ఈనాటి సినిమా గురించి 'ఏమున్నది గర్వకారణం' అన్నట్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ దర్షకులూ, నిర్మాతలూ, నాయకులు, నాయకీలు అంతా ఒకే ధ్యేయంతో ఒక తపస్సులా ప్రేమ గురించి (యవ్వన ప్రేమ మాత్రమే) పరిశోధిస్తున్నారా అనిపిస్తుంది. ఎన్ని పేర్లు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు?? కనీసం పాత సినిమాలు ప్రేమాంశమైనవే అయినా, అందులో హీరో పేదవాడయి, నాయకి ధనవంతురాలి కూతురై అలా పల్లెలొ మొదలై పట్నంతో ముగుస్తుంది.
కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు చుస్తే, అసలు పల్లెటూళ్ళే లేనట్లు, పేదరికమే లేనట్లు, ఏ కష్టమూ లేక ప్రియురాలి ప్రేమ పొందడమే జన్మ సాఫల్యమన్నట్లూ, కార్లలో షికారులూ, ఖరీదైన పార్టీలూ, విదేశాల్లో షికారులూ …..
మనిషికీ మనిషికీ మద్య ఈ సినిమా ప్రేమ బందం తప్ప ఇంకే అనురాగమూ లేదా? ఇంకే బందాన్నీ సినిమాగా తీయలేమా? సినిమాని ఇంత కృత్రిమంగా కాకుండా ఇకొంచం సహజానికి దగ్గరగా తీస్తే ఎంత బాగుండును!!!!
— ప్రసాద్
7:58 సా. వద్ద జూన్ 23, 2006
Hi Prasad garu,
Your blogs are very informative and unique too.But akkadakkada unna “mudrarakshasaalu” panti kinda rayilaa guchchukontunnayi.I am using the pothana font by Dr.Desikachari…the link is here…
http://www.kavya-nandanam.com/dload.htm
Warm regards,
Ismail Penukonda
12:29 సా. వద్ద జూన్ 26, 2006
ఇస్మాయిల్ గారూ,
ప్రయత్నిస్తూనే ఉన్నానండీ, కానీ చేతి వేళ్ళకీ shift కీ కి మద్య ఎక్కడో ఇంకా జారిపోతూనే ఉన్నాయి తప్పులు. మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిచేసేంత ఓపిక రావటం లేదు, ఇక మీద వ్రాసే వాటిని ఒకటికి రెండు మార్లు చదివి మరీ సరిచేస్తానని హామీ ఇస్తున్నాను.
ఈ వీవెన్ గానీ మరొకరు గానీ (నేనంత పని చేయలేనేమొ!) తెలుగు spell checker తయారు చేస్తే ఎంత బాగుండును.
— ప్రసాద్
8:43 ఉద. వద్ద ఆగస్ట్ 9, 2006
“మనిషికీ మనిషికీ మద్య ఈ సినిమా ప్రేమ బందం తప్ప ఇంకే అనురాగమూ లేదా? ఇంకే బందాన్నీ సినిమాగా తీయలేమా? సినిమాని ఇంత కృత్రిమంగా కాకుండా ఇకొంచం సహజానికి దగ్గరగా తీస్తే ఎంత బాగుండును!!!!”
చాలా బంధాలున్నాయి. తీయనూ వచ్చు. కానీ చూసేవాళ్లే … కరువౌతారు. ‘గ్రహణం’ లాంటి సినిమాల గతేమిటో తెలుసు కదా!