దేవుడు రాశాడా?

“మన జీవితం మన చేతులొ వుంది
అనడం ఒప్పా ?
ముందుగానె  దెవుడు
వ్రాస్తాడు అనడం ఒప్పా ?”
ఈ ప్రశ్నకు నా స్పందన.

ప్రతి క్రియకు ఓ నిర్దిష్ట పలితాన్ని దేవుడు రాశాడు లేదా ప్రకృతి రాసింది. పలాయన వేగం కంటే తక్కువ వేగంతో పైకి విసిరిన ప్రతిదీ కిందికే పడుతుంది. అది విసిరింది సత్య సాయిబాబా అయినా, నేనయినా. ఆటంబాంబో, హైడ్రోజన్ బాంబో వేస్తే అందరూ చస్తారు, పుణ్యం చేసిన వాడైనా, పాపం చేసిన వాడైనా. అది ప్రకృతి నియమం. రాయబడింది ఈ నియమాలే, మన జీవితాలు కాదు. విద్యుత్తీగను పట్టుకోవడమా, మానడమా అన్నది మన చేతుల్లోనే వున్నది అయితే పట్టుకున్నాక మరణించడమన్నది ప్రకృతి (అనగా దేవుడు) చేతుల్లో వుంది. దేవుడు చేతుల్లో ఏముందో అది సత్యము, మార్చ లేనిది, మార్పు లేనిది, పక్షపాతము లేనిది. మన ఋషుల మాటల్లో చెప్పాలంటే ఈ సత్యమే దేవుడు. గుణరహితమనే గుణమున్నవాడు దేవుడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, తంత్రాలు, మంత్రాలు ఈ ప్రకృతి నియమాల్ని మార్చవు.
కాబట్టి దేవుడు రాసిందేదో రాసేశాడు, అది నీకు ఒకలా, నాకు ఒకలా రాయడు. ఎండ నిన్నెలా కాలుస్తుందో నన్నూ అలానే. అన్నం నీకెలా ఆకలిని తీరుస్తుందో నాకూ అలానే. వెన్నెల నీకెలా కాస్తుందో నాకూ అలానే. ఇందులో పక్షపాతం లేదు. ఆస్తికుడు, నాస్తికుడు అన్న భేదం లేదు.
మన జీవితం మనం రాసుకొనేదే. నీ చేతిలో రాయితో నీ తలకేసికొట్టుకుంటావో, నా తలకేసి కొడతావో అది నీ చేతిలో వుంది, అది నీవు రాసింది; దేవుడు రాసింది కాదు. ఎవడి తలకేసి కొడితే వాడి తల పగలాలి అని మాత్రమే దేవుడు రాశాడు.

7 వ్యాఖ్యలు to “దేవుడు రాశాడా?”

  1. త్రివిక్రమ్ Says:

    ఆహా! అద్భుతంగా చెప్పారు.

  2. cbrao Says:

    నిస్సందేహంగా మన జీవితం మన చేతులొ వుంది అనడం ఒప్పు.మనం చెసే పనుల ద్వారా, మన భవిష్యత్తు నిర్దేసించ బడుతుంది. కొందరు చక్కగా చదువుకొంటారు. మరి కొందరు జులాయిగా తిరుగుతుంటారు.వీరి వీరి చర్యలు, ప్రణాళికలు వారు ఏమి అవుతారొ నిర్దేసిస్తాయి.ముందుగానె దెవుడు వ్రాస్తాడు అనడం పలాయనవాదమే అవుతుంది.

  3. RamanadhaReddy Says:

    Absolutely correct.

  4. vbsowmya Says:

    baagundi. kaanee idi ilaa chinnagaa mugisi pOgaligE article kaakunDaa unDaalsindi. marinta viSlEShinchaalsindi. 🙂

  5. charasala Says:

    సౌమ్య గారు,
    ఇంకా చెప్పినా చెపీందే చెప్పినట్లు వుంటుంది. ఇప్పుడె చెప్పింది సరిపోతుంది అని నా అభిప్రాయము.

    మీకో సూచన. మీరు లేఖిని వాడి తెలుగు రాస్తే బాగుంటుంది.

    — ప్రసాద్
    https://charasala.wordpress.com

  6. charasala Says:

    సౌమ్య గారు,
    ఇంకా చెప్పినా చెప్పిందే చెప్పినట్లు వుంటుంది. ఇప్పుడె చెప్పింది సరిపోతుంది అని నా అభిప్రాయము.

    మీకో సూచన. మీరు లేఖిని వాడి తెలుగు రాస్తే బాగుంటుంది.

    — ప్రసాద్
    https://charasala.wordpress.com

  7. T.Raja gopal Says:

    Prasad garu,
    Your views are correct. Very interesting and informative subject.
    Pl keep going.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: