిరీ కూడా అర్ధం కాలేదు. పక్కనే ఉన్న నల్లాయన మాత్రం చాలా పర్సనల్ గా తీసుకొని ‘ఆ’ వ్యక్తిని చాలా ఆటపట్టించాడు.

 5. kasyap Says:

  అమెరికా నే కాదండోయ్! మన భాగ్యనగర ము లొ కూడా ఇంటు వంటి విపరీ తా లు చాలా ఉన్నయి , ప్రతి గురువారము ఒక సభ కూడా ఉంటుంది. నక్లెస్ రోడ్డు ప్రదాన కేంద్రము – ఇవ్వ న్ని నీ కు ఎలాతెలుసును అని నన్ను మాత్రము అడగకండె ! “ఆమద్య టి వీ9 (మెరుగు అయిన సమాజం కోనం (?) )లో కూడా ఒక కార్యక్రమ ము ప్రసార మయినది )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: