రిజర్వేషాలు

రిజర్వేషాలునాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పండి.) అదేనండి అంత సున్నితమైన అంశము రిజర్వేషన్లు. చదువరి బ్లాగు చూశాక ఇక తప్పదనిపిస్తోంది.రిజర్వేషన్లు కావాలి, ఉండాలి. అయితే అవి కులాధారంగా ఉండకూడదు. ఇదీ నా స్థూలాభిప్రాయము.

ప్రతిభ

ప్రతిభ కే పట్టం కట్టాలి అందులో అందులో ఎవరికీ లేశమాత్రసందేహముండక్కర్లేదు. అయితే సమ ఉజ్జీల మద్యనే పోటీ ఉండాలి. ఉన్నవారి పిల్లలకి, లేని వారి పిల్లలకి మద్య పోటీ పెట్టి, అందులో అర్హత సాధించిన వాడికే అందలమిస్తామంటే ఎలా? AC రూములో చదివేవాడికీ వీధి దీపం కింద చదువుకునే వాడికీ పోటీ ఎలా సాద్యం. వేలు, లక్షలూ పెట్టి పేరున్న కాలేజీల్లో చదువు కొనే వారికీ, పిల్లల్నీ కూడా పనిలో పెడితే కాని ముద్ద నోట్లోకి రాని వారికీ ఒకే పోటి పెడితే ఎలా? నిజమే మీరన్న విధంగా అటువంటి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఉన్నవారితో సమానంగా విద్యావకాశాలు కల్పించి … ఇది సాద్యమా? ఎంత వెసులు బాటు కల్పిస్తే మాత్రం లేనివాడి పిల్ల వాడు, ఉన్నవాడి సౌకర్యాలు పొందగలుగుతాడు. నిజంగానే మనం అలాంటి అర్థిక వెసులుబాటు కల్పించగలిగితే ఇంక బీదలనే వారే ఉండరు. కడుపునిండా తినలేని వాడికి డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కోమంటే పుస్తకమా అన్నమా ఏది వాడికి రుచిస్తుంది? కడుపులో ఆకలి దంచేవాడికి, నిత్యమూ జీవనపోరాటం చేసేవాడికి చదువుకోలేని విషయం సమస్యే కాదు. వాడి ఆకలి తీర్చి, వాడి తల్లిదండ్రుల ఆకలి తీర్చి ఇంట్లో కరెంటు దీపం పెట్టి, చదువుకోవటానికి డబ్బులిస్తే ఎందుకు చదవడూ? అప్పుడు మనం ఖచ్చితంగ ప్రతిభకు పట్టం కట్టవచ్చు.

ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు వుండాల్సిందే.

ఎంత మంచి హాస్టళ్ళు ఉన్నా తల్లి ఒడిబడిలో నేర్చున్నంత సౌకర్యం హాస్టల్లో ఉంటుందా?

కారులో, లేదా కనీసం స్కూటర్లో వచ్చి స్కూల్లో చదివే వాడి కెక్కినట్లు నడుచుకుంటూనో లేకా సైకిల్లో చెమటలు కక్కుకుంటూ స్కూలుకు వచ్చి చదివే వాడికి చదువు ఎక్కుతుందా?

మరి సామజిక అసమానతలు ఉన్నంత వరకూ సమాన పోటీ ఎలా సాద్యం?

సామర్థ్యము

చాలామంది వికటంగా రిజర్వేషనుతో దాక్టరైతే వాడివాల్ల జరిగే అనర్థాల గురించి చెపుతారు. సరే, మరి అనర్హుడైనా డబ్బు పోసి పక్క రాష్త్రానికో, పక్క దేశానికో వెల్లి దాక్టరు చదువు కొన్న వారి సామర్థ్యము సంగతేంటి? రిజర్వేషన్లున్నా ప్రతిభ చూసే కదా అర్హుడయ్యేది. ఏ కులానికి ఆ కులంలో ప్రతిభ చూసే కద ఎన్నుకునేది?

ప్రతిభ అన్ని వర్గాల్లోనూ ఉంటుంది. కాకపోతే సౌకర్యాల లేమి వల్ల మార్కులు తగ్గితే అలంటి వారికి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది?

కులం

కులాన్ని బట్టి రిజర్వేషన్లు తప్పే. కాని రాజ్యంగ నిర్మాణ సమయంలో ఉన్న సమాజిక పరిస్థిని బట్టి చూస్తే అది న్యాయమే. నిమ్నకులాలలో అప్పుడు ఉన్నవారు అరుదు. ఒకవేళ ఉన్నా అటువాంటివారు కూడ రాజ్యంగ రక్షణ లేనిదే ఏ పదవీ సాధించలేని దుర్గతి. సాధించినా పని చేయడానికి ప్రతి చోటా అగ్రకులాల వారి అవమానాలు పని చేయనివ్వవు. అదీగాక కొన్ని ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లు ఉండకూడదనేది వారి ఆలోచన. ఇప్పుడు పరిస్థుల్లో చాలా మార్పులు వచ్చాయి, కనీసం పట్టణాల్లో అయినా కులాన్ని బట్టి అవమానించడం (నాకు తెలిసి) లేదు. బహుశా ఇది సరైన సమయం కులాల ఆధారిత రిజర్వేషన్లు కాకుండా ఆర్థికాధారిత రిజర్వేషన్లు అమలు చేయడం.

రాజకీయం

నిమ్నకులాల్ని, వెనుక బడ్డ కులాల్ని ఉద్దరించడం ఇప్పటి ఏ రాజకీయనాయకుడి అభిమతమూ కాదు. తద్వారా వారి ఓట్లకు గాలం వేయదమే వారి పని.

ప్రతి ఒక్కడు ఆ పేరుతో స్వలాభం చూసుకునేవాడే.

సంస్కరణ

ప్రస్తుత రిజర్వేషన్ల విధానం అంతగా ఫలాల్ని అందిచడం లేదు. వీటిని తప్పక సంస్కరించాలి. ఆ మద్య ఒకాయన పాయింట్ల పద్దతిని సూచించాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ పద్దతి ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డందుకు కొన్ని points, నిమ్న కులం అయినందుకు కొన్ని points, స్త్రీ అయినందుకు కొన్ని points, వచ్చిన మార్కులని బట్టి కొన్ని ఇలా మార్కులు ఇస్తారు.

అయితే ఇందులో ఏ ప్రయోగం చేయాలన్నా చాలా సాహసం కావాలి.

చివరి మాట

కులాన్ని బట్టి రిజర్వేషన్లకు నేను వ్యతిరేకినే అయినా ద్వేషిని కాదు. ఎందుకంటే కులాన్ని బట్టి రిజర్వేషను మన సమాజంలో మనువునుండీ వస్తున్న పద్దతి. ఇప్పటికీ దాన్ని సమర్థించేవాళ్ళెందరో ఉన్నారు.

క్షత్రియ వంశములో పుట్టినవాడే రాజు కావాలి.

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే పురోహితుడు కావాలి.

వైశ్యుడే వ్యాపారం చేయాలి.

కుమ్మరే కుండలు చేయాలి.

కమ్మరే కమ్మలి పని చేయాలి.

చాకలే గుడ్డలు ఉతకాలి.

మాదిగే చెప్పులు కుట్టాలి.

ఇలాంటివి ఎన్నో అనాదినుండీ కుల రిజర్వేష్న్లుండగా ఇప్పుడు మాత్రమే వాటికి విరుద్దంగా ఇన్ని ఆవేశాలు, ప్రదర్సనలు ఎందుకు?

ఇంతకు ముందెప్పుడైనా మనం కుల రిజర్వేషన్లు ఒద్దని పోరాటం చేశామా? తెలివిలేని దద్దమ్మైనా రాజుకు మొదటి కొడుకైనందుకు రాజ్యాన్ని కట్టబెట్టి అదీ సంప్రదాయమని ఊరుకోలేదా?

తరతరాలుగా నిమ్నకులమని, అంటరానివాడని ప్రతిభ వున్నవాన్ని కుడా వెలివేసి ఊరికి దూరంగా జంతువుకంటే హీనంగా చూసిన పాపానికి ఈనాడు ఇలా ప్రయశ్చిత్తం చేసుకుంటున్నామని అనుకుంటే కొంతైనా ఆత్మతృప్తి లభించదా?

రిజర్వెషన్లు వద్దని గర్జించే మీలో ఎంతమంది ఈరోజు కూడా పల్లెల్లో దళితుడి ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగగాలరు? దలితున్ని మీ ఇంటి లోగలికి అహ్వానించి అన్నం పెట్టగలరు? ఈ రిజర్వేషన్ల మూలంగా సర్పంచులూ, MLA లూ, MP లూ అయిన ఎంతమంది అగ్రకులపు అదిపత్యాన్ని కాదని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు?

నా దేశం చంద్రుడి మీద మనిషిని నిలపక పోయినా ఫర్వాలేదు, దళితున్ని సమాన గౌరవంతో అగ్రకులపోని సరసన నిలిపితే చాలు.

అణుపాటవమున్న దేశంగా నా దేశానికి గౌరవం లేకపోయినా ఫర్వాలేదు, అబలపై నిమిశానికో అత్యాచారం లేకుంటే చాలు.

ఖజానా నిండ విదేశీమారకద్రవ్యము లేకున్నా ఫరవాలేదు, ఆకలితో చావని ఒక రోజున్నా చాలు.

— ప్రసాద్

ప్రకటనలు

7 వ్యాఖ్యలు to “రిజర్వేషాలు”

  1. వీవెన్ Says:

    nAn&cAnu = నాన్చాను (& forces combination)

  2. చదువరి Says:

    naan&caali – ఇలా నాన్చాలి

  3. చదువరి Says:

    చదువుకోగలగడం, లేకపోవడం అనేవి ఆర్థికపరమైనవనడం నిరాక్షేపణీయం! అయితే ఆ ప్రాతిపదికపైన రిజర్వేషన్లు కల్పించాలనే అంశంలో ఓ ఇబ్బందుండొచ్చు. సహజంగానే అగ్రకుల పేదలు ఆర్థికాధార రిజర్వేషన్లలో లాభం పొందుతారు.. ఆ మేర నిమ్న కులాల వారు కోల్పోతారు. ప్రస్తుత రిజర్వేషను వ్యవస్థలోనే రిజర్వేషన్ల వలన లాభం నిరుపేదలు తక్కువ.., దీంతో అది మరీ తగ్గిపోతుంది.

    అందుకే.. డబ్బుకూ, కులానికీ అతీతంగా చదువుకునే అవకాశాలు సమానంగా కల్పిస్తే అందరికీ ఉపయోగం! ప్రస్తుత ప్రైవేటీకరణ దశలో ఇదెంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. డబ్బున్నవాడితో సమానంగా పేదవాడినీ చదివించేందుకు ప్రభుత్వం కృషిచెయ్యాలి. వాడితో పోటీ పడే సత్తా కలిగించాలి. అది అయ్యేపనేనా అని మీరన్నారు..

    ఈ ఏడు భారత బడ్జెట్టులో విద్యా రంగానికి 24,000 కోట్ల రూపాయల కంటే కాస్త ఎక్కువగా కేటాయించారు. ఇది మన జీడీపీ లో 3 శాతం కంటే తక్కువట. (పోలిక్కోసం చెబుతున్నాను.. రక్షణ రంగానికి 90,000 కోట్లు, పీఎస్యూల్లో పెట్టుబడులకు, అప్పులకు సుమారు 20,000 కోట్లూ ఇచారు) కనీసం 7 శాతం కేటాయించాల్సిన అవసరం ఉందని మేథోవర్గం అడుగుతోందట! అంటే మరో 35 వేల కోట్లన్నమాట! ఆ మొత్తంలో పది వేల కోట్లు మాత్రం దీనికి కేటాయించారనుకుందాం. ఒక్కో పిల్లవాడికి సగటున ఏడాదికి 3 వేల రూపాయలు ఖర్చు చేస్తే.. ఈ డబ్బుతో 3.3 కోట్ల మంది పిల్లలకు చదువులు చెప్పించవచ్చన్న మాట. ఈ డబ్బు ఒక్క కేంద్ర పొరభుత్వం ఇచ్చేదే, రాష్ట్రాలు ఖర్చు పెట్టేది వేరే మళ్ళీ!

    మరొక్క విషయం.. మలేషియా – మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశమే- విద్యపై ఖర్చు పెట్టేది జీడీపీలో 20 శాతమట!

    మనం తలపెట్టిన పనులు చెయ్యలేక పోవడానికీ, అసలు తలపేట్టకనే పోవడానికీ కారణం చిత్తశుద్ధి, నైతికతా లేని నాయకులేగానీ డబ్బు కాదు. నిజంగా డబ్బు లేక ఆగిపోయినవి చాలా అరుదేమో!

    మీ ఆలోచనలు హుందాగానూ, మాటలు సార్ద్రంగాను, సాదరంగానూ ఉన్నాయి. తోటి మనిషి పట్ల మీ ప్రేమను వెల్లడిస్తున్నాయి. నా జాబులపై మీ వ్యాఖ్యలకు థాంక్స్!

  4. swathi Says:

    wonderful analysis!!!

  5. charasala Says:

    నాన్చడమెలాగో నేర్పినందుకు కృతజ్ఞున్ని.
    చదువరి గారూ నేచెప్పొచ్చేదేమంటే, సమానంగా చదువుకునే అవకాశాన్ని కల్పించినా లేనివాడు, ఉన్నవాడితో సమానంగా చదవలేడు.
    బాగా చదవడానికి లేదా అసలు చదవడానికి ఎన్నో ఇతర సమస్యలు అడ్డు తగులుతాయి. ఈ మద్యనే నేను లక్ష్మణ్ గాయక్‌వాడ్ ఆత్మకథ “ఉచల్యా” చదివాను. అతి పేదవాడికి చదవడం ఎంత కష్టమో చూడండి. అందులో కొన్ని పేరాలు నా బ్లాగ్‌స్పాట్ బ్లాగు http://naapaluku.blogspot.com/2006/06/uchalya.html ( ఈ లింకులనెట్లా రాయలబ్బా!!) లో రాశా చూడండి. ఆర్థిక, సాంఘిక సమానత్వము లేనిదే ఎంత ఖర్చు పెట్టి విద్యాలయాలు కట్టించినా, బద్జెట్టులో ఎంత శాతం కేటాయించినా పూర్తి న్యాయం జరగదు.
    నేను భే భీమవరం లో చదువుతున్న రోజుల్లో విజయవాడ సిద్దార్థ కాలేజి గురించి చాలా చెప్పేవారు. అక్కడ కమ్మ కుల విద్యార్థులు SC, ST, BC విద్యార్థుల్ని ముందు బెంచీలలో కూర్చోనివ్వరనీ …
    అలాగే వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో అద్యాపకుల మద్య రెడ్డి, కమ్మ కులాల వర్గాలు ఆయా కులాల విద్యార్థుల కొమ్ము కాస్తాయనీ..
    ఎంత విద్యాధికులైనా ఇటువంటి నికృష్ట, నీచ, సంకుచిత బావాలు ఉన్నవారు మిగతా వారిని పైకి రానివ్వరు. భయపెట్టో, బెదిరించో, సంప్రదాయాన్ని సాకుగా చూపెట్టో ఫలాల్ని అందకుండా చేస్తారు.
    అదే రాజ్యంగమే ఇంత శాతం మీకు అని నిర్ధారించినపుడు, ఇక దాన్ని అడ్డుకోవటం చాలా కష్టం.
    అయితే దానికీ కొన్ని హద్దులు ఉండాలి. ఓట్ల కోసం, మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోవటం మంచిది కాదు. దీనికి సుప్రీంకోర్టు మార్గదర్షకాలు సరైనవి. రాజకీయనాయకుల వక్రబుద్ది, స్వార్థచింతన వల్ల ఇవి దారి తప్పుతున్నాయి.
    అలాగే నిమ్నకులాల నుండీ, వెనుకబడిన కులాల నుండీ రిజర్వేషనుతో పైకి వచ్చిన వాడు, వాడూ పై తరగతి వాడులా ఆలొచిస్తున్నాడు. ఎంత మాత్రము వెనుక బడ్డ తనవారికి సేవ చేయటం లేదు.
    –ప్రసాద్

  6. kaja sudhakara babu Says:

    ప్రసాద్ గారు,

    మీ విశ్లేషణ ఎంతో బాగుంది. చాలా ఎక్కువ విషయాన్ని కొద్ది పదాలలో వ్రాశారు.

    సుధాకర బాబు

  7. చింతు Says:

    ప్రసాద్ గారికి,
    ఇంత చక్కటి విశ్లేషణ రిజర్వేషాల మీద ఇక్కడే చూడడం.నా మనస్సు లోని ఆలోచనలన్నీ మీ మాటల్లో చూసుకొన్నాను.నేను ఈ విషయం మీద రాద్దామనుకొంటూనే “నాన్చాను”.ఇక మీ బ్లాగు లింకు ఇస్తే సరిపోతుంది.ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: