తెలుగు దురభిమానం 2

ప్రతి దానికీ ఎదుటివాళ్ళని నిందించేవాళ్ళు కూడా మానసిక రుగ్మతతో బాధపడుతున్న వాళ్ళే. ఎదుటి పిల్లాడు కొట్టాడనేది మన పిల్ల చెప్పింది సరే మరి మన పిల్ల ఏంచేసిందో తెలుసుకోవడం విజ్ఞుల లక్షణం. ఏ సంఘటననైనా మన తన అనే భేదాలు లేకుండా విశ్లేషించినప్పుడే సత్యం బయట పడుతుంది. మనల్ని ఇంకొకడు ఒకసారి మోసం చేస్తే వాడిది తప్పు, రెండోసారి, మూడోసారీ కూడా మోసం చేస్తే అది మన తప్పు. మీరు, వారూ ఎంత పరాయి వాళ్ళయినా ఈ పరస్పరాధారిత  ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఇంకొకరికి ఏదో ఒకటి అవుతారు. తెలుగు జాతి అభివృద్దికి, తెలుగు భాషకు యూనియ‌న్లో వుండటం ఏ విధంగా చెడు చేస్తుందో? ఆంధ్ర ప్రభుత్వాన్ని తెలుగు భాషను అభివృద్ది చేయకుండా అడ్డుకుంటున్నదెవరో చెప్తే బావుండేది. ఉమ్మడి కుటుంబంలో కొందరికి కొంత అన్యాయం జరగొచ్చు, ఇంకొకరికి కొంత లాభం జరగొచ్చు. నేను సుఖంగా వుండాలి ఇతరులతో నాకు పని లేదు అనేవాడు స్వార్థపరుడు. నేనే గాక నా కులం వాళ్ళూ (లేదా నా భాష వాళ్ళు) బాగుండాలనే వారు ఇంకొంచం హృదయాన్ని తెరిచిన వారు. నేను, నా రాష్ట్రం, నా దేశం, ఈ మొత్తం మానవాళి బాగుండాలని కోరుకునే వారు విశాలహృదయులు. మానవ జాతే కాకుండా సర్వ భూతాలూ బాగుండలని కోరుకొనేవారు ఉత్తమోత్తములు.
చరిత్రలో ఎప్పుడు కూడా మన దేశంలో భాషను బట్టి దేశాలు లేవు, ఇప్పుడు కనీసం రాష్ట్రాలైనా వున్నాయి. మతాలను బట్టి, కులాలను బట్టి పోరాటాలు జరిగాయి కానీ, నాకు తెలిసి భాష ప్రధానంగా యుద్దాలు చేయలేదు.
మనపేర్లు హిందీ పేర్లు పెట్టుకోమని హిందీ వాళ్ళు బలవంతం చేశారా? ఇంగ్లీషు నేర్చుకోమని ఆంగ్లేయులు మనల్ని బలవంతం చేస్తున్నారా? ఇండియన్ యూనియన్‌లో వున్నా, వూడినా మన వాళ్ళు అలా పేర్లు పెట్టుకోవడం మానరు. తెలుగు మీద మీకు శ్రద్ద వుంటే దాని మీద ప్రజల్ని జాగృతం చెయ్యండి, మిమ్మల్ని యూనియన్ ప్రభుత్వము అడ్డుకుంటుందా? ఎంతో మంది తమ పిల్లలకి ‘లెనిన్’ అని పెట్టుకోవడం చూశాను, కానీ మనం కంయూనిస్టుల ఏలుబాదిలో వుండటం వల్ల అలా పెట్టుకోలేదే?
ఇండియా, పాకిస్తాన్ ముక్కలైతేనే గుండెలు బద్దల్వటం ఎందుకు? ఇజ్రాయెల్, లెబనాన్ పోరాటంలో చనిపోతున్న వారి గురించి కూడా బ్రద్దలవుతుంది. ఖచ్చితంగా ఇలా ఆలోచించబట్టె గదా కొన్ని వేల సైన్యంతో ఎక్కడినుంచో వచ్చి విదేశీయులు ఒక్కో బాగాన్ని ఆక్రమించుకోగలిగారు. హిందీ వాళ్ళకి, ముస్లిములకీ కయ్యముంటే మనకెందుకు అని వూరకుంటే చరిత్ర పునరావృతమవుతుంది, పక్కిల్లుతో పాటూ మనిల్లూ కాలుతుంది.
“ఓహ్ ! ఆంధ్రా అంటే రీజినల్. తెలుగంటే narrow mind. అబ్బే, నేను ఆంధ్రాకి పరిమితం కాదు, నేనో జాతీయజీవిని, నేనో అంతర్జాతీయజీవిని” అంటూ అంధ్రాకి సంబంధించినదేదీ వినడానిక్కూడా ఇష్టపడకుండా దులుపుకునిపోయే జాతి సృష్టించబడింది. వలసపోయినవాళ్ళకి ఈ మాట బాధాకరంగా ఉండొచ్చు.”
నన్నడిగితే వలసపోయినోల్లలో వున్న ఆంద్రాభిమానం, దేశాబిమానం స్థానికంగా వున్న వాళ్ళ కంటే గూడా ఎక్కువే. తల్లికి దూరంగా వున్నపుడు తల్లి ప్రేమ గుర్తొచ్చినట్లు, జీవనోపాధి కోసం దూర దేశాల్లో వున్నా ప్రవాసులకున్న బాషాభిమానం ఎవరికీ తక్కువది కాదు. హైదరాబాదు కైనా, బెంగుళురు కైనా, ఇండియా కైనా ఇప్పుడొచ్చిన పేరు ప్రఖ్యాతుల వెనుక ప్రవాసుల హస్తం లేకుండానే జరిగాయి అనుకుంటున్నారా? “ఏ దేశమేగినా ఎందు కాలిడినా..” అన్న గీతాన్ని పాడటమే గాదు, పాటిస్తున్న వాళ్ళూ ప్రవాసులే. ప్రవాసమెళ్ళిన ఏ వూరి గడపైనా తొక్కి చూడండి ప్రవాసుడి మమకారం తెలుస్తుంది మాతృభూమి మీద. ఆంధ్రాకి సంబందించింది వినడమే కాదు, ఆంద్రా అలవాట్లని, ఆచారాల్ని, భాషని ప్రవాసులు తమ పిల్లలకి నేర్పించినట్లు స్థానికులు నేర్పిస్తున్నారంటే సందేహమే. దూరంగావున్న ప్రవాసులకే తెలుసు జన్మభూమి విలువేంటో.
మీరే ఒకచోట అన్నట్లు 8 కోట్లమంది ఆంధ్రాలో వుంటే మరంత మంది విదేశాల్లో వున్నారు, కొత్త ప్రదేశాలకు విస్తరించకుండా వున్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకు కూర్చొని వుంటే కూపస్థమండూకంలా వుండేది తెలుగు జాతి. ప్రవాసులందరూ కన్ననేలని విసర్జించి వచ్చిన వాళ్ళు కాదు, వుంటే కొందరు వుండవచ్చు. బతుకు పోరాటంలో నిచ్చెలనెక్కిన వాళ్ళు, ఆభివృద్దిచెందినా దేశాల ఆకర్షణతో వచ్చిన వాళ్ళు వున్నారు, అయితే మాతృభూమిని మరువని వారే అధికులు.
immigration తోనే అమెరికా బాగుపడిందనే విషయం మీకు తెలియంది కాదు.
” ఆ రకంగా, ఈరోజు తెలుగుభూమిమీద రైతుకూలీలూ, చిన్నజీతగాళ్ళూ, కిరాణా/బట్టల వ్యాపారులూ, మహా ఐతే వీధివీధికీ రాజకీయ నాయకులూ తప్ప, దీని తలరాత మార్చగల మేధావులెవరూ లేకుండా పోయారు. వాళ్ళు లేరు గనక ఇక్కడ పరిస్థితులు మారవు. పరిస్థితులు మారవు గనక వాళ్ళు వెళ్ళిపోతారు.ఇదో విషవలయం.”
ఇంకా మీరు బ్రైన్ గైన్ గురించి తెలుసుకోలేదా? తల రాత మార్చడానికి మేధావులు కావాలనడంలో నేను మీతో ఏకీభవిస్తాను, కానీ అది యూనియన్ నుంచీ విడిపోవడం ద్వార సాధ్యమా?  విడిపోతే మేధావులంతా వలస పోకుండ ఆగుతారా?
“తెలుగుజాతి, ఇండియా- ఈ రెండూ పరస్పర విరుధ్ధమైన loyalties”
తరచి చూస్తే ఈ రెండే కాదు ఇంకా ఎన్నో విరుద్దమైన loyalties కనిపిస్తాయి.
బార్యకు(బర్తకు) విధేయంగా వుండాలా? తల్లిదండ్రులకు విధేయంగా వుండాలా?
కుటుంబానికి విధేయంగా వుండాలా? వూరికి విధేయంగా వుండలా?
జిల్లాకా, రాష్ట్రానికా? రాష్ట్రానికా, దేశానికా?
కన్న తల్లికా, పెంపుడు తల్లికా?
ఇంత మందికి ఏకకాలంలో విధేయంగా వుండగలుగు తున్నప్పుడు తెలుగు జాతికి, భరత జాతికీ విధేయంగా ఎందుకు వుండలేము?
తండ్రిగా, కొడుగ్గా, భర్తగా, మామగా ఇలా ఎన్నో పాత్రలను వ్యక్తిగా పోషించగలుతున్నప్పుడు, తెలుగు సమాజం తనకూ భారతానికీ ఎందుకు విధేయంగా వుండలేదు?

ప్రతి వారికీ తనదే న్యాయంగా అని పిస్తుంది. వాళ్ళ వాళ్ళ పెరిగిన నేపధ్యమూ కారణమవుతుంది. హిట్లర్ తను అనుకొన్నది ధర్మమూ న్యాయమనే అనుకొన్నాడు. జర్మన్ జాతి శ్రేయస్సుకు యూదులే కారణమన్నాడు. రావణాసురున్ని రాముడు చంపడమంత ధర్మమనుకొన్నాడు, యూదుల్ని చంపి జర్మన్ జాతిని రక్షించడం కోసం. మన బుర్రలు కూడా సినిమా మొదలైన దగ్గరినుంచీ విలన్ మీద అసహ్యాన్ని పెంచుకుంటాయి గనక సినిమా చివర్లో హీరో విలన్ని ఎంత క్రూరంగా చంపినా ఈలలు వేస్తాం, సంతోషపడిపోతాం.
మన పరిసరాలు, జీవితంలో ఎదురైన అవమానాలు, కష్టాలు మనం తప్పు చేస్తున్నా తప్పు అననియ్యవు. మన తప్పుకి కారణాలుగా మంకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తాం.

— ప్రసాద్

8 వ్యాఖ్యలు to “తెలుగు దురభిమానం 2”

 1. cbrao Says:

  అసలు ఈ ప్రాంతాభిమానం, దేశాభిమానం అవసరమా అనిపిస్తోంది.పెచ్చుమీరిన ఇలాంటి అభిమానాలవల్లే ఎన్నొ అనర్ధాలు జరుగుతున్నాయి.ఈ దురభిమానాలాకు దూరంగా విశ్వమానవ సర్వ సౌభాత్ర ప్రేమను పెంచుకుంటే,వసుధైక కుటుంబం నీదనుకొంటే ఈ ఆవేశాలు,యుద్ధాలు ఉండవు.

 2. charasala Says:

  రావ్ గారూ, మీమాటే నా మాట.
  విభజించుకోవటానికి సవాలక్ష కారణాలు వుండనీ, కలిసి వుండటానికి ఒక మంచి కారణము వుంటే చాలు, నేను కలిసి వుండటానికే ఇష్టపడతాను.

  — ప్రసాద్

 3. Nagaraja Says:

  రావుగారు మరియు ప్రసాదు గార్లకు,

  మీరు చెప్పేది చెవులకు ఎంతో ఇంపుగా అనిపిస్తుంది కానీ, మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆలోచిస్తే మీరు అయోమయంలో (కన్ఫ్యజన్ లో) మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. “విశ్వ మానవ సర్వ సౌభాత్ర ప్రేమ”, “వసుధైక కుటుంబం” అనేటి కొన్ని పదాలు వాక్యాలు పలికి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదా? మనల్ని మనం (మనకు తెలియకుండా) మాటలతో మోసం చేసుకోవడం చాలా సులభం. బలహీనులుగా ఉన్నప్పుడు మాట్లాడవలసిన మాటలు కావు ఇవి.

  ఈ విషయంలో తెలుగు జాతీయవాది మీకంటే 100% నిజాయితీపరుడని నా అభిప్రాయం – అతని ఉద్దేశాలు ఎలాంటివైనా!

  నా ఉద్దేశ్యంలో ఈ పాటికి మీరు దీనికి సంబంధించిన విషయాలన్నీ మరచిపోయి మీ జీవన విధానంలో మళ్ళీ పడిపోయే ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇది అత్యధిక మంది తెలుగు వారిని పట్టి పీడించే వ్యాధి.

  బంధువులను, స్నేహితులను వంటి వారిని చూసి అర్జునుడు అస్త్రాలను కింద పడవేసి కృష్ణునితో ఇలాంటి మాటలే అన్నాడు. మీరు కూడా అస్త్రాలను కింద పడవేసి మాట్లాడుతున్నారు … 🙂

 4. charasala Says:

  నాగరాజ గారూ,
  “వసుధైక కుటుంబం”, “విశ్వమానవ ప్రేమ” ఇవి పెద్ద పదాలే అయినా ఇవి మేం పలుకుతున్నవి కాదు, వేల ఏళ్ళనుండి మునులు, ఋషులు చెప్తున్నవే. వాటి అంతస్తులో ఆలోచించగలిగిన పెద్దవాణ్ణి కాకపోయినా విడిపోవడంలో సుఖం, శాంతి, అభివృద్ది వస్తాయంటే నేను నమ్మను. కలిసి వుండటం లోనే సుఖం, శాంతి, అభివృద్ది వున్నాయని నేనూ వందశాతం నిజాయితీతోనే వాదిస్తున్నాను. పెద్దలంతా అంగీకరించిన “వసుధైక కుటుంబం”, “విశ్వమానవ ప్రేమ” పదాలు పలకడం ద్వారా మేమెలా మమ్మల్ని మోసం చేసుకుంటున్నామో వివరించండి. విభజిస్తూ పోతే చివరికి మిగిలే విభజించలేని యూనిట్ “నేను”, ఈ ప్రతిఒక్క “నేను” కి ఒక ప్రత్యేక రాజ్యం సాధ్యం కాదు. అంబనాధ్ గారి వాదన ప్రకారం తెలుగు వారికి సార్వభౌమ రాజ్యమే కావలంటే, తెలంగాణకీ కావాలి, రాయల సీమకీ కావాలి, ఆంధ్రాకి కావాలి. లేదా భాషా విషయంగా కావాలి అంటే ప్రత్యేక భాష వున్న ప్రతివారికి (యానాదులకీ, సుగాలీలకీ) సార్వభౌమ రాజ్యం కావాలి.
  మంచి ఎవడు చెప్పినా మంచే, హిందీ వాడు మంచి చెప్పితే, వాడు చెప్పాడని అది తప్పు అందామా? రాజ్యాంగ సభలో తెలుగువాడు (వున్నాడొ లేదో నాకు తెలియదు) లేనంత మాత్రాన అది హిందీ రాజ్యాంగమైపోయిందా? మనం దానికి లోబడాల్సిన పని లేదా?
  అర్జునుడు అస్త్రాల్ని పడేసినట్లు పడేయడం కాదు నా వుద్దేశ్యం. ఇక్కడ కౌరవులు ఎవరన్నదే నా ప్రశ్న. ఆకలి, దారిద్యం, మూఢనమ్మకాలు, అవినీతి, దౌర్జన్యం ఇవీ కౌరవులు. వీటి మీద ప్రయోగించాలి మన అస్త్రాలు. వీటితో చేయాలి మన భారత యుద్దం. ఇంకా యాబై శాతం నిరక్షరాస్యులు, వోటు విలువ తెలియక పదికో పాతికకో వోటు అమ్ముకునే ప్రజలను ఈ వేర్పాటు వాదం ఎక్కడికి తీసుకు వెళ్తుంది?
  ప్రపంచంలో నా, నాకులం, నాజాతి, నామతం పేరుతో ఎన్ని మారణహోమాలు చూడట్లేదు? ఇప్పుడున్న వ్యవస్థ మార్పుచేయలేనిదై వుండి, నియంత పాలనలో అణగదొక్క పడుతున్నప్పుడు నిజమే మీరన్నట్లు ఉద్యమించాల్సిందే! ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో మనకా అవకాషాలే లేవా? తెలుగు వాడు ప్రధాని కాలేదా?
  తెలుగు వాడికి అన్యాయం జరుగుతుంటే అవి సాధించుకోలేని నియంతృత్వ వ్యవస్థలో వున్నామా మనం?
  — ప్రసాద్

 5. cbrao Says:

  హింది అభిమాని ఐన BJP కూదా భారతదేశ సమైక్యతనె కోరుకుంటుంది. ఇలా విభజించుకొంటూ పొతే బలహీనులమౌతాం.కలిసిఉంటేనే భారతదేశానికి బలం.

 6. Nagaraja Says:

  దేశ విభజన, రాష్ట్ర విభజన విషయంలో నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. సమైక్య భారతదేశం గురించి రెండవ మాటే లేదు. అయితే ఎదుటివారిని బాధపెట్టనంతవరకు ప్రాంతాభిమానం ఉండటంలో అసలు తప్పులేదు అని నా అభిప్రాయం. అది దురభిమానం అని కూడా నేను అనలేను.

  ఒక ఉదాహరణ: (చాలా మంది) మన తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తారు, వారి గురించే ఆరాటపడతారు. ఆ విధంగా కష్టపడితే పిల్లలు వృద్ధిలోకి వచ్చి అందరు గర్వించదగ్గవారు అవుతారు. తల్లిదండ్రులు అందరి పిల్లలను సమంగా చూడాలి అని అనడాన్ని నేను మోసం చేసుకోవడం అని అంటున్నాను.

  రావు గారి మాట్లల్లో మీ మాటల్లో గొప్ప భావాలు, జ్ఞానం అనేవి ఉన్నాయి అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. నా దృష్టిలో మీరు మాట్లాడే మాటలే విలువైనవి.

  ఇకపోతే తెలుగు జాతీయవాది అజ్ఞానంలో చాలా నిజాయితీ ఉంది. తెలుగు వారు, భాష వంటి విషయాలలో రక్తం పొంగే ఆవేశం ఉంది. అది సరైన దిశలో ప్రకాశించి ముందుకు వెళ్తే అతడు మనకు (తెలుగు వారికి, భారత దేశానికి) ఎంతో సహాయపడతాడని నా అభిప్రాయం. కానీ పూర్తిగా వ్యతిరేకించడం వల్ల అందరి ఎనర్జీ పోతుంది, ఎవ్వరికీ లాభం లేదు.

  ఇలా చక్కటి బ్లాగు వ్రాసినందుకు మీకు, చక్కటి వ్యాఖ్యలు వ్రాసినందుకు రావు గారికి నా యొక్క అభినందనలు. నాకు ప్రసాదు గారు, రావు గారు, తెలుగు జాతీయవాది అందరు ఎంతో ఇష్టమైన వారు.

 7. charasala Says:

  ‌నాగరాజ గారు,
  మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను చెపుతున్నదీ సరిగ్గా అదే, ఇతరులను బాధ పెట్టనంతవరకూ మన అభిమానం సరైనదే. మనమే అందరి కంటే శ్రేష్టులమనో, ఇతరులను తెగడ్డమే మన పొగడ్త అనుకోవటమూ దురభిమానమవుతుంది.
  మీ వుదాహరణ లోలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలనుకోవడం, వారి గురించి ఆలోచించి ఆరాటపడడం వరకూ తప్పులేదు. అయితే పక్కింటి అబ్బాయికి మొదటి ర్యాంకు వస్తోందని ఆడిపోసుకోము గదా? పక్కింటి అబ్బాయికి మొదటి ర్యాంకు రావటం వల్లే మనబ్బాయికి మొదటి ర్యాంకు రావట్లేదని వాడి మీదకు దండెత్తం కదా? అలాగే ఇద్దరి మద్యా పోట్లాట జరిగినప్పుడు న్యాయంగానే తీర్పు చెప్పాలి, కాకపోతే ఇంటికి వచ్చాక మన పిల్లాడు కాబట్టీ మందు పూస్తాం, కట్టు గడతాం. ఆ మాత్రం సమానత్వ న్యాయం గురించే నేను చెప్పేది. అందరినీ సమానంగా చూడడమంటే మన పిల్లాడికి పరమాన్నం పెట్టినప్పుడల్లా ఎదురింటి పిల్లాడికి కూడా పెట్టమని కాదు.
  జరుగుతున్న, జరిగిన చరిత్ర కూడా చూసి నేర్చుకోకుండా అంబనాధ్ వాదించడాన్ని నేను సమర్థించలేను. అతని నిజాయితీ మీద నాక్కూడా ఎలాంటి శంకా లేదు. భూతవైద్యుడు తనకు పట్టిన దయ్యాన్ని వదిలించగలడని నమ్మే అమాయకుడు కూడా నిజాయితీగానే నమ్ముతాడు. భూమి బల్లపరుపు గా వుందని, క్రీస్తు “మాత్రమే” దేవుని దగ్గరికి చేర్చే “ఏకైక” మార్గమని, తిరుమల పై వున్నది సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తే నని నూరు శాతం నిజాయితీగానే నమ్ముతున్నారు ప్రజలు. నూరు శాతం నిజాయితీ అన్నది మంచిమార్గానికి చిరునామా కాదు.
  అజ్ఞాని తను అజ్ఞానంతో మాట్లాడుతున్నానని, పిచ్చివాడు తను పిచ్చితో మాట్లాడుతున్ననని ఎరగడు. నేనూ పిచ్చితోనే మాట్లాడుతున్నానేమొ! వాదించటం, తర్కించటం, ఇతరులు చెప్పేది వినటం, మన భావాలు భాష్యాలు కాసేపు పక్కన పెట్టి, నిష్పక్షపాతంగా రెండు అభిప్రాయాలను బేరీజు వేయటం ద్వారా మంచిని గ్రహించగలం. అంబనాధ్ చర్చకు తావేలేదు, నీవు మారాలే గానీ నేను మారను అంటున్నాడు. ఇలాంటి వారి గురించి మనం ఆలోచించాల్సిందే.
  — ప్రసాద్

 8. Dileep Says:

  Good discussion, our leaders placing their efforts to divide but as my opinion if they put their effort on development that’s good for all.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: