నేనెందుకు మాంసాహారము మానేశాను?

నేను మాంసాహారము మానేసినప్పటినుండి ప్రతిఒక్కరూ ఎందుకు మానేశానో చెప్పమంటున్నారు. అది చెప్పేముందు రెండు వాదాల్ని మీకు వివరించాలి.

అ) ఆ మద్య సుప్రీంకోర్టుకు ఒక కేసు వచ్చింది. అందులో ఒక యువకుడు మూడేళ్ళ పసిపాపని లైంగికాపచారము (అత్యాచారము కాదు) చేసాడు. ఆ యువకుడి తరపు న్యాయవాది వాదిస్తూ, "మూడేళ్ళ పాపకి మానావమానాలు తెలియవు గనుక, తన కక్షిదారుడు ఆ పాపని అత్యాచారము చేయలేదు గనుక" పాపని అవమానపరిచాడు అన్న కేసుకి విలువ లేదు అన్నాడు. అందువల్ల కేసు కొట్టివేయమని అభ్యర్థించాడు.

అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించక "పాపకు మానావమానాలు తెలియనంతమాత్రాన చేసిన తప్పు మాయమైపోదు" అంటూ అతడికి మామూలుగానే శిక్ష విధించింది.

ఆ)నేను ఇంతకు ముందు మాంసము తింటున్నప్పుడు దానికి నా సమర్థన ఇలా ఉండేది. బలవంతుడిదే రాజ్యము అన్న సూత్రాన్నిబట్టి, బలవంతుడైన మనిషికి బలహీనమైన ఇతర జీవాలు ఆహారమవడం ప్రకృతియొక్క నియమం. ఈ సృష్టిలో ఆహారచక్రంలో ఎవరి కార్యము వాళ్ళు చేస్తేనే, అంటే జింక గడ్డి మేయాలి, పులి జింకను తినాలి, పులి చచ్చి, కుళ్ళి గడ్డికి ఎరువుగా ఆహారం కావాలి. ఇందులో ఎవరు వాళ్ళ పని చేయకపోయినా ప్రకృతి పని భారమవుతుంది.

అయితే నా ఈ వాదానికి గట్టి ఎదురు దెబ్బ, నేను రెండో ప్రపంచయుద్ద సమయములో హిట్లర్ యూదుల్ని పెట్టిన హింసలు గూర్చి చదివినప్పుడు తగిలింది.

నేను మాసము తినడానికి ఏ వాదాన్నైతే సమర్థించానో హిట్లర్ కూడా యూదుల్ని నిర్మూలించడానికి అదే వాదాన్ని సమర్థించాడు. వ్యాధులతో పుట్టిన పిల్లలనీ, వృద్దులనీ, వికలాంగులనీ దయలేకుండా చంపడానికి ఈ వాదాన్నే నమ్మాడు. బలమైన వాడికే బతికే హక్కు ఉంది అన్నాడు. బలహీనమైన వాళ్ళకు, తక్కువ జాతి అనుకున్న వాళ్ళకు సంతానము కలగకుండా శస్త్రచికిత్సలు చేయించాడు. అప్పుడున్న విషప్రచారము వల్ల యూదులు తక్కువ జాతి వారిగా నిర్దారించి వారు బతికియుండడం వల్ల శ్రేష్టమైన జర్మను జాతికి కష్టాలు తప్పవని వారి నిర్మూలనకు పూనుకున్నాడు. ఇది bird flu (పక్షి జ్వరం) కు భయపడి కోళ్ళను నిర్మూలించ పూనుకున్నవిధంగా.

మనము ఆవు (కాకపోతే గొర్రె లేదా కోడి) పాలు పితుక్కొని, ఆవు పేడను ఎరువుగా ఉపయోగించుకొని, దాన్ని చంపి మంసాన్ని తిని, దాని చర్మాన్ని చెప్పులుగా, బెల్టులుగా తయారు చేసుకుని మనల్ని మనం ఎంతో నాగరీకులంగా బావిస్తుంటాము.

హిట్లర్ అకృత్యాలు కూడా ఇదే తరహాలో ఉన్నవి. యూదుల్ని చెరపట్టి, అందులో పనిచేయగల వారితో చచ్చేవరకు పని చేయించుకుని (మనం ఎద్దులతో చేయించుకున్నట్లు) ఆ తర్వాత లేదా ముందే వారి దగ్గరున్న వస్తువులు, సంపదా అంతా కాజేసి, ఆ తర్వాత విషమిచ్చి(లేదా తుపాకి గుళ్ళతో) చంపి, శవానికి తలగొరిగి, అందమైన పచ్చలున్న శరీరభాగాల చర్మాన్ని ఒలుచుకొని, పళ్ళలో ఉన్న బంగారము తోడుకొని ఆ శవాన్ని కొలిమిలో తగలబెట్టేవారు.

తలవెంట్రుకలతో ఎవో గొంగళ్ళు చేసేవారట. పచ్చలున్న శరీరభాగాల చర్మాలతో పడక గది దీపాలకు shades (అందమైన తొడుగులు) చేయించుకునేవాళ్ళట.

ఇందులో జంతువులతో మనము కూడా ఇవన్నీ చేస్తున్నాము కానీ హిట్లర్ ను మాత్రమే దుర్మార్గుడు అంటున్నాము. హిట్లరే కొద్ది నయము, అతని మూక యూదుల్ని చంపింతర్వాత శవాల్ని కాల్చారేగాని ఆ మంసాన్ని తిన్న ఋజువు లేదు. కాని మనం జంతువులతో అవన్నీ చేసి, అపైన ఆ మాంసాన్ని కూడా తింటాము. ఆహా! ఎంత నాగరీకులం.

హిట్లర్ చేసింది తప్పని మనమంతా ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము చేస్తున్నదీ తప్పే. ఇక మనకొచ్చే ధర్మసందేహము .. మనుష్యులకు బాధ, సుఖం తెలుసు, జంతువులకు అలాంటి గుణము లేదు అని.

ఇప్పుడు మీరు యువకుదు మూడేళ్ళ పాపకి చేసిన అవమానానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ చదవండి. చేసింది తప్పా కాదా అనేది చేస్తున్నవాడి జ్ఞానము మీద ఆదారపడి ఉందే కాని, జంతువుకు అది తెలుసా లేదా అనేదాని మీద ఆదారిపడిలేదు.

కాబట్టి ప్రకృతికి దయాధర్మాలు లేవు. దానికి తెలిసిందిల్లా క్రియా ఫలితాలు మాత్రమే. ఈ పనికి ఈ ఫలితము ఉంది, అంతే తెలుసు. ఐతే మనిషి కొక్కడికే ధర్మధర్మ విచక్షన తెలుసు గనక, ఆలోచించే శక్తి ఉంది గనుకా, అన్ని జీవులలోకి శక్తి సంపన్నుడైనాదు గనుకా, ఇతర బలహీనులైన జీవుల రక్షణ మనిషి చేతిలోనే ఉంది. ప్రజాస్వామిక ప్రభుత్వము బలహీనుల్ని, బలవంతులనుండి ఎలా కాపాడుతుందో అలాగే బలహీనమైన జీవుల రక్షణ మనిషి భాద్యత.

రక్షించక పోతేమానె జిహ్వచాపల్యముకోసము (ఆకలికోసమైతే తినడానికి చాలా ఉన్నాయి) జంతువుల్ని, జంతువుల్లాగా చంపి వాటి శవాల్ని తినటము మహా నీచము.

మీలో కొందరు వృక్షాలకి కూడా జీవము ఉంది వాటికీ బాధ, సంతోషము తెలుసు, వాటిని తినడం కూడా నీచమే కదా అనవచ్చు.
మీరు చెప్పేది నిజమైయుండవచ్చు. మనుషుల్ని చంపిన హిట్లర్ ఎక్కువ పాపి, జంతువుల్ని చంపే మీరు తక్కువ పాపులు ఐతే మొక్కల్ని చంపి తినే నేను మీకంటే తక్కువ పాపిని. మానవ మేధస్సు ఆ స్థాయికి ఎదిగి మొక్కల్ని కూడ చంపకుండా జీవించడం ఎలాగో తెలుసుకుంటే ఆ రోజు నేను మొక్కల్ని తినడం కూడా మానుకుంటాను.

మీరేమంటారు?

–ఫ్రసాద్

11 వ్యాఖ్యలు to “నేనెందుకు మాంసాహారము మానేశాను?”

  1. swathi Says:

    చాలా బాగా చెప్పారు. కొందరైనా ఆర్ధం చేసుకోగలిగితే బాగుండు.

    “మనుష్యులకు బాధ, సుఖం తెలుసు, జంతువులకు అలాంటి గుణము లేదు అని.” ఏవరైనా అంటే

    దీనిని నేను ససేమిరా ఒప్పుకోను. జంతువుని చంపేప్పుడు దాని ఆక్రందన విన్న జ్ఞానం కల ఎవరికైనా తెలుస్తుంది అది ఎంత బాధ అనుభవిస్తుందో.
    ఇక్కడ మూడు అంశాలు
    ఆవసరం: మనకి కేవలం మాంసం మాత్రమే తిని బ్రతకాల్సిన అవసరం లేదు. మనిషి కి ఆరొగ్యం గా బ్రతకటనికి కావసిన ఆహరం ఆకుల్లోను, పప్పుల్లోను కూడా దొరుకుతుంది,
    కోరిక: మీరన్నట్టూ జిహ్వ చాపల్యం.మనసుతో ఇంద్రియాలని లోబరుచుకునె శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉన్న వరం.
    విచక్షణ:కనీస విచక్షణ. జీవితం లో యే ఒక్కసారైన జంతువుల ఆక్రందనలు విని కూడా చలించలేదంటె ఈ విచక్షణ లోపించినట్టే.
    లోకం లో జరిగే ఎన్నో ఘోరాల్ని, తప్పుల్ని, అత్యాచారాల్ని ఆపగలిగే ధైర్యం, అవకాశం మనకి లేకపోవచ్చు. కనీసం మన చేతులరా చేసే తప్పుల గురించయినా అలోచించగిలిగితే నయం.

    Prasad, Thank u very much for writing a detailed article on this.

  2. C.Narayana Rao Says:

    మీ వాదన సతార్కికంగాను, ఒప్పించే రీతిగాను- చాలా బాగుంది.

    నేనూ 1983లో మాంసాహారం మానేశాను- యమం*లో మొదటిదైన ‘అహింసా ‘ సూత్రపాలనగా;నెహ్రూగారన్నట్లు, మనకడుపులు చచ్చిన/ చంపిన జంతువులకు సమాధులు కాకూడదని.

    *(ఫతంజలి తన యోగ సూత్రాలలో నీతి ధర్మాల సముదాయమంతా ‘యమము, నియమములు ‘ అనే రెండు మాటల్లో ఇమిడ్చారు.చిత్తవ్రుత్తిని నిరోధించి సత్యదర్శనం పొందడానికి వాడే అష్టాంగ రాజయోగంలో మొదటి రెండు మెట్లే ఈ యమ,నియమాలు.యమంలో మొదటిదే ‘అహింస ‘.మనోవాక్కాయకర్మలచేత ప్రత్యక్షంగాగాని, పరోక్షషంగాగాని ఎవ్వరికి హాని కలిగించకుండడమే ‘అహింస ‘.)

  3. Rohini Kumar BRP Says:

    చాలా భాగుంధి.

    అ)మీరు వకటి మరిచారు హిట్లెర్ చేసిన వెధవ పనొకటి మానవమనుగడకు ఉపయోగపడినధి. అధి సెవాలని పరిసొధనకి ఇవ్వటం వలన human body blood circulation path తెలుసుకొవటం అధే ప్రథమం.
    ఆ)ఇంకొకటి చిన్న పాపి పెద్ద పాపి అన్నారు…. వీలయితే ధూడకి పెట్టాల్సిన పాలు మనం తాగడం మానేస్తే ఇంకాస్థ చిన్న పాపి అవ్వవచ్చెమో అలోచించండి

  4. ‌ప్రసాద్ Says:

    ‌మీ అభిప్రాయవ్యక్తీకరణకు కృతజ్ఞతలు.
    మనిషి నాగరికత అబివృద్ది చెందేకొద్దీ మనం మన అలవాట్లు కూడా తగినట్లుగా మార్చుకుంటూ పోవాలి. స్వాతిగారన్నట్లు లోకంలో జరిగే అన్యాయాన్ని ఆపటానికి మనకు ధైర్యం లేకున్నా ఎవరికి వారిని సంస్కరించుకున్నా మొత్తము సంఘము బాగుపడుతుంది.
    విచిత్రము ఏంటంటే మనమెంతో బుర్ర బద్దలు చేసుకుని అలోచించాక కలిగే జ్ఞనోదయము మన పెద్దలకు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే కలగడం. సాత్వికాహారము గురించి మన పెద్దలు చెప్పిన సత్యాలను మంసాహారులు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వారు ఎప్పుడు తెలుసుకుంటారో.
    ఆ మద్యన ఒక అమెరికా రాష్ట్ర గవర్నరు గారు బ్రూణహత్యల నిషేధాన్ని గురించి మాట్లాడుతూ “మనమెంత నాగరీకులమన్నది (civilized people) అత్యంత బలహీనులకు ఎంత రక్షణ కలిపిస్తున్నామన్నదాన్ని బట్టి చెప్పవచ్చు.” అన్నారు. ఆయన ఉద్దేశ్యములో అత్యంత బలహీనులు గర్బస్థ శిశువులే. గుంపులు గుంపులుగా అతి తక్కువ స్థలంలో బందీలుగా చేసి, స్వేచ్చ నిరాకరించి, తల్లినుండి బిడ్డనీ బిడ్డనుండీ తల్లినీ వేరు చేసి, వస్తువుల్లాగా పరిగనించబడుతున్న జీవాలు కాదా అతి బలహీనమైన జీవులు? అత్యంత బలహీనులైన జీవులకు ఆసరా ఇవ్వటం అటుంచి వండుకు తింటున్నవాళ్ళ నాగరికతని ఏస్థాయి నాగరికత అనాలి.
    రోహిణి గారూ, మీరు చెప్పినట్లు పాలు తాగటం మానేస్తే ఇంకా మంచిదే. పాలు పితుకేందుకు కూడా పశువుల్ని కష్టపెడుతున్నారని తెలిసి గాంధీజీ పాలు తాగటం మానివేశాడు. ఐతే అతని ఆరోగ్యము బాగా క్షీనించిఉన్న దశలో, బార్య, మిత్రులు, వైద్యుల ఒత్తిడికి తట్టూకోలేక ఆవు మరియు గేదె పాలు తాగనన్న శపధాన్ని భగ్నపరచలేక రాజీమార్గంగా మేకపాలు పుచ్చుకునేవాడు. అయితే అదికూడా వ్రతభంగకరకమేనని తనకు తెలుసునని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
    అయితే నామట్టుకు పాలు తాగడమనేది పాపకార్యము కాదు. నా కంచములోది తిన్నాక నా పక్కవాడి కంచములోది దొంగిలించి తినడం లంటిదే ఇది అని నా ప్రస్తుత అభిప్రాయము. దీన్ని కాదనగల సహేతుకమైన వాదన నాక్కనిపిస్తే, పాలుకూడా తాగటం మానివేస్తాను.
    –ప్రసాద్

  5. వెంకట రమణ Says:

    ఇక్కడ నేను కొన్ని విషయాలని మనవి చేద్దామనుకుంటున్నాను.
    అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్ల కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.

    ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు అతని కంటే అతని మీద ఆధారపడి జీవించేవాళ్ళే ఎక్కువ భాదపడతారు. పైగా ఒక మనిషి చనిపోయేటప్పుడు భాద పడేది శారీరికంగా కంటే మానసికంగావే ఎక్కువ. ఎవరికైనా చావు, దానితోపాటు కలిగే శారీరక భాద తప్పని విషయం, కాని మానసిక భాద అనేది ఒక్క మనిషికే సొంతమని నేను నమ్ముతాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే జంతువులను చంపడాన్ని, మనుషులను చంపడాన్ని ఒక్కగాట కట్టలేము.
    ఇ) ఇక జంతువులచేత పనిచేయించుకొనే విషయానికి వస్తే, పనిచేయింటుకోవడానికి హించించడానికి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే మనం మనుషుల చేతకూడా చాలా పనులు చేయించుకుంటాం మరియు మనం వేరే వాళ్ళకు చేస్తుంటాం (లేక పోతే బ్రతకలేం కద).
    ఈ) ఒక ప్రాణి చనిపోయిన తరువాత దాని శరీరంతో ఏమిచేసినా ఇక దానికి భాద ఏముంటుందండి. కాబట్టి, వాటి శరీరాలను కాల్చడమో, పూడ్చడమో చేసే బదులు వాటిని వాడుకోవడంలో నాకు తప్పేమి కనిపించడంలేదు.

    మీకు నా మెదటి రెండు పాయింట్లలో నిజమున్నట్లు ఏమైనా అనిపిస్తే, మీ పాత వాదం (ఆ. లో మీరు వ్రాసింది) ఇంకా వర్తిస్తుందేమో ఆలోచించండి.

    చివరగా నేను చెప్పదలచుకున్నదేమిటంటే ఏవో జంతువులు చనిపోతున్నాయని భాదపడేకంటే, తినడానికి తిండిలేకనో లేక మనం తీర్చకల్గే మరొక సమస్య వల్లనో, చస్తూ బ్రతికే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. (ధయచేసి దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి, ఒక సారి ఆలోచించి చూడండి.)

  6. వెంకట రమణ Says:

    http://uvramana.wordpress.com/2006/06/10/మాంసాహారము

  7. మురళీకృష్ణ Says:

    మాంసాహారం గురించి నా అభిప్రాయాలు ఇక్కడ చదవండి.
    http://saakshi.blogspot.com/2006/06/blog-post_11.html

  8. Mohammed Kareemullah Says:

    Non-Vegetarian, by definition means – ‘A person who has food of animal origin’. It does not mean… ‘A person who does not have Vegetarian food… it does not mean, a person who does not have vegetable and fruits.’ Let it be very clear to all of you. A more technical and a scientific word is, ‘an Omnivorous diet’. A person who has many types of food, especially foods of plant and animal origin. ‘Vegetarian’, it does not come from the word ‘Vegetables’- it comes from ‘Vegetas’ which means…‘ full of breath, full of life’ there are various types of ‘Vegetarians’. We have ‘Fructorians’, who only eat fruits and nuts – then we have the ‘Vedanta’, who do not have any animal products – we have ‘Lacto Vegetarian’, who have milk, ‘Ovo Vegetarians’ who have eggs – ‘Lacto-Ovo Vegetarians’, who have egg and milk also – ‘Pesco Vegetarians’ who eat fish. ‘Semi Vegetarians’ who also have Chicken. This classification is done by the Vegetarian Society.
    According to Dr. William T. Jarves, the advisor to the ‘American Council of Science and Health’ ‘ACSH’, the ‘Professor of Public Health and Preventive Medicine’ in the Lomalinda University, the founder and the President of the ‘National Council Against Health Frauds’ and the co-editor of the book ‘The Health Robbers – a closer look at Ouakery in America’ he classifies ‘Vegetarian’ based on the behavior’s stand point, into two categories… ‘Pragmatic Vegetarian’ and ‘Ideological Vegetarian’. ‘A Pragmatic Vegetarian’ chooses his diet on objective health reasons – He is more reasonable in his approach, rather than emotional. ‘The Ideological Vegetarian’ on a other hand, he chooses his diet based on a principle, which is based on ideology – he is more emotional, rather than reasonable. And Dr. William T. Jarves says… ‘One can spot an Ideological Vegetarian, by his exaggeration of the benefits of Vegetarianism And the lack of skepticism, and the over looking of the fact that extreme Vegetarianism, can lead to potential health risk’. He says that…‘The ideological Vegetarian… he pretends to be like a scientist, but he is more like a lawyer, than like scientist’ Dr. William T. Jarves says that… ‘Ideological Vegetarianism’ is filled with hypothesis – It is filled with extremism, from which even scientists and doctors are not immune’.
    Let us analyze the various reasons, why a person chooses a food habit. It can be Religious, it can be Geographical location, it can be a personal choice, smell, taste, colour’. Due to humane or ethical consideration, due to anatomical and physiological consideration, due to behavioral consideration, it can be due to ecological and economical consideration, it can be due to nutritional value or due to health and scientific reasons… health and medical reasons. Let us first analyze the Religious reasons, ‘There is not a single major religion which bans or prohibits, all Non-Veg. food in general’ Jains are only 0.4% of India – 0.4 , less than 1 percent – Can you call it a major Religion in India? – leave aside the world – World out of the question… Negligible.
    – some says ‘Religion should not interfere with the human being… where it is concerned, what we should, and what we should not eat – That we should leave it up to the doctor’. The Religious authority, the main foundation… that is Almighty God, if He is not a doctor, the God that you worship is not a doctor, then you should not follow him like in the case of most of the religions. But in Islam, we believe… Allah (SWT), Almighty God, is our Creator – and the Creator of the human beings has far Superior knowledge, than all the doctors put together, in all the years.
    As far as Islam is concerned, it is not compulsory for a human being to have Non-Veg. – a Muslim can be a very good Muslim, even by being a pure Vegetarian. But… but when our Creator… Almighty God… Allah (SWT), gives us permission to have Non-Veg., why should we not have it? . Let us analyze the geographical reasons and the surrounding environment… and as we know, it influences is the person’s food habit – like people living in the coastal region … the Kookiness, they have more fish – People living in South India, they have more Rice – People living in the desert, where there is scarcity of vegetation, and people mainly survive on the flesh of animals. The Eskimo in the Arctic region, where there is scarcity of edible vegetation, they survive more on sea food. Let us analyze the ‘Humane reason’, the ‘Ethical reasons’ – And the pure Vegetarians, they say that… ‘All life is sacred – and no living creature should be killed’. They fail to realize that today, it is a universal fact, that even plants have got life – So the main argument on killing living creature, does not hold good today. Previously may be… a couple of centuries ago, it may have held some weight, but today it carries no weight. Then they further argue today, and they say… ‘Yes we know that plants have got life, but they cannot feel pain… therefore killing a plant, is a lesser crime and lesser sin, as compared to killing an animal’. Today, science has further advanced, and we have come to know that even the plants can feel pain, they can even cry – But the cry of the plant cannot be heard by the human ear, because the audible frequency range of the human ear, is from 20 cycles per second, to 20,000 cycles per second – Anything below and above this, the human ear cannot hear.
    from vedas –
    meaning of sanskrit word goghnam – means guest . how the goghnam formed ? go means cow and ghnam – means kill, so goghnam formed from kill cow which is giving the meaning of guest. in olded days when a guest comes to home, cow was slaughtered for his lunch/dinner. This was the openion of Dr Bhola Naath Tivari in his famous book Sabdala jeevanam. since they were not taken as sin to kill cow and make a feast for the guest, people of olden india were non vegeterians. Do you consider them out of sacred religion ?
    Its a lengthy discussion and detailed debate . visit irf.net , there is debate on it under downloads, audio section.

  9. ‌ప్రసాద్ Says:

    వెంకత రమణ గారూ,

    మీ వాదనతో నేను ఏకీభవించలేను.
    మనం చంపకపోయినా ఎప్పటికైనా మరణిస్తాయనే వాదన ఎవర్నైనా సహజ మరణం కంటే ముందే భాధారహితంగా చంపవచ్చును అంటున్నట్లుంది. దీన్ని ఏ మతమూ, ఏ ఇజమూ అంగీకరించదు. పైగా దాని దేహన్ని మన కడుపు నింపుకోవటం కొరకు చంపటం అసలు న్యాయం కాదు. మీరు (ఈ) లో చెప్పిన అంశమును నేను కొద్దిగా అంగీకరిస్తాను. సహజంగా మరణించిన వాటి మంసాన్ని ఎవరైనా తినదలిస్తే అందుకు ఎవరినుండీ కూడా అబ్యంతరము ఉండకూడదు. అయితే కడుపు కోసమే చంపి ఆ తర్వాత ఎలాగూ చచ్చినవే గద అని తినవచ్చు అనే వాదన సరైంది కాదు.
    (పాప విషయాన్ని నేను జంతు హత్యలతో పోల్చలేదు. బాదింపబడిన వానికి మనసు లేదన్న కారణంగా బాదించుట నేరము కాక పోదు అని మాత్రమే నేనా ఉదాహరణ ద్వారా చెప్పదలిచాను. జంతువులకు విషాదము తెలియదనీ, మనము వాటికి చేసే హాని హాని కాకుండా పోదు.)
    పూర్తిగా మనుష్యుల గురించే మదనపడే సమాజంలో మనం చేసే పనిలో జంతువుకు బదులు మనిషిని పెట్టి అలోచిస్తేనే దాని తీవ్రత అర్థమవుతుంది. మానిషిక బాద ఉండదన్న కారణాన వాటిని చంపే హక్కు మనకుంటే, మానసిక బాధ ఉండని మానసిక వికలాంగుల్ని మనం చంపవచ్చునా?
    జంతువులతో పని చేయించుకునే విషయంలో (వాటిని హింసించనంతవరకూ) తప్పు లేదనే నా అభిప్రాయము కుడా.
    రాతి యుగమో ఇంకా అంతకు మూందో, చనిపోయిన తర్వాత మనిషి శవాన్ని మనుషులు తినేవారేమో! నకుల సహదేవులు తమ తండ్రి శవాన్ని తినటానికి ఉపక్రమించి చిటికిన వేలు తింటారట కదా? అది ఇప్పుడు మనకెంత జుగుప్సా కరంగా ఉంటున్నదో, తర్వతి తరాలకు జంతుమాంసము తినటము అంతే జుగుప్సాకరముగా తోచవచ్చు.

    మీరు చివరగా చెప్పిన మాట చాలా బాగుంది. మానవసేవకి నేనెప్పుడు వ్యతిరేకం కాదు. కాని మాంసము తినకపోవటమనేది నా చేతుల్లో ఉన్న అతి సులభమైన విషయం కదా. దీన్నే చేయలేకపోతే అంతో ఇంతో కష్టమైన పరసేవ ఎలా చేయగలము?

    — ప్రసాద్

  10. ‌ప్రసాద్ Says:

    ‌కరీముల్లా గారు vegiterian లలో రకాలు బాగా చెప్పారు.
    నేను మంసాహారము మానేయాలనుకున్న రోజు ఇవన్నీ అలోచించలేదు. వేదకాలంలో ప్రజలు గోమాంసము తినేవారా కాదా అన్నది కూడా అలోచించలేదు. హిట్లర్ యొక్క అకృత్యాలు “జంతువుల్లాగా చంపాడు, జంతువుల్ని తోలినట్లు తోలాడు…” అని నాలొ నేను ఎన్నోసార్లు అనుకునేలా చేశాయి. ఆ వెంటనే “జంతువుల్ని అయితే ఇలా చేయవచ్చా?” అనే మధన ప్రారంబమయ్యింది. మనిషికి, జంతువుకీ ఉన్న భేధమేమిటి అనే మీమాంస బయలుదేరింది. మనసు లేకపోవటం, మట్లాడలేకపోవటం ఇవేనా వాటిని హింసించటానికి మనకు అధికారాన్నిచ్చాయి అనిపించింది. ఇతరులకు ఉపదేశించే బదులు నాతోనే ప్రారంబిద్దామనుకొన్నాను. అంతే.
    ప్రధాన మతాలన్నీ చెప్పనంత మాత్రాన చాలా సామాన్యంగా తప్పుగా కనిపించే (నాకు మాత్రము చాలా సామాన్యవిషయంగా ఉంది, అందరికీ అలా కనిపించాలని నేనత్యాశ పడను.) విషయం ఒప్పవుతుందా?
    హిందూమతము పరమాత్మ, పరమేశ్వరుడు, పరబ్రంహ్మ(GOD, ALLAH(SWT) whatever the name is) సర్వాంతర్యామి, అన్నిటిలోను ఉండి, అన్నీ తనలో ఉండే వాడని చెపుతుంది. కాకపోతే ప్రతి జీవియొక్క కష్టసుఖాలు దాని యొక్క ఖర్మ ఫలితాలు అనటంతోటే వస్తుంది చిక్కంతా. నా మతం ప్రకారం జీవులన్నింటికి ఈ పంచభూతాలూ సమానంగా దక్కాలి. ప్రతి జీవి పరమాత్మాంశమే అయినప్పుడు ప్రతి జీవికి సమానంగా జీవించే హక్కు ఉంది. అయితే అన్ని జీవులలోకి మానవుడే బుద్దిశాలి కనుక అతడే మిగతా జీవుల పట్ల శ్రద్దను చూపించాలి.

    — ప్రసాద్

  11. Yamini Krishna Bandlamudi Says:

    Explained well

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: