ఆత్మలను పలికించేదే (సినారె గీతం)

ఆత్మలను పలికించేదే
అసలైన భాష ||ఆత్మలను||
ఆ విలువ కరువైపోతే
అది కంఠ శోష ||ఆత్మలను||

వేదం ఖురాను బైబిల్
వీధిలోన పడతాయా
మతమేదైనా ఒకటేలే
ప్రతి మనిషి శ్వాస ||ఆత్మలను||

అవినీతికి పీఠం వేసి
అభ్యుదయం పూడ్చిన జాతి
ఇకనైనా కళ్ళు నులుముకో
ఇది రక్త ఘోష ||ఆత్మలను||

నానాటికి ఏమీ పతనం
నాలో ఒక తీరని మధనం
ప్రభుత్వాలు ఏమైతేనేమి
పైసాపై ధ్యాస ||ఆత్మలను||

తల నెరిసి పోతే దిగులు
తను వూరి పోతే దిగులు
అది దిగులు కాదు సినారె
తుది జీవితాశ ||ఆత్మలను||

— ప్రసాద్

3 వ్యాఖ్యలు to “ఆత్మలను పలికించేదే (సినారె గీతం)”

 1. Ramanadha Reddy Says:

  తెలుగులో గజల్ రాయగలగడం ఉర్డూ మాధ్యమంలో ప్రాధమిక విద్యనభ్యసించిన కవి సినారె గారికే సాధ్యపడింది.

  ఆత్మలను పలికించేదే
  అసలైన భాష

  సరిగ్గా రెండు వారాల క్రితం మానాన్నతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ వాక్యం ఎంత అమూల్యమైనదో, ఇంత గొప్ప సత్యం చెప్పడనికి వాడబడిన భాష తెలుగు కావడం గురించి ఆయన నాతో చెప్పడం, ఇప్పుడు మీ ద్వారా పూర్తి పాటను తెలుసుకోవడం బాగుంది. సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో సినారే గొప్పగా పాడిన ఈ పాటలు కడప రేడియో లో చాలా అరుదుగా అప్పుడప్పుడూ విన్నాను.
  మీరు గమనించలేదనుకుంటాను అచ్చు తప్పు ఉంది…
  ఆ విలువ కరువైపోతే
  అది కంఠ శోష

 2. swathi Says:

  thanks సినరె గజళ్ళు చాల రోజుల తర్వాత మీ బ్లాగ్ లో దొరికాయి.

 3. charasala Says:

  Thanks రామనాధ గారూ, తప్పు సరి చేశాను.
  స్వాతి గారూ, మా తమ్ముడితో హైదరాబాదు అంతా వెతికిస్తే ఈ ఒక్క CD దొరికింది. ఆ మద్య US వచ్చిన గజల్ శ్రీనివాస్ పాటలు విన్నాక వీటి మీద మోజు పెరిగింది. ఈ సినిమా పాటలు వినీ వినీ చెవుల్లో దుమ్ము పేరుకు పోయింది.
  — ప్రసాద్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: