కడప అనగానే ఇప్పుడు అందరికీ గుర్తు వచ్చేది బాంబులు, కాఠిన్యం, కరకుదనం. మా భీమవరం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సుపాలు జనార్ధన రెడ్డి ఒక సమావేశంలో నన్ను ఉద్దేశించి “కడప వాడు కదా! ఆ మాత్రం ఆవేశం సహజం” అన్నాడు. దానికి నేను మళ్ళీ లేచి, పెద్ద ప్రసంగమే చేశాను. బాంబుల కడప వాడిగా నాకు పేరొద్దు. అలా అనిపించుకోవడానికి నేను సిగ్గు పడతాను అంటూ, వేమన, అన్నమయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పోతన వంటి కడప మహానుభావుల గురించి ఓ అరగంట ఉపన్యాసం ఇచ్చాను.
కానీ కడప జిల్లా ప్రజల్లో కూడా కరుణ ఉంది అనడానికి ఈ ఈనాడు వార్త చూడండి.
ఆత్మీయుడికి గాయమైతే ఊరే కదిలింది
పులివెందుల, జూన్ 29(న్యూస్ తుడే):ఐస్ అంటూ చంటి పిల్లలకు ప్రేమగా పుల్ల ఐసులు విక్రయిస్తూ దగ్గరైన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆపన్నహస్తమందించేందుకు ఆ గ్రామమంతా ఏకమై కదిలింది. మా పిల్లలకు ఆత్మీయుడవైన నీకు గాయమైతే మేము లేమా అంటూ గ్రామస్తులు తలో చేయి వేసి అతన్ని ఆదుకొన్నారు. మంచాన పడి వైద్యంకోసం ఎదురుచూస్తున్న తనకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు ఊరంతా కదిలిరావటంతో ఆ భాదితిడిలో ఆత్మస్థైర్యం పెరిగింది. కళ్ళలో ఆనందభాష్పాలు వెలిగాయి.
పూర్తిగా ఇక్కడ చదవండి. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=cuddapah#8
ఇంకో విశయం, కడప కు ఆ పేరు గడప పదం నుండీ వచ్చిందని? కడప అసలు పేరు “దేవుని గడప”. అయితే కాలక్రమాన వేంకటేశ్వరుని గుడి ప్రాంతాన్ని మాత్రమే “దేవుని కడప” అంటున్నారు. ఇది తిరుమల వేంకటేశ్వరునికి గడప అట. ఇప్పటికీ తిరుమల వెళ్ళే చాలామంది ఇక్కడి వేంకటేశ్వరున్ని దర్షించాకే తిరుమలకు వెళతారు. ఆంగ్లేయులు దీన్ని CUDDAPAH గా మార్చేశారు. ఈ మద్యనే మళ్ళీ official గా ఇంగ్లీష్ spelling ను KADAPA గా మార్చారు.
ఈ విషయం తెలుగు వికి లో తాజాకరిస్తే (update) బాగుండు.
— ప్రసాద్
2:35 ఉద. వద్ద జూలై 10, 2006
మంచి పోస్టు.. కాఠిన్యం కాదుగానీ కడప వాళ్ళ మాటల్లో కరకుదనం, పదును ఉంటాయి. కడప గురించి నేనొక పేజీ తయారు చేశాను. చూడండి: http://www.freewebs.com/trivikramg/
నా బ్లాగులో ఈ పోస్టులు చూశారా?
http://avee-ivee.blogspot.com/2006/05/1.html
http://avee-ivee.blogspot.com/2006/04/blog-post_11.html