ఇదీ మన భారతీయం!

సెప్టెంబర్ 11 తర్వాత కోలుకోవటానికి అమెరికాకు ఎన్ని రోజులు పట్టింది?
మాడ్రిడ్ దాడి తర్వాత ఇటలీకి ఎన్ని రోజులు పట్టింది?
లండన్ లో రైళ్ళు, బస్సుల మీద దాడి తర్వాత ఆ దిగ్బ్రమ నుండి తేరుకోవటానికి ఎన్నాళ్ళు పట్టింది?

ఖచ్చితంగా ఒక్క రోజు మాత్రం కాదు.

అదే మన ముంబయి చూడండి. ఒక్కరోజులో ఏమీ జరగనట్టు, రక్తం మరకలు కడిగేసి, పాడైన బోగీల్ని తుక్కు కింద పడేసి మళ్ళీ ఎంత చక్కగా జీవన ప్రయాణం సాగిస్తున్నామో!
చచ్చినవాళ్ళ కర్మ అలా చావాలని ఉంది గనక చచ్చారని సరిపెట్టుకుంటున్నాం. లేకుంటే ఇది మనకు కొత్తా, ఎన్ని బాంబు దాడులు జరగలేదు? ఎంత మంది చావ లేదు?
అయినా చావు దేహానికే గానీ ఆత్మకు కాదని మనకు తెలియదా ఏంటి? మరణం ఎంత అనివార్యమో మళ్ళీ జననమూ అంతే అనివార్యమనే సంగతి అనాది నుంచీ మనకు తెలుసు. అందుకే వీటిని నివారించాలనుకోవటం వొట్టి పనికిమాలిన పని. అసలు కర్మ అలా వున్నప్పుడు ఆపడం మన తరమా! ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లోనే వేల మంది చని పోతున్నారు, ఈ వంద మందీ, రెండొందల మందీ ఒక లెక్కా?
ఈ కర్మ సిద్దాంతాన్ని మనం ఎంత ప్రసిద్దం చేస్తే ప్రపంచంలో అంత శాంతి నెలకొంటుంది. ఎవరి చావుకు ఎవరూ కారణం కాదు, అన్నిటికీ వారి వారి కర్మలే కారణం. ఇది తెలియక జార్జి బూషయ్య ఎంత కుంపటి రగిల్చాడు!! ఆప్ఘనిస్తాను, ఇరాకు రావణ కాష్టాలయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెలు ఈ కర్మ సిద్దాంతము ఎప్పుడు నేర్చుకుంటుందో! ఒక సిపాయిని అపహరిస్తే బడబాగ్నులు కురిపించాలా? అది అతని కర్మని సరిపెట్టుకోక? ఇద్దరు సిపాయిల్ని తీవ్రవాద మూక అపహరించిందని ఏకంగా లెబనాన్ ముట్టడా? రామ రామ! మనల్ని చూసి వారెంతో నేర్చుకోవాలి. ఆ మద్య మన పక్కనున్న బుల్లి బంగ్లాదేషు సైనికులే మన సైనికుల్ని అపహరించి, మొహాలు చెక్కేసి, కిరాతకంగా చంపి పారేస్తే, వారి కర్మ అలా కాలిందని ఊరుకోలేదా?? మన విమానాన్ని హైజాకు చేసి ఆఫ్ఘనిస్తాను నుండీ రాయబారాలు చేస్తే, మనం ఎవరిమీదనైనా ఒక్క తూటా పేల్చామా? తాలిబాన్లని ఒక్కమాట అన్నామా? అది మన రాత అని సరిపెట్టుకొని, మన మంత్రివర్యులే వాళ్ళడిగిన వాన్ని వెంటబెట్టుకొని అప్పజెప్పి రాలేదా?
ఈ ఇజ్రాయెలు ఎప్పుడు నేర్చు కుంటుందో!!
సెప్టెంబర్ 11 దెబ్బకి మళ్ళీ అలాంటిది .. చిన్న బాంబు దాడి కూడా అమెరికాలో జరగలేదు. మన దేశంలో మాత్రం మళ్ళీ మళ్ళీ ఇవి జరుగుతున్నాయంటే మన చేతకానితనం, మన నేతల చేతకానితనం ఎంత మాత్రం కాదు! మన ప్రారబ్దం అంతే!

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత స్టాకు బజార్లు కుప్పకూలాయి, విమాన సంస్థలు చేతులెత్తేశాయి. కాని మనం అలాంటి వాటికి జడుస్తామా! ఇలాంటి దాడులు మనల్ని ఏమీ చేయలేవు మన కర్మ అలా వుంటే తప్ప! మన కర్మను ఊహిస్తున్న వాళ్ళంతా ఇంకో పది పదిహేను ఏళ్ళల్లో మనం అగ్రరాజ్యమవుతామంటున్నారే! అందుకే మన స్టాకు బజారు ఉరకలు తీస్తోంది.

భళారే భారతీయం!

4 వ్యాఖ్యలు to “ఇదీ మన భారతీయం!”

 1. vijaya Says:

  పైగా న్యూస్ ఛానల్లలో అదొక గొప్ప విషయం అన్నట్టు, ముంబాఇ నగరానికి బొలెడంత గుండె దైర్యం, ఒకె ఒక్క రొజులో కోలుకుంది, ఇలాంటి కిరాతకాలని మమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పుతున్నరు.నిజంగానె మనం ఏమి చేయలేమా..అది ఒక వార్తలాగ విని వూరుకొవడం తప్ప??

 2. charasala Says:

  గుండె ధైర్యం అంటే నేనొప్పుకోను. ఒక బీదవాడి ఇంట్లో ఎవరైనా చస్తే ఏడుస్తూ కూర్చుంటే కడుపెలా నిండుతుంది? కచ్చితంగా పనికెళ్ళి పతికో పరకో సంపాదించల్సిందే, లేదా కనీసం అడుక్కోవడానికైనా బయలు దేరాల్సిందే! అది గుండె ధైర్యం ఎలా అవుతుందీ? ఇదీ అంతే!

  ఘజనీ 18 సార్లు దండయాత్ర చేసి నగరాల్ని బుగ్గి చేసి, దోచుకుపోతే కిక్కురుమనకుండా 18వసారి దేశాన్ని అప్పజెప్పిన మనది గుండె ధైర్యమా? నిర్లిప్తిత, పిరికితనం, అసంఘటిత్వము అంతే.

  ఇన్ని జాతుల్ని ఏకంగా ఉంచుతున్నదీ, బ్రిటిష్ వాళ్ళని 200 ఏండ్లపైగా ఏలుకోనిచ్చినదీ, నిరాటంకంగా ప్రజాస్వామ్యము మనుగలుగుతున్నదీ, అవినీతి, పక్షపాతము, గూండాయిజమూ నిరబ్యంతరంగా సాగుతున్నదీ అన్నిటికీ మన నిర్లిప్తత, స్వార్థం, సంకుచితత్వం, కర్మ సిద్దాంతం మాత్రమే కారణాలు. ఏ రాజు మనల్ని ఏలినా మనకు పట్టదు, ప్రజాస్వామ్యమైనా, నిరంకుశత్వమైనా మనకు పట్టదు.
  ఒకసారి మీకు తమిళం, తెలుగు, మరాఠి మొదలైన బాషలు వస్తే మద్రాసు నుండి ముంబయి వరకు మూడవ తరగతిలో ప్రయాణం చేసి చూడండి. ముగ్గురు తమిళులు కలిసి తెలుగు వాన్ని తిడతారు, ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే అరవ వాళ్ళని తిడతారు. వాళ్ళూ వీళ్ళూ కలిస్తే అంతా హిందువులైతే ముస్లిములను తిడతారు. ఈ ముస్లిములు లేనప్పుడు వైష్ణవులు, శైవులనీ, శైవులు వైష్ణవులనీ తిట్టుకునే వాళ్ళట. ఒకరికి ఒకరు ఎదురు పడితే పొడుచుకుచచ్చి వైకుంటానికీ, కైలాసానికీ ఏకంగా వెళ్ళేవారట.
  ఇప్పుడైనా మంచి గుమస్తాలుగా, ఎక్కడైనా సరే నోరు మెదపకుండా అణిగి మణిగి పని చేసుకుపోతారనే పేరు (మంచి పేరు) రావటం వల్లే outsoucing కు మనం కేంద్రమయ్యాం. మన వేల ఏళ్ళ చరిత్రలో మనం చేసిన గొప్ప పని అణ్వాయుధపాఠవం, క్షిపిణి పరిజ్ఞానం సాధించడం. (నేను బాజపా మరియు RSS కార్యకర్తను కాదు సుమా!)
  — ప్రసాద్

 3. అనిల్ చిమలమఱ్ఱి Says:

  నా బ్లాగు పై మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు., మీ బ్లాగుని ఇప్పుడే చూసాను….చలా బాగుంది…ముఖ్యముగా “అన్నయ్య కో లెఖ”, “ఇదీ మన భారతీయం”….

  ఈలాగే అన్నీ రకాలుగా ఇంకా వ్రాయాలని కొరుతూ ….

  అనిల్ చిమలమఱ్ఱి

 4. మదన్ మోహన్ Says:

  భారతీయులు భౌతికంగాను, మానసికంగాను పరిస్ధితులరీత్యా నిరోధక శక్తిని పెంచుకున్నారనిపిస్తుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: