Archive for జూన్, 2006

ఎంత ఘోరం! (eMta GOraM)

జూన్ 15, 2006

ఎంత ఘోరం!
ఉన్మాదుల ఉన్మత్తం చూడండి. యముడి యమపాశపు కర్ఖశత్వము చూడండి. ఆవిరవుతోన్న ఆయుష్షు చూడండి. జీవానికి, నిర్జీవానికీ నిలువురేఖ చూడండి. ఇదిగో ఈ యుద్దభూమి చూడండి. చిన భూషయ్య రగిల్చిన అగ్నిగుండమిది చూడండి.
చేతకాని తనంతో గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా అయిన వాళ్ళ కాని వాళ్ళ మాటల్ని పెడచెవిన పెట్టి బుష్ రగిల్చిన మారణహోమం ఇది.

కాలి పోతున్న ఇరాక్!

ప్రాణబయంతో నూరంతుస్తుల మీదనుండి దూకి ప్రానాలొదిన దృశ్యాల కంటే ఈ దృశ్యము ఏ విదంగానూ తక్కువది కాదు. ఒక అమాయక ఇరాకీ ప్రాణం ఒక అమాయక అమెరికన్ ప్రాణం కంటే ఏ విధంగానూ తక్కువది కాదు. ప్రాణానికి ప్రాణం, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ఆవేశాలు ఎప్పటికీ మంచివి కాదు. భయంతో తెచ్చే మార్పు కంటే మంచితో తెచ్చేమార్పే నిదానంగా వచ్చినా స్థిరమైంది.
జరిగిందేదో జరిగిపోయింది బుష్ గుణపాఠం నేర్చుకున్నట్లే ఉంది. కాని అమెరికా నేర్చుకుందా? ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరక్కుండా అమెరికన్లు  విజ్ఞత చూపిస్తారా?
బలంతో పాటే బాద్యతా వస్తుంది. పశుబలం ఉంది కదాని ప్రపంచాన్ని లక్ష్యపెట్టకుండా ముదుకెలితే ఫలితం ఇలాగే ఉంటుంది.
ఎంతమంది అమాయక ప్రాణాలు ఉసూరుమన్నాయి? తల్లిదండ్రులు కోల్పోయిన ఎంతమంది బాలబాలికలు కసితీర్చుకోవడానికి భయంకరవాదులు కాబోతున్నారు? ఎంతమంది కంటికి కునుకు లేక భయం గూటికింద జీవిస్తున్నారు?
ఎప్పుడు దీనికిక ముగింపు? ముగింపంటూ ఉందా?

వృద్దాశ్రమం – oldage home

జూన్ 14, 2006

నాలో ఎప్పట్నుంచో మండుతున్న జ్వాల ఈ రోజు నా తమ్ముడితో సంబాషణలో (chatting) ఇలా బయట పడింది.

నా తమ్ముడికి తెలుగు ఫొంత్ లేక పొవటం వల్ల ఎంగ్లిష్ లోనే మా సంబాషణ నడిచింది.

8:05 AM Dileep: Hi anna how r u?

8:06 AM me: good. how are you?

did anna left?

Dileep: yester day we are on the way thats way not able to lift ur call

yes

me: oh ok

8:07 AM Dileep: today morning he reached kadapa

me: ok

8:08 AM Dileep: how is pradam ,pranathi and vadina

8:09 AM me: all are doing well

Dileep: ok

8:10 AM me: are you joining ITC?

is any date fixed?

8:12 AM Dileep: not yet that HR went to kolkata..

not yet decided

8:13 AM me: ok

8:16 AM Dileep: when ur friend coming..

to us

——————————————–

8 minutes

8:24 AM me: He is already in India

another colleague coming on 26th

——————————————–

6 minutes

8:31 AM Dileep: to US

me: after a month

I will let you know later

Dileep: k

–some private topic —

8:53 AM we got some fund from GOV to constuct a home in village..

do u know that one..

8:54 AM me: how do I know if you don’t tell me?

Dileep: present home fully damaged i mean when rain came thats like out side

me: I am not aware of any progress about that

8:55 AM even I don’t know that there is home now

how did you get funds from Gov?

8:56 AM Dileep: thats In INDIRAMMA pathakam

for poor people..

in that they had sanctioned for us also

8:57 AM Indiramma pathakam for poor people who ever they don’t have shelter

8:58 AM not yet started..

me: I hate that idea

do you think we are poor people?

Dileep: no..

but they have given..

me: why should we get money under INDIRAMMA padhakam?

8:59 AM Dileep: i too don’t know

me: without an application from ourside they given that?

Dileep: yesterday i had called to home so they have told me

me: who applied for that?

howmuch they sanctioned?

9:00 AM Dileep: no need to apply.. they only filedup

all are poltics..

me: we talk about so much corruption in the govt and politicians.. but we ourselves are big corrupt people

Dileep: MLA is faver to our village naa

me: may be in that process they ate some !!

9:01 AM mmm

no one can save it

Dileep: so they had given to every one..

me: MLA manavadu CM mana jilla vadu. anduku adakkapOyinA annam pedatAru

9:02 AM Dileep: yes..

me: when you said they sanctioned money.. I thought differently

you were telling me that ANNA wants to open some charitable society

9:03 AM for old age people

and want to build a home for them at our fields

I thought may be ANNA did that and govt sanctioned some fund to do that

9:04 AM Dileep: mmm they will not give money that type of works

after starting they will help on basiss of performence..

9:05 AM me: I know..thats why I was so surprised and thrilled

Is anna doing putting any efforts in that direction?

Dileep: he has thoughts..

9:06 AM me: for Pradham birthday on July 26th I want to do something useful

Dileep: but not yet trying to implement..

me: do you have any suggestions?

9:07 AM Dileep: ok..

9:08 AM good idea

if u also think abt that old age home and plan for that

9:09 AM thats better.. to start

me: yes.. I have strong ambitions in doing some service to poor people

9:10 AM howmuch govt santioned for our home?

Dileep: last time when i went to village that time i had given money to Ramaiah bharya, and for some others..

me: it needs so much money and continued support on long run

Dileep: yes..

9:11 AM they may saction 40k

i think thats not helping thing for them

me: I feel very sad when I think about people such as Ramaiah barya

40k!!!!

9:12 AM Dileep: at this stage they are not able to prepare food

they are in feeding stage..

me: that is what I feel bad..

there should be some place where they can eat and take some rest at this age

Dileep: but still they are doing hard work … so when do they feel hapy in their life!

9:13 AM me: and how is her home?

is it livable?

Dileep: fully damaged..

no..

in village no one help to them ..

9:14 AM she herself bringing her drinking water from the borewell and cooking herself ..

me: mmm

Dileep: if she prepares food that day ok other wise she should stay with out food..

me: I couldn’t control my tears when I hear this

9:15 AM howmany such people are there in our village now?

Dileep: yes i think every village has such people..

9:16 AM me: as long as we are not aware of such people we don’t know

Dileep: so if we cannot help all… who should help atleast that we know thats better

me: but how can we live peacefully keeping such helpless people infront of our eyes?

9:17 AM Dileep: for them (in village ) it is routine..

thats why I am sending some money for them..

9:18 AM two months back i have send 500 for her..

and last time when i went to village i had given 700 for pedamma and others..

me: good. you are lucky to be among those and be able to help

9:19 AM then we need to do something fast to help such people

Dileep: i will send next month starting also

but thats not making them happy..

9:20 AM when they will get food and rest with out big effort they may feel happy

me: can we have some temporary shelter for them and someone who can cook for them and feed

9:21 AM next time when you go to village can you think seriously about this

ask if someone can come forward to cook everyday for such people

9:22 AM we will pay money as monthly salary for them

Dileep: yes… i think u remember yarrani Obaiah(Gulolla Obaiah) his daughter also now helpless.. her father and mom died

so she also not able to do work..

9:23 AM she can cook and serve..

me: she is young right?

Dileep: no need to pay some people they can’t do cultivation work so they will do these things..

9:24 AM yes.. but she can’t do cultivation work

me: ok. let us start with something then..

talk to her next time you go to village..

Dileep: ok..

9:25 AM me: talk to peddamma and other such people if it is OK for them for such an arrangement

Dileep: we will start on pradam birth day

me: sure

Dileep: but we need a home for that..

9:26 AM i will enquire for that..

also

me: lets start cooking at one place and feed them every day like in hotel..

in any one of their home

Dileep: ok..

me: slowly we can build something

9:27 AM Dileep: some of my friends also ready to help that type of people..

ok..

me: and also I think our old home place was nice to construct something

yes. here also so many people are ready.. but they need to trust us .. thats it

Dileep: brother plan is different..

s

me: what is his plan?

9:29 AM Dileep: he thinking abt their peace of environment also

9:30 AM vurlo kakunda saparetuga antee mana thotalo allaa saparetugaa vuntee vallaku prasanthanga kuda vuntundigada antadu

9:32 AM me: I doubt about it.

Dileep: any way first we will start it with food ..

me: their entire life they spent among people.. and they may like to spend among people only at this age also

Dileep: then step by step we will reach the goal

9:33 AM me: right. let us start with food. then we can take to self-sufficiancy etc..

Dileep: thats also right..

at present no one is there to talk.. in village

almost they are spending solo life only…

me: for us educated one, we know the beauty of nature .. but I doubt that they can enjoy it

9:35 AM and again.. for those who don’t have some thing to eat and for those who doesn’t have energy to cook by themselves..peace is in having little bit to their stomoch

9:36 AM Dileep: s

9:37 AM u know one swami(mukku swami) like that people there…

me: and I will talk to Anna also about this

how is he?

how is he getting his food?

Dileep: now he is ok..

9:38 AM he got leg facture three months back..

that time so bad..

9:39 AM doctors told him don’t take rice.. so only chapathi like that (bc he have sugger) so no one preparing for him..

so he lives like a begger..

9:40 AM many times he come to our home and had that one..

me: right. no one prepares chapati right

9:41 AM I am becoming so emotional..and could not stop weeping….luckily no one is here nearby. I don’t know how can I control it next time I visit the village

Dileep: yes..

9:42 AM very difficult..

me: who is cooking meals for school children?

Dileep: whenever we go to village..

in SC also have like Rammaiah bharya that people

9:43 AM Saraswathi..

Guraiah wife

me: we should not discriminate based on caste

Dileep: s

thats why am telling we should help them..

9:44 AM me: but I doubt these old people can eat along with SC people..

sure

Dileep: thats may be a problem..

we should convey them..

me: let us start doing some thing on our own..even we fail in our efforts..we will learn some lesson

9:45 AM Dileep: s

u don’t tell to dad ..

me: may be it is too much to convey them at this stage.. let them live with their habits and biliefs in their last days..we can serve them seperately

Dileep: he will discourage

9:46 AM me: why

Dileep: talk with brother or with sister

me: whatever he says.. I am strongly determined to do sometxing

Dileep: s

9:47 AM we will start very shortly..

so plan for that..

9:48 AM i will enquire for cooker and all

me: we may need big dishes to cook

9:49 AM before we start we need to know the suggestions from peddamma and other such people

9:50 AM if they refuse to eat like that after all this becomes a waste effort

9:51 AM and it should not become an example for “ఆరంబశూరత్వము” aarambasuratvamu.

9:53 AM Dileep: yes..

9:54 AM definetly 100% they will accept..

bc they are in that stage..

help less sthage..

stage..

9:55 AM me: ok

9:56 AM we should not wait for aspicious day to start a good program. let me know when can you go to village and set everything

so I don’t even want to wait till Pradham’s birthday

lets start as soon as possible

9:57 AM Dileep: ok..

9:58 AM first we will talk with peddamma and some others..

i will go soon

just i got call from ITC

they are asking pay slip..

me: ok

———————

8 minutes

10:14 AM Dileep: just i had talked with brother also

me: oh ok

10:15 AM Dileep: he telling that first u both decide strongly.. before going to start that program

10:17 AM me: my desire is so strong that none can say NO to that

10:18 AM I would like to face all the consequences

Dileep: ok..

10:19 AM what he is telling is ..how much we are busy, how many problems we have whatever may be we should give some time and money for that

10:20 AM to think abt that and to do that

me: yes

10:21 AM that type of work is the real work to do in anyones life

Dileep: he also interested to do that..

last two days we visited some Asramas here..

me: ok

10:22 AM we should not have any direct or indirect profit related thoughts about it

and we should not gain any direct or indirect gain out of that

10:23 AM Dileep: yes..

me: then only it will serve the purpose

10:25 AM Dileep: yes..

we are not in that stage to think profit..

poltical leaders or some others think like that

10:26 AM me: yes. but we should not only think about that but we should appear also like that..

Dileep: yes..

me: without peoples trust we cannot succeed

10:27 AM Dileep: some people they shout even we do sincerly .. so we don’t consider all those things..

we should do our best best level

10:28 AM finally god will see

me: making everything transparent is one way to keep trust on us

Dileep: yes

me: there shouldn’t be any secrecy..

10:29 AM I have registered for a website.. http://www.charasala.com .. may be we can use this to let people know what we are doing

right now there is no content there

10:30 AM see if you can contribute some pages for that

Dileep: ok..

good..

10:32 AM ok annaa

i will go to village soon

before that u too talk with brother..

me: sure

10:33 AM Dileep: bc he also have much interest on that

me: ok. good. we can make it

Dileep: he also know much abt that type of asramas

finally we will deside..

10:34 AM tomorro we i will make a call to village

i will enquire they are ready for this(with peddama)

10:35 AM anna telling that we need not consider only peddamma we can serve who every like that stage..

definetly she also join..

me: exactly..

Dileep: like that

me: but we need to hear their voice also

10:36 AM they may give some more thoughts that we don’t have

Dileep: yes…

me: we need to see the problem from every aspect

——————————————————————————–

7 minutes

10:44 AM me: ok. I will talk to ANNA tomorrow

10:47 AM Dileep: ok..

am leaving..

so what can i do

can i join in that ITC

10:50 AM ok anna.. TC have a nice day

byee

ఇలా సాగింది మా chatting. చూడాలి ఇది ఎంత ముందుకు వెళుతుందో. నాకైతే చాల ఆశ ఉంది బీదవారు, ముసలి వారికి సాయపడలని.

రామయ్య బార్య(పెద్దమ్మ): ఈమె మాకు పెద్దమ్మ వరస. చాలా స్వాభిమానము కలది. మేమెంత పిలిచినా మా యింటికి అన్నము తినటనికి రాదు. తనకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. కూతురు మీద ఒకరోజు పందిరి కట్టె పది చనిపోయింది. కొడుకు తాగుడుకు బానిసై చనిపోయాడు. కూతురి కూతురు (మనవరాలు) వీళ్ళ దగ్గరే పెరిగి పెళ్ళయ్యాక తనదారిన వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు ఇటువైపు రావటం లేదు. బహుశా ఆమె పరిస్తితి కూడా కడు ధీనంగా ఉండిఉండవచ్చు. తన భర్త చనిపోయేనాటికే ఆమెకి అరవై అరవైదు వయసుంటుంది. ఇది జరిగి పదిహేనేళ్ళు అవుతుంటుంది. ఇప్పుడామె స్వయంగా ఏపనీ చేసుకోలేని వయసులో కూడా అన్నీ తనే చేసుకుంటూ భారమైన జీవితాన్ని గడుపుతోంది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వారు కనీసం నలుగురైదుగురు ఉన్నారు మా ఊర్లో.

ముక్కుస్వామి: ఈయన మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఊరొచ్చాడు. అప్పుడు బాగా యవ్వనంలో ఉండేవాడు. బార్యా పిల్లలు ఎవరూ లేరు. తనదేవూరో ఎక్కడినుండీ వచ్చాడో ఎవరికీ చెప్పడు. ఇప్పుడు కూడా చెప్పడు. అతని తెలుగు యాస కూడా చాల భిన్నంగా ఉంటుంది. జీర్ణమైన ఆలయాల ఉద్దరణే తన ఏకైక కార్యంగా భావిస్తాడు. అప్పుడు మా ఊరి చెరువుగట్టున ఉన్న పురాతన శివాలయం కడు దయనీయ స్థితిలో ఉంది. చుట్టూ కంప మొక్కలు పెరిగి, తలుపు చెక్కలకు చెదలు పట్టీ, పార్వతి విగ్రహాపు మొలకు చిన్న నూలుపోగైనా లేకుండా… అలాంటి దేవాలయాన్ని మాలాంటి ప్రాధమిక పాఠశాల పిల్లల్ని వెంటపెట్టుకుని కంపని కొట్టించి, గడ్డి పీకించి, పేడతో అలికించి దాన్ని ఒక దశకు తెచ్చాడు.

ఊరి వారికి కూడా అతని పట్టుదల చూసి శివరాత్రికి హరికథ చెప్పించడము మొదలెట్టారు. అలా మానాన్నా కూడా ఎవర్ని చందాలు అడక్కుండా రెండు ఏళ్ళు హరికథలు చెప్పించి బోజనాలు పెట్టించాడు. మా ఊరి చుట్టుపక్కల ఎహ్క్కడా శివాలయమే లేదు. మెల్లమెల్లగా ప్రజలు తమ కష్టాలను దేవుడికి చెప్పుకొటం అందులో కోరికలు తీరిన వారు గుడిని ఇంకొంత అభివృఇద్ది చేయటం జరిగింది. ( మా నాన్న గుదిలోపలి గదుల్లో నున్నటి రాయి పరిపించాడు. మా చెల్లి గిది బయట బండలు పరిపించింది. సుబ్బారెడ్డి అనేతను రాతి ద్వజస్థంబము పెట్టించాడు. ఇంకొకతను గుడిలో గంటలు ఏర్పాటు చేశాడు. అయితే ఈ చైతన్యానికి మూల పురుషుడు ఈ ముక్కుస్వామే. (ఈయన తన పేరు కూడా మాకు చెప్పక పోవటంతో, మొనదేలిన పొడవైన ముక్కు కారణంగా అందరూ ముక్కుసామి అంటారు.)

యర్రాని ఓబయ్య కూతురు: ఈ పిల్ల నాకంటే చిన్నది. వరసకు మరదలు అవుతుంది. ఒక అక్క ఒక అన్న ఉన్నారు. అన్న చిన్నపట్నుంచీ తిరుగుబోతు. ఏ పట్నంలోనో రిక్షాతొక్కి జీవిస్తున్నాడు. అక్కను చిన్నమండెం దగ్గర ఒక ఊర్లో ఇచ్చారు. ఆమెకు ఐదుగురో ఆరుగురో పిల్లలని విన్నాను. తన ప్రపంచం తనది. ఈమె అంత అందగత్తె కాదు. పెళ్ళిచేసుకున్న మొగుడు అతి స్వల్పకాలంలోనే వదిలేశాడు. ఆ దఃఖముతో సగము బీదతనముతో సగము తల్లిదండ్రులు నలుగైదు ఏళ్ళ క్రితము చనిపోయారు. వాళ్ళమ్మకి నేనంటే ఎంతో ప్రేమ. నేను ఊరికి వెళ్ళానని తెలిస్తే తప్పక నన్ను చూట్టానికి వచ్చేది. తల్లిదండ్రులు లేక, అక్క, అన్నలు ఉన్నా పట్టించుకోక (లేదా వాళ్ళ దరిద్రం అడ్డం వచ్చి) దిక్కులేనిదైంది. లోకజ్ఞానం లేని అమాయకురాలు.

నేనెందుకు మాంసాహారము మానేశాను?

జూన్ 7, 2006

నేను మాంసాహారము మానేసినప్పటినుండి ప్రతిఒక్కరూ ఎందుకు మానేశానో చెప్పమంటున్నారు. అది చెప్పేముందు రెండు వాదాల్ని మీకు వివరించాలి.

అ) ఆ మద్య సుప్రీంకోర్టుకు ఒక కేసు వచ్చింది. అందులో ఒక యువకుడు మూడేళ్ళ పసిపాపని లైంగికాపచారము (అత్యాచారము కాదు) చేసాడు. ఆ యువకుడి తరపు న్యాయవాది వాదిస్తూ, "మూడేళ్ళ పాపకి మానావమానాలు తెలియవు గనుక, తన కక్షిదారుడు ఆ పాపని అత్యాచారము చేయలేదు గనుక" పాపని అవమానపరిచాడు అన్న కేసుకి విలువ లేదు అన్నాడు. అందువల్ల కేసు కొట్టివేయమని అభ్యర్థించాడు.

అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించక "పాపకు మానావమానాలు తెలియనంతమాత్రాన చేసిన తప్పు మాయమైపోదు" అంటూ అతడికి మామూలుగానే శిక్ష విధించింది.

ఆ)నేను ఇంతకు ముందు మాంసము తింటున్నప్పుడు దానికి నా సమర్థన ఇలా ఉండేది. బలవంతుడిదే రాజ్యము అన్న సూత్రాన్నిబట్టి, బలవంతుడైన మనిషికి బలహీనమైన ఇతర జీవాలు ఆహారమవడం ప్రకృతియొక్క నియమం. ఈ సృష్టిలో ఆహారచక్రంలో ఎవరి కార్యము వాళ్ళు చేస్తేనే, అంటే జింక గడ్డి మేయాలి, పులి జింకను తినాలి, పులి చచ్చి, కుళ్ళి గడ్డికి ఎరువుగా ఆహారం కావాలి. ఇందులో ఎవరు వాళ్ళ పని చేయకపోయినా ప్రకృతి పని భారమవుతుంది.

అయితే నా ఈ వాదానికి గట్టి ఎదురు దెబ్బ, నేను రెండో ప్రపంచయుద్ద సమయములో హిట్లర్ యూదుల్ని పెట్టిన హింసలు గూర్చి చదివినప్పుడు తగిలింది.

నేను మాసము తినడానికి ఏ వాదాన్నైతే సమర్థించానో హిట్లర్ కూడా యూదుల్ని నిర్మూలించడానికి అదే వాదాన్ని సమర్థించాడు. వ్యాధులతో పుట్టిన పిల్లలనీ, వృద్దులనీ, వికలాంగులనీ దయలేకుండా చంపడానికి ఈ వాదాన్నే నమ్మాడు. బలమైన వాడికే బతికే హక్కు ఉంది అన్నాడు. బలహీనమైన వాళ్ళకు, తక్కువ జాతి అనుకున్న వాళ్ళకు సంతానము కలగకుండా శస్త్రచికిత్సలు చేయించాడు. అప్పుడున్న విషప్రచారము వల్ల యూదులు తక్కువ జాతి వారిగా నిర్దారించి వారు బతికియుండడం వల్ల శ్రేష్టమైన జర్మను జాతికి కష్టాలు తప్పవని వారి నిర్మూలనకు పూనుకున్నాడు. ఇది bird flu (పక్షి జ్వరం) కు భయపడి కోళ్ళను నిర్మూలించ పూనుకున్నవిధంగా.

మనము ఆవు (కాకపోతే గొర్రె లేదా కోడి) పాలు పితుక్కొని, ఆవు పేడను ఎరువుగా ఉపయోగించుకొని, దాన్ని చంపి మంసాన్ని తిని, దాని చర్మాన్ని చెప్పులుగా, బెల్టులుగా తయారు చేసుకుని మనల్ని మనం ఎంతో నాగరీకులంగా బావిస్తుంటాము.

హిట్లర్ అకృత్యాలు కూడా ఇదే తరహాలో ఉన్నవి. యూదుల్ని చెరపట్టి, అందులో పనిచేయగల వారితో చచ్చేవరకు పని చేయించుకుని (మనం ఎద్దులతో చేయించుకున్నట్లు) ఆ తర్వాత లేదా ముందే వారి దగ్గరున్న వస్తువులు, సంపదా అంతా కాజేసి, ఆ తర్వాత విషమిచ్చి(లేదా తుపాకి గుళ్ళతో) చంపి, శవానికి తలగొరిగి, అందమైన పచ్చలున్న శరీరభాగాల చర్మాన్ని ఒలుచుకొని, పళ్ళలో ఉన్న బంగారము తోడుకొని ఆ శవాన్ని కొలిమిలో తగలబెట్టేవారు.

తలవెంట్రుకలతో ఎవో గొంగళ్ళు చేసేవారట. పచ్చలున్న శరీరభాగాల చర్మాలతో పడక గది దీపాలకు shades (అందమైన తొడుగులు) చేయించుకునేవాళ్ళట.

ఇందులో జంతువులతో మనము కూడా ఇవన్నీ చేస్తున్నాము కానీ హిట్లర్ ను మాత్రమే దుర్మార్గుడు అంటున్నాము. హిట్లరే కొద్ది నయము, అతని మూక యూదుల్ని చంపింతర్వాత శవాల్ని కాల్చారేగాని ఆ మంసాన్ని తిన్న ఋజువు లేదు. కాని మనం జంతువులతో అవన్నీ చేసి, అపైన ఆ మాంసాన్ని కూడా తింటాము. ఆహా! ఎంత నాగరీకులం.

హిట్లర్ చేసింది తప్పని మనమంతా ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము చేస్తున్నదీ తప్పే. ఇక మనకొచ్చే ధర్మసందేహము .. మనుష్యులకు బాధ, సుఖం తెలుసు, జంతువులకు అలాంటి గుణము లేదు అని.

ఇప్పుడు మీరు యువకుదు మూడేళ్ళ పాపకి చేసిన అవమానానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ చదవండి. చేసింది తప్పా కాదా అనేది చేస్తున్నవాడి జ్ఞానము మీద ఆదారపడి ఉందే కాని, జంతువుకు అది తెలుసా లేదా అనేదాని మీద ఆదారిపడిలేదు.

కాబట్టి ప్రకృతికి దయాధర్మాలు లేవు. దానికి తెలిసిందిల్లా క్రియా ఫలితాలు మాత్రమే. ఈ పనికి ఈ ఫలితము ఉంది, అంతే తెలుసు. ఐతే మనిషి కొక్కడికే ధర్మధర్మ విచక్షన తెలుసు గనక, ఆలోచించే శక్తి ఉంది గనుకా, అన్ని జీవులలోకి శక్తి సంపన్నుడైనాదు గనుకా, ఇతర బలహీనులైన జీవుల రక్షణ మనిషి చేతిలోనే ఉంది. ప్రజాస్వామిక ప్రభుత్వము బలహీనుల్ని, బలవంతులనుండి ఎలా కాపాడుతుందో అలాగే బలహీనమైన జీవుల రక్షణ మనిషి భాద్యత.

రక్షించక పోతేమానె జిహ్వచాపల్యముకోసము (ఆకలికోసమైతే తినడానికి చాలా ఉన్నాయి) జంతువుల్ని, జంతువుల్లాగా చంపి వాటి శవాల్ని తినటము మహా నీచము.

మీలో కొందరు వృక్షాలకి కూడా జీవము ఉంది వాటికీ బాధ, సంతోషము తెలుసు, వాటిని తినడం కూడా నీచమే కదా అనవచ్చు.
మీరు చెప్పేది నిజమైయుండవచ్చు. మనుషుల్ని చంపిన హిట్లర్ ఎక్కువ పాపి, జంతువుల్ని చంపే మీరు తక్కువ పాపులు ఐతే మొక్కల్ని చంపి తినే నేను మీకంటే తక్కువ పాపిని. మానవ మేధస్సు ఆ స్థాయికి ఎదిగి మొక్కల్ని కూడ చంపకుండా జీవించడం ఎలాగో తెలుసుకుంటే ఆ రోజు నేను మొక్కల్ని తినడం కూడా మానుకుంటాను.

మీరేమంటారు?

–ఫ్రసాద్

తమ్ముడికి తోక!

జూన్ 7, 2006

మొన్నామధ్య మా మూడేళ్ళ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి "నాన్నా నాన్నా తమ్ముడికి తోక ఉంది" అంది. నా మందబుద్దికి అదేంటో త్వరగా అర్థం కాలేదు. "తమ్ముడికి తోకేంటమ్మా, పద చూపెట్టు" అన్నాను.
మా ఆవిడ మా తొమ్మిది నెలల పిల్లాడికి డయాపరు మారుస్తూ ఉంది.
"అదిగో నాన్నా తోక" అంటు వాడి మొలవైపు చూపించింది.
ఇక నవ్వడం మావంతైంది.

వ్యధ

జూన్ 7, 2006

కడుపుకింత లేక అల్లాడుతున్నవారి మధ్య నేనెలా ఆకలి తీర్చుకోను?
రహదారి పక్కన కాసింత చోటు చూసుకొని, చిరిగిన బొంతలో చిక్కిన శరీరాన్ని దాచుకొని, చలికోరల్లో చస్తున్న వారి మధ్య నేనెలా సుఖంగా నిద్రింతును?
రైతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులు
నక్సలైట్ల కిరాతకాలు, పోలీసుల ఆగడాలు
ఉన్మాదుల రక్తపు క్రీడలు, పసివాళ్ళ ఆర్తనాదాలు
ఇన్ని అకృత్యాల మధ్య
నాకేమీ తెలీనట్లు, నాకేమీ వినబడనట్లు, కనబడనట్లు
మూగ, చెవిటి, గుడ్డి వాడిలా ఎన్నాళ్ళని నివసించను?

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?

జూన్ 7, 2006

నా అభిప్రాయం ప్రకారం దేవుడు అందరిపట్లా ఒకేలా ప్రవర్తిస్తాడు.

అన్నమయ్య కీర్తన ఈ సందర్బంగా గుర్తుకు వస్తోంది. మహారాజుకైనా, కటిక బీదవాడికైనా నిద్ర ఒకటే. ఐశ్వర్యవంతునకైనా, అడుక్కుతినువానికైనా ఆకలి ఒక్కటె. ఇంకా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.

సూర్యుడి ఎండ దుర్మార్గుడి మీద మరియు సన్మార్గుడి మీద ఒకేలా ప్రసరిస్తుంది. అంతెందుకు పంచభూతాలన్ని సర్వ జీవులకు ఒకేల అనందాన్ని ఇస్తాయి. కాకపోతే మానవుడు తన విచ్చలివిడితనంతో పంచభూతాల్ని చెరబడుతున్నాడు.

ఒక కత్తి దుర్మార్గున్ని ఎలా బాదిస్తుందో సన్మార్గున్నీ అలాగే బాదిస్తుంది.

పురాణాల్లో జరిగినట్లు పుణ్యాత్ములకు పరమాత్మ కనిపించి కష్టాల్లోంచి బయట పడవేయటం జరగదు. ఎంతటి పతివ్రత ఐనా, ఎన్ని వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినదైనా అగ్నిలో దూకితే మాత్రం తప్పక చస్తుంది. అందులో ఏమాత్రం మినహాయింపు లేదు.

దీన్ని బట్టి నాకేం అర్థం అయిందంటే అత్యధికులు అనుకుంటున్నట్లు దేవుడు అనే ఒక అతీద్రియ శక్తి లేదు. ఉన్నదల్లా ప్రకృతి ధర్మమే.

అంటే ప్రకృతికి లేదా ఈ సృష్టికి ప్రతి క్రియకు దానికి సంబందించిన ఫలితాన్ని ఇవ్వడమే తెలుసు. అందులో ధర్మ విచక్షణ చేయడం తెలియదు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోగల శక్తి ఈ ప్రకృతికి లేదు. అందుకు నాకు తోచే బలమైన ఇంకొక ఉదాహరణ .. బలాత్కారానికి గురైన స్తీ కూడా గర్భవతి కావడం. ఈ ప్రకృతికి ధర్మం తెలిసిఉంటే, అలాంటి స్తీకి గర్బం రాకూడదు.

ఐతే అదే ప్రకృతి ధర్మాలవల్ల సృష్టింపబడిన మనిషికి మాత్రం ఈ ధర్మాధర్మ విచక్షణ తెలుసు. కావున ధర్మాన్ని కాపడవలసింది మనిషే కాని ఇంకెవరూ కాదు.

గీతలో కృష్నుడు కూడ ఇదే చెప్పాడని నాకనిపిస్తుంది. ధర్మం పాండవుల పక్షాన ఉన్నపుడు కృష్నుడే వారి తరపున యుద్దం చేసి అధర్మపక్షీయులను సంహరించి ఉండవచ్చుకద? అలా చేయడు. అర్జునున్ని యుద్దం చేయమని ప్రేరేపిస్తాడు. అంటే దేవుడు చేయడు, మనిషే చేయాలి.

కాకపోతే ప్రతిక్రియకూ పలితం నిర్దారించబడినట్లే మనిషీ చేసే ప్రతి కార్యానికి పలితం ఉండిఉంటుంది.

ఈ సృష్టి, ఈ విశ్వం అంతా కూడ మార్చవీలులేని ప్రకృతి ధర్మాలమీద ఆధారపడి నడుస్తున్నది. ఈ మార్చవీలులేని, ఎన్నటికీ మార్పు చెందని ధర్మాలనే "సత్యము" అనవచ్చు. ఆస్తికులు ఈ సత్యాన్నే "భగవంతుడు", "పరమాత్మ" అంటూ ఉండవచ్చు. అయితే నాకు వచ్చిన చిక్కల్లా ఈ భగంతుడు గుణసహితుడు అనడంలోనే. నేను నమ్మే ఈసత్యం నిర్గుణం. ధర్మాధర్మం, న్యాయాన్యాము తెలియదు. పున్యాత్ముడికోసం ఈ సత్యము మారదు. దుర్మార్గుడి కోసమూ ఈ సత్యము మారదు.

దేవుదైనా సరే ప్రకృతివిరుద్దంగా చేతిలో బంగారు సృష్టించలేడు. రాత్రిపూట సూర్యున్ని చూపించలేడు.

మనిషికున్న బుద్దిబలంచేత ఈ సత్యాన్ని అనగా మార్చ వీలులేని ధర్మాల్ని ఎంతగా తెలుసుకుంతే అంతగా అభివృద్ది సాధిస్తాడు. (న్యూటన్ సూత్రాలు, ఐన్‌స్టీన్ సిద్దాంతాలు ఈ సత్యాలే)

నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:

జూన్ 7, 2006

చట్టి : మట్టీతో చేసిన చిన్న పాత్ర. కూరలు చేయడానికి ఉపయోగిస్తారు.మూకుడు: చట్టీ లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర.

ఉట్టి: (బహుశా కృష్నాష్టమి పుణ్యమా అని ఇది మాత్రం గుర్తుండవచ్చు) తాళ్ళతో తయారుచేసిన వలలాంటి వస్తువు. దీన్ని ఇంటిలో పైన కర్రలకు వేలాడదీస్తారు. పిల్లులనుండీ, చీమల నుండీ, చిన్న పిల్లల నుండీ వంటలను కాపాడడనికి ఉపయోగిస్తారు. గోపికలు వెన్నని కృష్నుడికి అందకుండా వీటిమీద దాచేవారు. వాడుకలోని సామెత: ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కునా?

పొంత: పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వంట అయేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.

ముంత: మట్టితో చేయబడిన చిన్న పాత్ర, నీళ్ళు, మజ్జిగ, కల్లు లాంటి ద్రవాలు త్రాగడానికి ఉపయోగించేది.

తలుగు: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి వాడే తాడు.

చూరు: కర్రలతో కప్పబడిన ఇంటికి గోడ దాటి బయటకు వచ్చిన కప్పుభాగము. వాడుక సామెత: కాళ్ళు పట్టి లాగితే చూరు పట్టుకు వేలాడినట్లు.

వాసము: ఇంటి పైకప్పుకు వాడే పొడవాటి బలమైన కర్ర.

దూలము: ఇంటి రెండు గోడలను కలుపుతూ పైకప్పుకు ఆధారమైన పెద్ద బలమైన కర్ర.

నిట్రాయి: చుట్టిల్లుకు ఇంటి మద్యలో నాటబడి పైకప్పును మోసే పెద్ద దూలము.

చుట్టిల్లు: వృత్తాకారములో కట్టబడిన ఇల్లు.

నులక: కర్ర మంచాన్ని అల్లడానికి ఉపయోగించే సన్నటి తాడు.

నులక మంచము: నులకతో అల్లబడిన మంచము.

మంచంకోళ్ళు: మంచము యొక్క నాలుగు కాళ్ళు.

జాలాడు: స్నానం చేసే దొడ్డి.

పంచ: ఇంటి ద్వారము బయట ఇరువైపులా ఉన్న ప్రదేశము. సాధారణంగా ఈ ప్రదేశములో అరుగులు ఉంటాయి.

చటాకు: పావులో సగము. 0.125

బాన: పెద్ద కుండ.

దొంతి: కుండ మీద కుండ పెట్టి ఏర్పరిచిన కుండల వరస. కింద పెద్ద కుండ దానిమీద కొంచము చిన్నకుండ అలా పెట్టుకుంటూ పోతారు.

గుంజ: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.

ఎనుము: రాయలసీమలో గేదెను ఎనుము అంటారు.

పడ్డ: ఇంకా ఈనని వయసులో ఉన్న పడచు గేదె.

పరాందం కాయ: బొప్పాయి పండు.

కపిల: ఎద్దులు, బొక్కెన సహయముతో వ్యవసాయానికి బావి లోంచి నీళ్ళను తోడే పద్దతి.

బొక్కెన: ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచి.

మోకు: బొక్కెన లాగడానికి ఉపయోగించే పొడవైన, లావైన తాడు.

కాడి: రెండు ఎద్దుల మెడ మీద ఉంచే కర్ర. దీనికి ఎద్దుల మెడకు కట్టాడనికి కావలిసిన పట్టెడలు ఉంటాయి.

పట్టెడ: తాళ్ళతో తయరి చేసిన బెత్తెడు వెడల్పు, మూరడు పొడవుండి కాడికి ఎద్దులను కట్టివేడానికి ఉపయోగించేది.

కుప్పె: ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)

గాడి: ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.

కుడితి: గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.

చిక్కము: ఎద్దులు పంటను తినకుండా మూతులకు కట్టే, తీగలతో చేసిన వస్తువు.

— ఇంక గుర్తు రావటం లేదు. ఈ పదాలు కడప జిల్లా, రామాపురం మరియు లక్కిరెడ్డి పల్లె ప్రాంతాలలో వాడె పదాలు. మీకు తెలిసినవి కూడ ఇందులో చేర్చండి. వీలైనప్పుడల్ల విటిని వాడండి. లేకపొతే కొన్నాళ్ళకు చాలా పదాలు మనకు కనపడకుండ పొయే ప్రమాదం ఉంది.

— ప్రసాద్