భలే మంచి అవకాశం!

వాళ్ళు దిక్కరించారు గనక మేమూ దిక్కరిస్తాం. వాళ్ళు అగ్గిలో దూకారు గనక మేమూ దూకుతాం. ఇదీ ఇప్పుడు మన నాయకుల వరస. గణేష్ నిమజ్జనానికి తెలంగాణా అవతరణకూ ముడిపెడుతున్న ఈ నరేంద్ర అందరినీ తలదన్నేశారు. ఒద్దురా నాయనా సాగర్ కాలుష్యమైపోతోంది అంటే వైస్రాయ్ హోటల్ చేయట్లేదా అంటాడు, మక్కా మసీదులోపలే చేయకుండా బయట నమాజు చేసి హైకోర్టును దిక్కరించలేదా అంటున్నాడు. ఈయన TRSలో చేరినా RSS వాసనలు పోవట్లేదు. ఈ RSS వాసన అంటుకున్నవాళ్ళకు అది ఆజన్మాంతమూ వుంటుంది. కాకపొతే నరేంద్ర దాన్ని తెలంగాణకు అన్వయిస్తే అంబనాధ్  తెలుగు నాడు కి అన్వయిస్తారు అంతే తేడా. ఇప్పుడు మతాభిమానాన్ని తెలంగాణా వేర్పాటువాదానికి ఎంత చక్కగా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి. మత కల్లోలాలూ జరగొచ్చు అంటూ ముందే వంద శాతం నిజాయితీతో మూర్ఖంగా పనిచేసే మత పిచ్చి గాల్ల ని ఉసిగొల్పడానికి సిద్దమవుతున్నాడు. అడ్డుపడుతున్నది కోర్టు, అక్కడే గణేషుని ముంచుతామంటున్నది మీరు మద్యలో ఈ మత కలహాలు ఎందుకు రావాలి? ముస్లిములు అడ్డుపడలేదే!
రాముడు మునిగిపోతాడని ప్రాజెక్టులు కట్టొద్దు, కాలుష్యమవుతుందని నిమజ్జనము ఆపొద్దు. ఏం హుస్సేన్ సాగర్ లోనే ముంచమని అలిగాడా వినాయకుడు?

3 వ్యాఖ్యలు to “భలే మంచి అవకాశం!”

 1. swathi Says:

  అవును, tv లో మొన్నెవడో అవేశం గా చెప్తున్నాడు.
  ఈ నిమజ్జనాన్ని ఎవ్వరూ ఆపలేరు అని.
  ఇలాంటి మత పిచ్చి వాళ్ళు, మూర్ఖులు ఇంకా ఎంత మంది ఉన్నాఓ మన మధ్య.
  లేని పోని గొడవలు సృష్టించేలా ఉన్నారు ఈ వంకతో.

 2. charasala Says:

  JP అంటున్నట్లు దుర్మార్గుడి చేతలకంటే సంపార్గుడి మౌనమే చేటు తెస్తుందన్నట్లు వాళ్ళు అంటుంటారు మనం వింటుంటాం ఆ తర్వాత జరిగే అనర్థాలకి వెక్కి వెక్కి ఏడుస్తాం.
  — ప్రసాద్

 3. RamanadhaReddy Says:

  ముంచాల్సింది వినాయకుణ్ణి కాదు…(మీకు తెలుసు ఎవర్నో)
  హైకోర్టు ఆదేశానికి అవిఘ్నమస్తు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: