పరమాత్మ

http://rohiniprasadkscience.blogspot.com/  ఈ బ్లాగు చూశాక ఇక నా స్పందనను దాచుకోలేక పోయాను. 

నా మట్టుకు నాక్కూడా ఖచ్చితంగా దేవుడంటే ఇలాంటి భావాలే వున్నాయి. సృష్టిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవన్నీ అలానే జరగాలనేది భౌతిక సూత్రమనేది నా అభిప్రాయము. భూమికి ఆకర్షనశక్తి ఎందుకు వుండాలి, ఈ గ్రహాలన్నీ తమ తమ నిర్దేషిత కక్ష్యల్లోనే ఎందుకు ప్రయానించాలి లాంటి ప్రశ్నలకు నా సమాధానం, “సత్యమే ఎందుకు పలకాలి” అన్నదానికి జవాబు ఎలా లేదో, అలానే వీటి ప్రవర్తనకు జవాబు లేదు. ఒకవేళ వున్నా అది మళ్ళీ జవాబులేని ప్రాధమిక సూత్రాలను బట్టే వుంటుంది. ఈ సృష్టి అంతా కొన్ని వాదించలేని, తర్కించలేని ప్రాధమిక భౌతిక సూత్రాలపై ఆధారపడి వుంది. కత్తితో పొడిస్తే అది పుణ్యాత్మున్నైనా, పాపాత్మున్నైనా ఒకేలా భాధిస్తుంది. కత్తికి, బాధకు సంబందం లేదు. అలాగే కత్తి గుచ్చుకుంటే భాధ కలగాలి అన్నది ప్రాధమిక సూత్రం. ఇందుకు కటిక బీదవాడికైనా, సత్యసాయి బాబా కైనా మినహాయింపు లేదు. అలాగే పదార్థాము చైతన్యమయము కావడము, చైతన్యరహితం కావడం అన్నీ కూడా ఇంకా కనిపెట్టని ప్రాధమిక సూత్రాల మూలంగా జరుగుతున్నవే. అయితే ఇక్కడే ఎక్కడో భౌతిక వాదము, ఆద్యాత్మిక వాదము కలుస్తాయనుకుంటాను. జంతువుల తలలతో దేవుళ్ళను పూజించడం ఇవన్నీ అత్యున్నత స్తాయిలోని అద్యాత్మికవాదాన్ని తెలుసుకోలేని అల్పబుద్దులను సంతోషపెట్టాడానికి చేసిన nopnsense అనిపిస్తుంది. అయితే అన్నిటిలోనూ వుండి అన్నీ తనలో వుండే సర్వాంతర్యామి దేవుడు అంటే నేను పెద్ద వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇప్పటివరకూ అనుకున్న తర్కించలేని, వివరించలేని ఏ ప్రాధమిక భౌతికసూత్రాలపై ఆధారపడి ఈ సృష్టి, విశ్వం, చైతన్యమవుతూ వుందో,  పదార్థం చైతన్యసహితమూ, చైతన్యరహితమూ అవుతూందో, ఆ భౌతికసూత్రాలనే పరమాత్మ అనుకోవచ్చేమో. అయితే అంతమాత్రాన ఆ పరమాత్మకి బుద్దిని జోడించి పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, బలులివ్వడం ఎంత అవివేకమంటే పైకి విసిరిన కింద పడకూడదని, గాలిలో పెట్టిన దీపం ఆరిపోకూడదని ప్రార్థించడం లాంటిది. ప్రతి క్రియకూ పలితం భౌతికసూత్రాలపై ఆదారపడి వుందే కానీ అది పూజల వల్ల వ్రతాల వల్ల మారదు.
అయితే ఈ సత్యాన్ని నగ్నంగా చూపడంవల్ల ఈ స్థాయిలో ఆలోచించని వారు, భగవంతుడూ, స్వర్గం,  నరకం లేవు అంటే పాపభీతి లేకపోవడం వల్ల సమాజానికి అనర్థం చేస్తారేమొ. ఇలా ఆలోచించడం కూడా తప్పేనేమొ, ఈ దేవుళ్ళమీద విశ్వాసం వుంచడం వాల్ల మాత్రం ఇప్పుడేం జరుగుతున్నది? మతాలపేరుతో చంపుకోవడాలేగా!

— ప్రసాద్
https://charasala.wordpress.com

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “పరమాత్మ”

  1. Nagaraja Says:

    గురువు:

    “నిను నీ వెఱుగగ నెంచిన –
    మనమున సంకల్పములను మానగవలెరా;
    అనుమానరహితముగ మరి
    వినయంబున గురుని బట్టి వెదకుము వేమా!”

    తా|| నిన్ను నీవు తెలుసుకోవాలంటే, మనస్సులో సంకల్ప వికల్పాలు పోయి తీరాలి; అనుమాన రహితుడవయి సవినయంగా ఆధ్యాత్మిక గురువును చేరి సత్యాన్వేషణ గావించు ఓ! వేమా! (ధ్యాన వేమన – బ్రహ్మర్షి పత్రీజీ)

  2. dhananjaya Says:

    బాగుంది ప్రసాద్ గారు. మీరు నా బ్లాగులో ఎలమి అంటే ఏమిటని అడిగారు కదా, ఎలమి అంటే సంతోషం.

  3. charasala Says:

    ధనంజయ గారూ,
    సంతోషము. ఒక కొత్త పదాన్ని నేర్చుకున్నాను.

    నాగరాజ గారూ,
    సంకల్ప, వికల్పాలు పోయాక నేనొక బండరాయినే కదా, ఇక నన్ను నేను తెలుసుకోవాలనే సంకల్పం ఎక్కడుంటుంది?

    — ప్రసాద్

  4. T.Raja gopal Says:

    Dear Prasad garu,
    Glad to see “antha rangam”
    In my school days I read a poem , “On his blind ness” by John Milton. Alast verse says ” WHO BEST BEARS HIS MILD YOKE ,THEY SERVE HIM BEST”. So every one if does his assigned duty well, that is enough. He should try to be happy and make others happy in doing his job.
    Raja gopal.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: