Archive for జూలై 21st, 2006

అలవాటు 1 Proactivity (Habit 1 from 7 habits of highly effective people)

జూలై 21, 2006

ఈ పుస్తకం చదవనంత వరకూ proactivity అంటే నాకూ దురభిప్రాయము వుండేది. దుందుడుకుగా, దూకుడుగా చేయటమని. కానీ proactivity కివి విరుద్దం.
బాధ్యత తీసుకోవటం, initiative (ఎంత ఆలోచించినా బుక్ లో ఇంగ్లిష్ పదాలతో conditioned కాబడడం వల్ల తెలుగు పదాలు తట్టడం లేదు) తీసుకోవటం proactive (స్పందించడం) లక్షణాలు. ఈ క్రింద పట్టిక స్పందనకు (proactive), ప్రతిస్పందనకు (reactive) మద్య భేదాన్ని స్పష్టంగా చూపుతాయి.

ప్రతిస్పందన(Reactive) స్పందన(Proactive)
నేను చేయగలిగిందేమీ లేదు. ప్రత్నామ్యాయాలు వున్నాయేమొ అలోచిద్దాం.
నేనంతే. ఇంకో విదంగా చేస్తాను. (I can choose a different approach)
అదే నన్ను పిచ్చివాన్ని చేసేది. నా భావాలని నేను అదుపులో పెట్టుకోగలను.
అట్లైతేనే చేస్తాను. నేను ప్రతిభావంతంగా దీన్ని ప్రదర్శించగలను.
నేనది తప్పక చేయాలి. నేనేది చేయాలో నేనెంచుకోగలను.
వాళ్ళది చేయనివ్వరు. నేనే ఎన్నుకుంటా.
నా వల్ల కాదు. నేను చేయగలను.
చేయక తప్పదు. I prefer.

Stimulus (ప్రేరేపణ)  –> Response (జవాబు)

రచయిత మాటల్లో  We are conditioned to respond in a particular way to a particular stimulus. మనం ఒక విధంగా మలచబడ్డానికి (conditioned) మూడు రకాలైన కారణాలు ఉన్నాయి.
జన్యు పరంపర: కొన్ని మన వంశమునుండి సంక్రమిస్తాయి.
పెంపకము: మనల్ని పెంచిన తీరు మనల్ని మలుస్తుంది.
అనుభవము: అనుభవం వల్ల, చదివి తెలుసుకున్న దాని వల్ల కూడా మలచబడతాము.
సాదారణంగా మన ఒక stimulus కి మనం ఇచ్చే జవాబు మనం ఏవిదంగా మలచబడ్డాము అనేదాన్నిబట్టి వుంటుంది. ఒకడు నీ చెంప మీద కొడితే తిరిగి వాడి చెంప పగుల గొట్టాలా, లేక ఇంకో చెంప చూపించాలా అనేది మనం ఎలా మలచబడ్డాము అనేదాన్ని వుంటుంది.
proactive వ్యక్తి జవాబు ఎలా వుండాలి అనేది, చెంప పగుల గొట్టాలా లేక ఇంకో చెంప చూపించాలా అనేది తనే ఎన్నుకుంటాడు, దాన్ని తను మలచబడ్డ తీరు నుంచి విడిగా చూసి తన నిర్ణయాన్ని తీసుకుంటాడు.
reactive వ్యక్తి జవాబు ఎన్నుకోలేడు. తను ఈ stimulus కి ఈ response అని pre-program చేయబడ్డాడు.

సమస్యావలయము (Circle of Concern)
మనకు ఎన్నో సమస్యలుంటాయి. ఉద్యోగం రాలేదనో, పై అధికారి గుర్తించట్లేదనో, బార్య ప్రవర్తన బాగా లేదనో, దేశంలో తీవ్రవాదం గురించో, పెరిగి పోతున్న అవినీతి గురించో, మద్య ఆసియా సంక్షోబము గురించో. వీటిని మనం రెందు రకాలుగా విభజించవచ్చు.
1. మన ప్రమేయం ఏ విదంగానూ లేనివి.
2. మనం కొద్దిగా ప్రబావితం చేయగలిగినవి.
ఇందులో మొదటివి వదిలేస్తే మిగిలిన వాటి చుట్టూ ఒక గీత గీస్తే అవి మన Circle of influence అవుతుంది. మనం మన ప్రబావం లేని సమస్యల జోలికి పోకుండా మన ప్రబావం చూపించగలిగిన వాటి మీద కేద్రీకరించదం ద్వారా మన influence ను పెంచుకోగలుగుతాము. దీన్ని వివరించడానికి రచయిత గాందీని ఉదాహరణగా చూపాడు.
గాందీ దక్షిణాఫ్రికా నుండి బారతదేశానికి వచ్చినపుడు, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారిని నిందిస్తూ కూర్చున్నారు. తమ ప్రభావశీలత్వాన్ని పెంచుకోకుండా, బయటివారి శీలత్వాన్ని నిందిస్తూకూర్చున్నారు. కానీ గాందీ రాజకీయపదవుల జోలికి పోకుండా తన character నుండి పని ప్రారంబించాడు. పల్లెల్లో హీన స్థితిలో వున్న రైతులనుండి తన ప్రభావాన్ని (influence) ను పెంచుకుంటూ మొత్తం కోట్ల జనాభాని తన తను మాట్లాదిందే వేదం అనేట్లు చేశాడు.

అంతిమంగా నేను అర్థం చేసుకున్నదేమంటే, reactive person, environment మారితేనే గాని తను మారలేను అనుకుంటాడు. తన పరిస్థితికి తన చుట్టూ వున్న పరిస్థితులే కారణం అంటాడు. బయటనుండి లోపలికి మార్పు రావాలంటాడు.
proactive person లోపలనుండి బయటకు మార్పు రావాలంటాడు. తను మారతాడు, తన శీలాన్ని మెరుగుపర్చుకుంటాడు. ఆ విధంగా బయటి ప్రపంచంలో మార్పు తీసుకు వస్తాడు.

ఇంకా ఈ పుస్తకంలో చాలా concepts మనసుకు అందుతున్నాయే గానీ పెన్నుకు అందటం లేదు. లేదా నాకు వాటిని సరిగ్గా వ్యక్తీకరించటం చేత కావట్లేదు.

రేపు అంటే సోమవారం రెండవ అలవాటు (Habit 2) గురించి ముచ్చటిద్దాం.
నేను ఈ పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లయితే ఈ పుస్తకాన్ని ఇప్పటికే చదివిన వారు నన్ను సరిదిద్దగలరు.

— ప్రసాద్